అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 6, 2024

    Poor Richard’s Almanac 34… Benjamin Franklin, American

    331.   Love and be loved.             ప్రేమించు, ప్రేమించబడు.    332. Love, cough, and smoke can’t well be hid.             ప్రేమ, దగ్గు, పొగ — ఎంత దాచినా దాగవు.    333. Lovers and Lordship hate companions.             ప్రేమికులూ, ప్రభువులూ పోటీని సహించలేరు.   334.  Lovers, travelers, and poets will give money to be heard.            ప్రేమికులూ, యాత్రికులూ, కవులూ ……

  • జనవరి 2, 2024

    Poor Richard’s Almanac 33… Benjamin Franklin, American

    321     Let thy discontents be thy secrets; if the world knows them it will despise thee and increase them.            నీ అసంతృప్తి నీలోనే ఉండనీ. లోకానికి తెలిస్తే, నిన్ను ద్వేషించి మరింత అసంతృప్తికి గురిచేస్తుంది. 322    Let your maid servant be faithful, strong, and homely.            నీ సేవకురాలు నమ్మకంగా,…

  • డిసెంబర్ 29, 2023

    భయం… ఖలీల్ జిబ్రాన్, లెబనీస్- అమెరికను కవి

      సముద్రంలో కలవడానికి ముందు నది భయవిహ్వలం అవుతుందని నానుడి. మహోన్నత గిరి శిఖరాలనుండి దుర్గమారణ్యాలూ, నవసీమల చుట్టుదారులంట తాను నడిచిన దారులు పరికించి చూస్తుంది. దాని ఎట్ట ఎదుట సువిశాలమైన సముద్రాన్ని చూస్తుంది అందులో అడుగిడటమంటే మరేమీ కాదు, తన అస్తిత్వాన్ని శాశ్వతంగా వదులుకోవడమే. కానీ మరో దారి లేదు. నది వెనక్కి మరల లేదు. ఆ మాటకొస్తే ఎవరూ వెనక్కి పోలేరు. జీవితంలో వెనక్కి పోవడం అసంభవం. తప్పదు. నదికి సముద్రంలోకి అడుగిదే సాహసం…

  • డిసెంబర్ 28, 2023

    మట్టికంటే నివురు కావడమే నాకిష్టం… జాక్ లండన్, అమెరికను రచయిత

      నా శరీరంలోని వెలుగు బ్రహ్మాండమైన తేజస్సుని వెదజల్లుతూ మండి నుసి అయిపోవడం నాకిష్టం ఎండి, మోడువారి నశించడం కంటే. నేనొక అద్భుతమైన ఉల్కనై, ప్రతి అణువూ వెలుగు విరజిమ్మడం ఇష్టం, నిదురోయే గ్రహశకలంలా చిరకాలం మనడం కంటే. మనిషి పుట్టింది జీవించడానికి ఏదోలా వెళ్ళదీయడానికి కాదు. నా ఆయువుని ఏదోలా పొడిగిస్తూ వ్యర్థం చేసుకోను. జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకుంటాను. . జాక్ లండన్ ప్రఖ్యాత అమెరికను రచయిత   I would rather be…

  • డిసెంబర్ 24, 2023

    పూర్తికాని ఉత్తరం … సూసన్ వైజ్మర్, కెనేడియన్ కవయిత్రి

    నిద్రలోజోగుతున్న తరుసమూహాల మధ్య, తియ్యని చీకటిముసుగు లోంచి తెలియకుండా హేమంతపు పొద్దు పొడుస్తుంది నేనింకా పొయ్యిదగ్గర వెచ్చగా చలి కాగుతూ ఉంటాను కాగితం కలం తీసుకుని నీకు ఏదో ఉత్తరం రాస్తూ. ఇంటిల్లిపాదీ ఇంకా నిద్రలోనే ఉంటారు పాపం మా పక్కింటివాళ్ళు, ఇకనుండి వారిది కాని ఇంట్లో అప్పుడే నిద్రలేచారు. ఏవి తీసుకు వెళ్ళాలో, ఏవి విడిచిపెట్టాలో మళ్ళీ నెల ఎక్కడ ఎలా గడపాలో అన్న బెంగతో. ఈ పట్నంలో అద్దెలవాళ్ళకి పెద్దగా ఎంచుకుందికి అవకాశాలు లేవు.…

  • డిసెంబర్ 22, 2023

    ఈ చిన్ని గులాబీ గూర్చి ఎవరికీ తెలీదు… ఎమిలీ డికిన్సన్ అమెరికను కవయిత్రి

    ఈ చిన్ని గులాబీ గురించి ఎవరికీ తెలీదు అది బహుశా ఒక యాత్రికుడు కావచ్చు నేను దారిలో పడినదాన్ని ఏరుకొచ్చి వాసన చూడమని ఇయ్యలేదూ? మహా అయితే ఒక తేనెటీగ దానికై విచారిస్తుంది లేదా మరొక తుమ్మెద. దూరతీరాలనుండి ఎగిరొస్తూ దాని గుండె మీద వాలిన పిట్ట బహుశా ఆశ్చర్యపోవచ్చు- లేదా ఒక చిరుగాలి నిట్టూర్చవచ్చు- ఓ చిన్ని గులాబీ! నీలాంటి వాళ్ళకు మరణం ఎంత సులువో కదా! . ఎమిలీ డికిన్సన్ అమెరికను కవయిత్రి  …

  • డిసెంబర్ 21, 2023

    తప్పదనుకుంటే ఖాళీగా కూచో … రోజ్ మిలిగన్, బ్రిటిషు కవయిత్రి

    ఖాళీగా కూచుని దుమ్ముపడతావా? అంతకంటే బొమ్మ గీయడమో, ఉత్తరం రాయడమో, రొట్టె కాల్చడమో, విత్తు నాటడమో మెరుగు కాదూ? కోరికకీ,అవసరానికీ మధ్యనున్న తేడా ఆలోచించుకో. ఖాళీగా కూచోవాలనుకుంటే కూచో. కానీ అట్టే సమయం లేదు. ఎన్ని నదులు ఈదాలి, ఎన్ని పర్వతాలు అధిరోహించాలి! ఎంత సంగీతం వినాలి, ఇంకా ఎన్ని పుస్తకాలు చదవాలి!! ఎందరు మిత్రుల్ని పోగేసుకోవాలి, ఎంత జీవితం గడపాలి!!! తప్పదనుకుంటే ఖాళీగా కూచో. కానీ ఆ ప్రపంచాన్ని చూడు: కళ్లలో సూర్యుడు మెరుస్తూ, జుత్తుని…

  • డిసెంబర్ 20, 2023

    జపనీస్ కవి బాషో 7 కవితలు

      1 జలజలా రాలుతున్న హిమబిందువులారా!ఈ తుచ్ఛమైన జీవితాన్నిమీ స్పర్శతో ప్రక్షాళన చేసుకోనీయండి!  2 రోడ్డువార చిన్ని మొక్కపాదచారులని చూద్దాని ముందుకి వంగింది.దారినపోతున్న ఓ గాడిద దాన్ని నమిలి మింగింది. 3 ఓ పిచ్చుక నేస్తమా! నిన్ను బ్రతిమాలుకుంటాను. నా రేకుల్లో రాగాలుతీస్తూఆడుకుంటున్న కీటకాల జోలికి పోకుమా! 4 ఎక్కడో దూరంగా, ఒక ఒంటరి తటాకంచెంగున ఒక కప్ప దూకీ దాకానిశ్చలంగా, యుగాల నిర్వికల్ప సమాధిలో ఉంది. 5 అలనాటి రణరంగం. ఇరవై వేలకు పైబడి మరణించిన…

  • డిసెంబర్ 19, 2023

    తీరిక… విలియం హెన్రీ డేవీస్ వెల్ష్ కవి

    నిత్యం భవిష్యత్తుకై చింతిస్తూ క్షణమైనా ఆగి, చూసే తీరిక లేకుంటే జీవితానికి అర్థం ఏమిటి? నీడలో నిలబడి సేదదీరడానికిగాని తనివిదీరా జీవజాలాన్ని పరికించే సమయంలేకుంటే, గడ్డిలో ఉడుతలు తాము సేకరించిన ఆహారాన్ని దాచుకునే ప్రకృతి దృశ్యాన్ని చూసే తీరికలేక దాటిపోతుంటే, రాత్రిపూట నక్షత్రాల్లా, పట్టపగలు మిలమిల మెరిసే సెల్లయేటి కెరటాల నక్షత్రాలని చూసే తీరికలేకుంటే, మనసు దోచుకునే ప్రకృతిలోని సౌందర్యాన్ని తిలకించడానికీ ఆమె పాదాలు ఎంత అందంగా నర్తిస్తున్నాయో చూసే తీరికలేకపోతే, ఆమె కన్నుల్లో విరిసిన చిరునవ్వుల…

  • డిసెంబర్ 18, 2023

    ప్రార్థన… ఎడ్విన్ మార్ఖామ్ , అమెరికను కవి

    జాడతెలియకుండా గరిక ఎదిగినట్టు తండ్రీ! నాకు ఎరుక చేయ్యి; నిర్దయగా ఈ ప్రపంచం నా గుండెమీద చావుదెబ్బలని నిశ్చలమైన గండశిలలా ఎదుర్కోనగలిగడం మప్పు; నా మనసుకి, శక్తిని కూడదీసుకునే ప్రాపు చేసి, ఒక మామూలు పువ్వుని చెయ్యి; ఆశగా తలెత్తి చూసే పాపీ పువ్వులా ఎండిన ఈ గుండెని, నిండుగా నిండనీ ఈ బ్రతుకుని దాని వయో భారాన్ని తల దించుకున్న పాపీ పువ్వులా ధరించనీ. తండ్రీ! నాకు ఒక చెట్టులా, దయగా, శాంతంగా ఉండడం ఎలాగో…

←మునుపటి పుట
1 … 3 4 5 6 7 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు