అనువాదలహరి

జంటబాసిన పులుగు… షెల్లీ, ఇంగ్లీషు కవి

జంటబాసిన పులుగొకటి శీతవేళ

కొమ్మపై కూర్చుని రోదిస్తున్నది ;

పైన గడ్డకట్టిన శీతగాలి కోత

క్రింద గడ్దకడుతున్న సెలయేటి పాత.

ఆకురాలిన అడవిలో మచ్చుకైన లేదు చిగురు

నేలమీద వెతికితే దొరకదు పూలతొగరు

గాలిలో లేదు సన్ననిదైన విసరు

ఉన్నదొక్కటే మిల్లు చక్రపు విసురు.

.

P. B. షెల్లీ

(4 August 1792 – 8 July 1822)

ఇంగ్లీషు కవి

.

PB Shelly
Image Courtesy:
http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens

.

The Widow Bird

.

A widow bird sate mourning for her love

Upon a wintry bough;

The frozen wind crept above,

The freezing stream below.

There was no leaf upon the forest bare,

No flower upon the ground,

And little motion in the air

Except the mill-wheel’s sound.

.

PB Shelly

English Poet

Poem Courtesy:

https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n351

పిచ్చుక తొలి జాడ… చార్లెట్ స్మిత్, ఇంగ్లీషు కవయిత్రి

పోడు మీద ముళ్లపొదలు పచ్చగా కనిపిస్తున్నై

చెరువుగట్ల నీలిపూలు ఆనందంతో లాస్యంచేస్తున్నై

సిందూర వృక్షాలు పూతకొచ్చాయి, వాటి మొదళ్ళలో

ముళ్ళగోరింటలు త్వరలోనే మాలలు అల్లనున్నాయి,

మే నెల ఎండలో కనిపించే పూమాలలు.

చిక్కబడిన వసంతఋతువు తొలి చుట్టం

పిచ్చుక కూడ చివరకి అడుగుపెట్టింది.

సరిగ్గా సూర్యాస్తమయవేళ, పిట్టలు కూసే వేళ

అది తుర్రుమంటూ పరిగెత్తుకు రావడం చూసేను

ఎప్పటిలాగే దానికి స్వాగతం పలికేను.

ఓ వేసవి చుట్టమా! రా! రా!

నా రెల్లుగడ్డి ఇంటిచూరుకు నీ మట్టిగూడు అల్లుకో

ఇక ప్రతిరోజూ తెల తేలవారే వేళ

నా పర్ణశాల చూరుక్రింద నువ్వుపాడే

సంగీతాన్ని నన్ను చెవులారా విననీ!

.

ఛార్లెట్ స్మిత్

(4 May 1749 – 28 October 1806)

ఇంగ్లీషు కవయిత్రి.

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

The First Swallow

.

The gorse is yellow on the heath,

The banks with speedwell flowers are gay

The oaks are budding, and, beneath,

The hawthorn soon will bear the wreath,

The silver wreath, of May.

The welcome guest of settled Spring,

The swallow, too, has come at last;

Just at sunset, when thrushes sing,

I saw her dash with rapid wing,

And hail’d her as the past.

Come, summer visitant, attach

To my reed roof your nest of clay,

And let my ear your music catch,

Low twittering underneath the thatch

At the grey dawn of day.

.

C. Smith

(4 May 1749 – 28 October 1806)

English Poet 

Poem courtesy:

https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n336

పిచ్చికుక్కపై స్మృతిగీతం… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఐరిష్ కవి

సదయులారా! సహృదయులారా!

నా కథని ఒకసారి ఆలకించండి!

ఇందులో మీకు కొత్తదనం కనిపించకపోతే

మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టదు.

అనగనగా ఇస్లింగ్టన్ అనే ఊరిలో

ప్రపంచమంతటా కీర్తిగణించిన,

ప్రార్థనచెయ్యడంలో అతన్ని మించినవాడు

లేడనిపించుకున్న ఒక భక్తుడుండేవాడు.

శత్రువునైనా, స్నేహితుడినైనా సమదృష్టితో చూసి

సాంత్వననీయగల కరుణార్ద్ర హృదయుడాతడు

అతనికి వస్త్రధారణపై మమకారం లేక

ఎప్పుడూ దిగంబరిగానే తిరిగే వాడు.

అన్ని ఊళ్ళలో ఉన్నట్టే ఆ ఊరిలోకూడా,

ఒకానొక కుక్క ఉండేది,

అక్కడ మేలుజాతి వేటకుక్కనుండి, సంకరజాతి,

ఊరకుక్కల వరకు అన్నిరకాలూ ఉన్నాయి.

మొదట్లో ఆ వ్యక్తీ, ఈ కుక్కా స్నేహంగా ఉండేవారు

కానీ ఎందుకో కోపం వచ్చి స్నేహం చెడింది.

అంతే, దాని ప్రతాపం చూపించడానికి,

పిచ్చెత్తినట్టు ఒకసారి అతన్ని బాగా కరిచేసింది.

అయ్యో అంటూ చుట్టుపక్కల వీధులవాళ్ళు

ఆశ్చర్యంతో, పరిగెత్తుకుంటూ వచ్చారు

ఈ కుక్కకి నిజంగా పిచ్చెక్కిందనీ, లేకపోతే

అంతమంచి మనిషిని కరుస్తుందా అని కొందరన్నారు.

దేముడిని నమ్మిన ఏ వ్యక్తి కంటికైనా

ఆ గాయం తీవ్రమైనదని తెలుస్తూనే ఉంది.

కొందరు ఆ కుక్క నిజంగా పిచ్చిదని నిర్థారిస్తే

ఆ మనిషి ఇక బతకడని మరికొందరు నిర్థారించేరు.

కాని, కొద్దిరోజుల్లోనే ఒక వింత జరిగి

ఆ ధూర్తులు చెప్పినదంతా అబద్ధమని తేల్చింది.

ఆ మనిషి కుక్కకాటునుండి బయట పడ్డాడు

కానీ, పాపం, చచ్చిపోయింది మాత్రం ఆ కుక్కే!

.

(వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అన్న నవలనుండి)

ఆలివర్ గోల్డ్ స్మిత్

ఐరిష్ కవి, నవలాకారుడు, నాటక కర్తా.

Image Courtesy: http://upload.wikimedia.org

.

An Elegy on the Death of a Mad Dog

.

Good people all, of every sort,

Give ear unto my song;

And if you find it wondrous short,

It cannot hold you long.

In Islington there was a man,

Of whom the world might say,

That still a godly race he ran

Whene’er he went to pray.

A kind and gentle heart he had,

To comfort his friends and foes;

The naked everyday he clad,

When he put on his clothes.

And in that town a dog was found,

As many dogs there be,

Both mongrel, puppy, whelp, and hound,

And curs of low degree.

This dog and man at first were friends,

But when a pique began,

The dog, to gain his private ends,

Went mad, and bit the man.

Around from all the neighbouring streets

The wondering neighbours ran,

And swore the dog had lost its wits,

To bite so good a man.

The wound it seem’d both sore and sad

To every Christian eye:

And while they swore the dog was mad,

They swore the man would die.

But soon a wonder came to light,

That show’d the rogues they lied,

The man recover’d of the bite,

The dog it was that died.

.

(From The Vicar of Wakefield)

Oliver Goldsmith

(10 November 1728 – 4 April 1774)

Irish Novelist, Playwright and Poet

Poem Courtesy:

https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n263

గూటికి… తావో చియాన్, చీనీ కవి

అవినీతి బలిసిపోయిన ప్రభుత్వంలో ఇమడలేక, ఉన్నతోద్యోగానికి వయసులోనే రాజీనామాచేసి, జీవితావసరాలని సంక్షిప్తంచేసుకుని జీవించగలిగితే, ప్రకృతిలో మనిషికి చాలినంత ఉంటుందనీ, కీర్తిప్రతిష్టల లాలసలేనపుడు ప్రకృతితో మమేకమై జివించడానికి మించిన “జీవితం” లేదనీ తన గ్రామానికి తిరిగి వెళ్ళి, పోతనలా హాలికుడై, ప్రకృతికీ, సాహిత్యానికీ ఉన్న దగ్గర సంబంధాన్ని తన జీవితంద్వారా ఋజువుచేసిన కవి తావో చియాన్. 

ఈ దిగువనిచ్చిన లింకులోనూ, వికీపీడియాలోనూ ఈ కవిగురించి మంచి సమాచారాన్ని చదవొచ్చు.

.

ఏప్పటినుండో నాకు అనిపిస్తుండేది ఈ కొండలూ, సరస్సులూ

రా రమ్మని నన్ను పిలుస్తున్నట్టు; రెండో ఆలోచన చేసే వాడిని కాదు

కానీ నా కుటుంబమూ, స్నేహితులూ నేను ఒక్కడినీ ఉంటానన్న

ఆలోచననే అంగీకరించే వారు కాదు; అదృష్టవశాత్తూ ఒక రోజు

నన్ను ఒక వింత ఆవేశం ఆవహించి ఉన్నపళంగా బయలు దేరాను

చేతికర్ర సాయంతో, పడమటిదిక్కునున్న మా కమతానికి.

ఎవరూ ఇంటిదిక్కు పోవటం లేదు, రోడ్డునానుకున్న పొలాలన్నీ

ఒకదాని పక్కన ఒకటి బీడుపడి వ్యవసాయానికి పనికిరాకున్నాయి.

కానీ మా తాటిగుడిశకొండ మాత్రం ఎప్పటిలాగే కళకళలాడుతూ ఉంది

మా కొత్త పొలాలుకూడా పాతవాటిలా స్థిరంగా సేద్య యోగ్యంగా ఉన్నాయి.

లోయలోని మలుపులన్నీ శీతకాలంలో చలికి గజగజలాడించినపుడు

వసంతంలో చేతికొచ్చిన ద్రాక్ష ఆకలినీ శ్రమనీ తగ్గిస్తుంది.

అప్పటికింకా బలంగా ఎదగకపోయినా, ద్రాక్షతీగలు,

ఏమీ లేనిదానికంటే నయం, ముందెలాగా అన్న బెంగ తీరుస్తాయి.

ఇక్కడ నెలలూ సంవత్సరాలూ దొర్లిపోతుంటే

ప్రపంచపు బాధలన్నీ దూరంగా కనుమరుగైపోతాయి.

దున్నిన దుక్కీ, నేతమగ్గమూ మా అవసరాలు తీరుస్తాయి

అంతకంటే ఎవరికైనా కావలసిందేముంటుంది?… ఫో… ఫో

ఈ వంద సంవత్సరాల జీవితంలోనూ, ఆ పైనా

నేనూ, నా కథా ఇలాగే కాలగర్భంలో కలిసిపోతాము.
.

తావో చియాన్

(365 – 427)

చీనీ కవి .

.

After Mulbery-Bramble Liu’s Poem

.

I’d long felt these mountains and lakes

Calling, and wouldn’t have thought twice,

But my family and friends couldn’t bear

Talk of living apart. Then one lucky day

A strange feeling came over me and I left,

Walking-stick in hand, for my west farm.

No one was going home: on outland roads

Farm after farm lay in abandoned ruins,

But our Thatch Hut’s already good as ever,

And our new fields look old and settled.

When valley winds turn bitter and cold

Our spring wine eases hunger and work,

And though it isn’t strong, just baby-girl

wine, it’s better than nothing for worry.

As months and years circle on away here,

The bustling world’s ways grown distant,

Plowing and weaving provide all we use.

Who needs anything more? Away- away

Into this hundred-year life and beyond,

My story and I vanish together like this.

.

T’ao Ch’ien (aka T’ao Yüan-ming)

(365 – 427)

Chinese Poet

Poem Courtesy: https://archive.org/details/mountainhome00davi/page/8

Read about the poet here

Note:

Mulbery Bramble or Ch’ai-sang : It is the name of the Poet’s ancestral village .

Thatch Hut or Lu :  It is the name of the famous Mountain  northwest of which his village lies.

 

సాంధ్యదృశ్యం, తొలగుతున్న మంచుతెరలు… చియా తావో, చీనీ కవి

చేతికర్ర ఊతంగా, మంచుతెరలు తొలగడం గమనిస్తున్నాను

వేనవేల మబ్బులూ, సెలయేళ్ళూ పోకపెట్టినట్టున్నాయి.

కట్టెలుకొట్టేవాళ్ళు తమ కుటీరాలకి చేరుకుంటున్నారు, త్వరలో,

వాడైన కొండశిఖరాల్లో వేడిమిలేని సూరీడు అస్తమించనున్నాడు.

కొండ చరియల గడ్డివరుసల్లో కారుచిచ్చు రగులుకుంటోంది

రాళ్ళమీదా, చెట్లచిగురుల్లోనూ పొగమంచు కొద్దికొద్దిగా పేరుకుంటోంది.

కొండమీది ఆశ్రమానికి దారిదీసే త్రోవలో నడుస్తుండగానే

సంధ్యచీకట్లు ఆ రోజుకి గంటకొట్టడం కనిపించింది.

.

చియా తావో

(779 – 843)

చీనీ కవి

.

.

Evening Landscape, Clearing Snow

.

Walking stick in hand, I watched snow clear.

Ten thousand clouds and streams banked up,

Woodcutters return to their simple homes,

And soon a cold sun sets among risky peaks.

A wildfire burns among ridgeline grasses.

Scraps of mist rise, born of rock and pine.

On the road back to a mountain monastery,

I hear it struck: that bell of evening skies!

.

Chia Tao (aka Jia Dao or Langxian)

(779 – 843)

Chinese Poet

Poem Courtesy: 

https://archive.org/details/mountainhome00davi/page/n18 

Famous for his poem:

For ten years I have been polishing this sword

Its frosty edge has never been put to test.

Now I am holding it and showing it to you, Sir,

Is there anyone suffering from injustice?

సాంధ్యమేఘం… జాన్ విల్సన్, స్కాటిష్ కవి

అస్తమిస్తున్న సూర్యుడి సమీపంలో ఒక మేఘం వ్రేలాడుతోంది

మంచుతోపెనవేసుకున్నట్టున్న దాని అంచు పసిడిలా మెరుస్తోంది,

దిగువన స్ఫటికంలా మెరుస్తున్న నిశ్చల తటాకంలో

నెమ్మదైన దాని నడకని అలా గమనిస్తూ ఎంతసేపు గడిపానో!

దాని హృదయం ప్రశాంతతతో నిండే ఉంటుంది, అందుకే అంత నెమ్మది!

అసలు దాని నడకలోనే ఎంత ఠీవి ఉందని.

ఆ సాయంత్రం వీచిన ప్రతి చిన్న గాలి రివటా

ఆ విహాయసవిహారిని పడమటికి తేలుస్తూనే ఉంది.

శరీరబంధాన్ని త్రెంచుకున్న ఆత్మలా, బ్రహ్మానందాన్ని

అలదిన శ్వేతశరీరంలా కనిపించింది నాకు

దాని పుణ్యఫలం వలన స్వర్గలోకపు బంగారు వాకిలి

వరకూ తేలుతూ పోగల అనుగ్రహం సంపాదించుకుందేమో.

ఆ ముంగిట, ప్రశాంతంగా వ్రేలుతూ, నమ్మికగలవారికి

పొందగల దివ్యమైన భవిష్యత్తును సూచిస్తున్నట్టుంది.

.

జాన్ విల్సన్

(18 May 1785 – 3 April 1854)

స్కాటిష్ కవి.

.

The Evening Cloud

.

A cloud lay cradled near the setting sun,

A gleam of crimson tinged its braided snow:

Long had I watched the glory moving on

O’ver the still radiance of the lake below.

Tranquil its spirit seemed, and floated slow!

Even in its very motion there was rest;

While every breath of eve that chanced to blow

Wafted the traveler to the beauteous West.

Emblem, methought, of the departed soul!

To whose white robe the gleam of bliss is given:

And by the breath of mercy made to roll

Right onwards to the golden gates of Heaven,

Where, to the eye of faith, it peaceful lies,

And tells to man his glorious destinies.

.

John Wilson

(18 May 1785 – 3 April 1854)

Scottish Poet

Poem Courtesy: https://archive.org/details/WithThePoets/page/n279

and

https://archive.org/details/WithThePoets/page/n280 

మరణశయ్య… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి

రాత్రంతా ఆమె ఊపిరితియ్యడాన్ని గమనిస్తూ గడిపాం, 

పోల్చుకోలేనంత నెమ్మదిగా ఆమె ఊపిరి తీస్తూనే ఉంది

ఆమెగుండెలో కొట్టుకుంటున్నట్టే 

ప్రాణం అటూ ఇటూ కొట్టుమిట్టాడుతోంది.

మేం ఎంత నెమ్మదిగా మాటాడుకున్నామంటే

ఎంత నెమ్మదిగా ఆమె చుట్టూ కదలాడేమంటే

ఆమెకి ఊపిసితీయగలశక్తి నివ్వడానికి

మా శక్తులన్నీ ధారపోస్తున్నామేమో అనిపించేంతగా.

మా ఆశలు మా భయాల్ని వమ్ము చేశాయి

మా భయాలు మా ఆశల్ని వమ్ము చేశాయి;

ఆమె పడుకున్నప్పుడు చనిపోయిందనుకున్నాం,

చనిపోయినపుడు పడుకుందనుకున్నాం.

ఎందుకంటే, చిన్న చినుకులతో, చలితో,

మసకమసకగా, నిరాశగా పొద్దుపొడిచినపుడు

ఆమె కనురెప్పలు శాశ్వతంగా మూసుకున్నాయి

మనదికాని వేరొక సూర్యోదయంలోకి ఆమె మేలుకుంది.

.

థామస్ హుడ్,

(23 May 1799 – 3 May 1845)

ఇంగ్లీషు కవి

.

.

The Deathbed

.

We watched her breathing through the night,

Her breathing soft and low,

As in her breast the wave of life

Kept heaving to and fro.

So silently we seemed to speak,

So slowly moved about,

As we had lent her half our powers,

To eke her being out.

Our very hopes belied our fears,

Our fears our hopes belied;

We thought her dying when she slept

And sleeping when she died.

For when the morning came dim and sad,

And chill with early showers,

Her quiet eyelids closed- she had

Another morn than ours.

.

Thomas Hood

(23 May 1799 – 3 May 1845)

English Poet

Poem Courtesy:

https://archive.org/details/WithThePoets/page/n258

విషాద గీతిక… ఫెలీషియా హెమన్స్, ఇంగ్లీషు కవయిత్రి

ఫెలీషియా హెమన్స్ పేరు వినగానే గుర్తొచ్చేది ఒకప్పుడు పాఠ్యభాగంగా ఉండే ఆమె కవిత Casabianca… The Boy who stood on the burning deck.

కన్యాశుల్కం చదివిన వారికి గుర్తు ఉండొచ్చు: వెంకటేశం తల్లి వెంకమ్మ “మా అబ్బాయీ మీరూ ఒక పర్యాయం యింగిలీషు మాటాడండి బాబూ!” అని బతిమాలినపుడు – గిరీశానికీ- వెంకటేశానికీ మధ్య జరిగిన సంభాషణలో ఇద్దరూ ఇష్టం వచ్చిన ఇంగ్లీషుముక్కలు మాటాడతారు. అందులో గిరీశం పై మాటలు … Casabianca పద్యానికి మొదటి పాదం …. అంటాడు.

.

ఓ సుందరాకృతీ! ఇప్పుడిక

నువ్వు విశ్వసించిన దైవం గుండెలమీద హాయిగా నిదురపో! 

నువ్వు మా మధ్య నడయాడినపుడు కూడా

నీ నుదిటిపై అతని ముద్రలుండేవి.

మిత్తికా, నువ్వు తిరిగి క్రిందనున్న నేలలో కలిసిపో!

దివ్యాత్మా! ఊర్ధ్వలోకాల్లో నీ నివాసం చేరుకో!

మరణశయ్యమీద నీ ముఖం తిలకించిన వారెవ్వరూ

ఇకపై మరణమంటే ఎంతమాత్రం భయపడరు.

.

ఫెలీషియా హెమన్స్

(25 September 1793 – 16 May 1835)

ఇంగ్లీషు కవయిత్రి

.

.

A Dirge

.

Calm on the bosom of thy God,

Fair spirit rest thee now!

E’en while with ours thy footsteps trod

His seal was on thy brow.

Dust, to its narrow house beneath!

Soul, to its place on high !

They that have seen thy look in death

No more may fear to die.

.

Felicia Hemans

(25 September 1793 – 16 May 1835)

English Poet

దిగువన… కార్ల్ శాండ్ బర్గ్, అమెరికను

Today is Carl Sandburg’s Birthday.

 

మీ అధికార కెరటాల దిగువన

ఉన్నత శాసనయంత్రాంగపు

పునాది స్తంభాలను నిత్యం తాకుతూ

వ్యతిరేకదిశలో ప్రవహించే తరంగాన్ని నేను

నేను నిద్రపోను

నెమ్మదిగా అన్నిటినీ సంగ్రహిస్తాను

అందనంతలోతుల్లో

మీరు భద్రంగా దాచుకున్న వస్తువులకు

తుప్పునూ, తెగులునూ

కలుగజేసేది నేనే

మీ కంటే

మిమ్మల్ని కన్నందుకు గర్వపడే

వారికంటే పురాతనమైన శాసనాన్ని నేను

మీరు “ఔ”నన్నా

“కా”దన్నా

ఎప్పటికీ

నే వినిపించుకోను.

నేను అన్నిటినీ కూలదోసే

రేపుని.

.

కార్ల్ శాండ్ బర్గ్

(January 6, 1878 – July 22, 1967)

అమెరికను కవి

.

Under

.

I am the undertow

Washing the tides of power,

Battering the pillars

Under your things of high law.

I am sleepless

Slowfaring eater,

Maker of rust and rot

In your bastioned fastenings,

Caissons deep.

I am the Law,

Older than you

And your builders proud.

I am deaf

In all days,

Whether you

Say “yes” or “no!”.

I am the crumbler:

To-morrow.

.

Carl Sandburg

 (January 6, 1878 – July 22, 1967)

American

Poem Courtesy:

https://archive.org/details/poetry01assogoog/page/n115

గ్రంథాలయం… రాబర్ట్ సదే, ఇంగ్లీషు కవి

నేను మృతుల్లో ఒకడిగా ఉండే రోజులు గతించాయి

ఇప్పుడు నే నెటుచూసినా

నా దృష్టి యాదృచ్చికంగా దేనిమీద పడినా

నా కంటికి గతంలోని మేథావులు కనిపిస్తున్నారు.

ఎన్నడూ నన్ను తిరస్కరించని స్నేహితులు వాళ్ళు

ప్రతిరోజూ నేను సంభాషించేది వాళ్లతోనే.

నా ఆనందం వాళ్లతో పంచుకోవడం ఇష్టం,

నా బాధలకి ఉపశాంతి కోరేదీ వాళ్ళ దగ్గరే;

నేను వాళ్లకి ఎంత ఋణపడి ఉన్నానో

నాకు అర్థమై, అనుభూతి చెందుతున్న కొద్దీ

కృతజ్ఞతా భావంతో నిండిన కన్నీళ్ళతో

నా చెంపలు తరచు తడిసిపోతుంటాయి.

నా ఆలోచనలన్నీ ఆ మృతజీవులతోనే,

వాళ్లతో నేను భూతకాలంలో జీవిస్తుంటాను

వాళ్ళ మంచి ఇష్టపడతాను, చెడు నిరసిస్తాను

వాళ్ల ఆశనిరాశలలో భాగస్వామినౌతాను,

వాళ్ళు ఇచ్చిన సందేశాలను విని, జ్ఞానార్థినై

వినమ్రతతో దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాను.

ఇక నా ఆశలన్నీ వాళ్లమీదే. ఎందుకంటే

త్వరలోనే నేను వాళ్ళ చెంత చేరబోతున్నాను.

వాళ్లతో పాటే నేనుకూడా ప్రయాణం చెయ్యాలి

అంతులేని భవిష్యత్కాలమంతా.

కాకపోతే, ఇక్కడ నా పేరు విడిచిపెట్టగలననీ

అది నాతో పాటు మట్టిపాలవదనీ నా నమ్మకం.

.

రాబర్ట్ సదే

12 August 1774 – 21 March 1843

ఇంగ్లీషు కవి

Image Courtesy:
http://www.greatthoughtstreasury.com/author/robert-southey

.

The Library

.

My days among the Dead are past;

Around me I behold,

Wherever these casual eyes are cast,

The mighty minds of the old;

My never-failing friends are they,

With whom I converse day by day.

With them I take delight in weal,

And seek relief in woe;

And while I understand and feel

How much to them I owe,

My cheeks have often been bedewed

With tears of thoughtful gratitude.

My thoughts are with the dead, with them

I live in long past years,

Their virtues love, their faults condemn,

Partake their hopes and fears,

And from their lessons seek and find

Instruction with a humble mind.

My hopes are with the Dead, anon

With them my place shall be:

And I with them shall travel on

Through all Futurity;

Yet leaving here a name, I trust,

Which will not perish in the dust.

.

Robert Southey

(12 August 1774 – 21 March 1843)

English Poet,

Poem Courtesy: https://archive.org/details/WithThePoets/page/n201

%d bloggers like this: