అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

  • క్లుప్తంగా
  • జూలై 1, 2020

    మంచు సోన … కర్దూచీ, ఇటాలియన్ కవి

    చీకటి ముసిరిన ఆకాశం నుండి నిశ్శబ్దంగా, నెమ్మదిగా కురుస్తోంది మంచు నగరంలో, అరుపులూ, జీవవ్యాపారాల సందడీ సద్దుమణుగుతోంది పరిగెడుతున్న చక్రాల శబ్దాలూ, వీధి వర్తకుల అరుపులూ, యువత కేరింతలూ, ప్రేమగీతాలూ వినిపించడం లేదు.  కాలావధులు లేని ప్రపంచపు నిట్టూర్పుల్లా, నిద్రపోతున్న మెట్లమీదుగా   లోహపుజాడీనుండి గంటలు కరకుగా బొంగురుగా మూలుగుతున్నాయి.   దారితప్పిన పక్షులు కిటీకీ అద్దాలమీద పదే పదే కొట్టుకుంటున్నాయి  నా సహచర ప్రేతాత్మ మిత్రులు వెనుదిరిగి, నావంకచూస్తూ పిలుస్తున్నారు.  శలవు ప్రియతములారా, త్వరలో కలుద్దాం, భయమెరుగని ఓ…

  • జూన్ 30, 2020

    పరమాత్మ… మైకేలేంజెలో, ఇటాలియన్ శిల్పి, కవి

    నా ప్రార్థనల వెనుక నీ ఆశీస్సులున్నపుడు  తండ్రీ! ఆ ప్రార్థనలు అర్థవంతమై ఉంటాయి:  నిస్సహాయమైన నా హృదయం జీవంలేని మట్టి వంటిది, తనంత తానుగా ఏ మంచి, పవిత్రమైన వాక్యాల  సారాంశాన్నీ గుర్తించి గ్రహించ సమర్థురాలు కాదు. నీవు విత్తువి, నీ అనుగ్రహంతో ప్రయత్నం వేగవంతమౌతుంది, నీవే గనక మాకు సరియైన మార్గాన్ని చూపించకపొతే దాన్ని ఏ మనిషీ కనుక్కోలేడు; నీవు మార్గదర్శనం చెయ్యి!  నా మనసులోకి ఎటువంటి ఆలోచనలు జొప్పిస్తావంటే  ఆ ప్రభావంతో నీ పవిత్రమైన…

  • జూన్ 29, 2020

    The Expat… Vinnakota Ravisankar, Telugu Poet, India

    It was long since the umbilical was snapped. Decades passed since the borders were crossed. Yet, the yearning for the motherland Has not ceased a whit. The host country has provided everything. It taught necessary skills to gather the fruits of life. But, the land of early faltering steps Remains in memory for ever. Not…

  • జూన్ 29, 2020

    అనంతవిశ్వం… జియకోమో లెపార్డీ, ఇటాలియన్ కవి

    ఒంటరిగా నిలబడ్డ ఈ కొండ అంటే నా కెంతో ఇష్టం, చూపుల అవధి దాటిన దిజ్ఞ్మండలాన్ని కనిపించనీయకుండా నా దృష్టిని నిరోధిస్తున్న ఈ కంచె అన్నా నాకిష్టమే. కానీ, ఇక్కడ హాయిగా కూచుని ఆలోచనలలో మైమరచినపుడు నా ఆలోచనలు ఎక్కడో సుదూరతీరాలకు విస్తరించిన రోదసినీ  అద్భుతమైన నీరవతనీ, దివ్యమైన శాంతినీ గ్రహిస్తాయి; నాకు ఒక్కసారి భయమేస్తుంది కూడా; కానీ, వెంటనే ప్రక్కనే ఆకుల దొంతరలలో కదులుతున్న గాలి చేసే మర్మరధ్వనులు విని  స్పష్టమైన చైతన్యవంతపు వర్తమానాన్నీ, నిర్జీవమైన…

  • జూన్ 27, 2020

    ప్రజలు… తొమాసో కేంపనెల్లా, ఇటాలియన్ కవి, తత్త్వవేత్త

    తన బలం ఏమిటో తనకే తెలియని తెలివిమాలిన  పశుప్రాయులు ప్రజలు, అందు వల్లనే వాళ్ళు రాయీ, కట్టెలువంటి బరువులు మోస్తుంటారు; ఎంతమాత్రం బలంలేని చిన్నపిల్లవాడి చెయ్యి ముకుతాడుతో, ములుగర్రతో నడపగలుగుతుంది. ఒక్క తాపు తంతే చాలు, దాని బంధం తెగిపోతుంది, కానీ ఎందుకో ఆ జంతువు భయపడుతుంది, అంతేకాదు పిల్లాడు అడిగినవన్నీ చేస్తుంది; దాని భయకారణం దానికే తెలీదు;  నిష్కారణ భయాలతో తబ్బిబ్బై, అచేతనమైపోతుంది. అంతకంటే చిత్రం, తన చేతులతో స్వయంగా గొంతు నొక్కుకుని, రాజ్యాధిపతులు తన ఇంట్లోంచి…

  • జూన్ 26, 2020

    అవకాశం… నికొలొ మెకియావెలీ ఇటాలియన్ రచయిత

    “స్వర్లోకవాసివని తెలియజెప్పే తేజస్సుతో చిత్రమైన    సౌందర్యంతో అలరారే వనితా, ఇంతకీ నీవెవరవు?   నీ పాదాలకి ఆ రెక్కలేమిటి? ఎందుకంత తొందర?” “నా రహస్యాలు ఎవరూ దొంగిలించలేరని పేరుపడ్ద ‘అవకాశ’మనే వనితను నేనే. ఈ తొందర ఎందుకంటావా? నా పాదాల క్రింద చక్రాలున్నాయి, అందుకు.  “అవి పక్షుల వేగంకన్నా మిన్నగా కదుల్తాయి అందుకనే దీటుగా, నా పాదాలకి రెక్కలున్నాయి, రహస్యంగా అనుసరించి ఆచూకీ తీసేవారి కనుగప్పడానికి. “దానికి తగ్గట్టుగానే నా జుత్తు ముందుకు వేలాడదీసి  ముఖాన్ని కనుమరుగుచేసేలా…

  • జూన్ 25, 2020

    అలా రాసిపెట్టి ఉంటే… పెట్రార్క్, ఇటాలియన్ కవి

    నా జీవితం నీ జీవితం నుండి వేరుపడి, అయినా జీవిత మలిసంధ్య మసక వెలుతురుల వరకూ  కొనసాగమని విధి రాసి పెట్టి ఉంటే, కళతప్పిన ఆ కన్నులను బహుశా నేను చూస్తాను; నీ నుదుటపై అందంగా వాలే బంగారు ముంగురులు కొంత వన్నె తగ్గి వెండిజలతారులై కనిపిస్తాయి,  అక్కడ ఇపుడు సుందరంగా అలంకరించిన పూమాలల బదులు గతించిన ఎన్నో వసంతాలు జాడలు పరుచుకుంటాయి. అపుడు నేను సాహసించి నీ చెవులలో ఎప్పటినుండో అణచుకున్న ప్రేమైక భావనలని గుసగుసలాడినా,…

  • జూన్ 24, 2020

    వాగ్వరం… సాది, పెర్షియన్ కవి

    నువ్వు ఇంకా మాటలాడగల అద్భుతమైన శక్తి కలిగి ఉన్నపుడే   నీ ప్రతి ఆలోచననీ దాని మహత్వశక్తి ప్రకాశించేలా ఆవిష్కరించు.  రేపు, మృత్యువు పంపిన వార్తాహరుడు ఇక్కడికి వచ్చినపుడు చెప్పదలుచుకున్నది చెప్పేలోపే బలవంతంగా నిన్ను కొనిపోవచ్చు.  . సాది (1220-1291/92) పెర్షియన్ కవి అనువాదం: ఎల్. క్రామర్ బింగ్ సాదీ గురించి అనువాదకుని అభిప్రాయం:   సాదీ ప్రత్యేకత హృదయ సౌకుమార్యమూ, లలితమైన పదవిన్యాసమూ, సున్నితమైన అభిప్రాయ, భావప్రకటన. వాటినతడు ఎంతో సహజంగా, పొదుపైన పదాలలో, సంక్షిప్తంగా, చతురతతో ఉపయోగిస్తాడు.  Gift…

  • జూన్ 23, 2020

    తొందరపడి ప్రపంచాన్ని ప్రేమించవద్దు… ముతామిద్, సెవిల్ మహరాజు, స్పెయిన్

    తొందరపడి ప్రపంచాన్ని ప్రేమించవద్దు, ఎందుకంటేరంగులతో, కసీదా పనితనంతో సింగారించిన ఆ పట్టు వస్త్రం   నమ్మదగినదీ, నిలకడలేనిదని ఒక్కసారి గమనించండి.  (నా మాట విను ముతామిద్, నీకు వయసు ఉడిగిపోతోంది) వయసు వాడికత్తిపదు నెన్నడూ తుప్పుపట్టదని కలగన్న మేము, మృగతృష్ణలో నీటిఊటల్నీ, ఇసుకలో గులాబీలు ఆశించాం,  ఈ ప్రపంచప్రహేళికని అర్థం చేసుకున్నా మనుకుని మట్టిని వస్త్రంగా కప్పుకుని మేధావులుగా భ్రమించాం.  . ముతామిద్, సెవిల్* మహరాజు     (1040-1095)   అరబ్బీ కవి అనువాదం: డల్సీ ఎల్. స్మిత్.   అనువాదకుడు ఈ…

  • జూన్ 22, 2020

    నీటివాలు… ముతామిద్, సెవిల్ మహరాజు, స్పెయిన్

    సముద్రం పోతపోసినదది; బలశాలియైనసూర్యుడు దాని అంచుకి పదునుపెట్టాడు, స్వచ్ఛమైన తెల్లని ఒరలోంఛి అది ఒక్కసారిగా బయటకి వస్తోంది మనిషన్నవాడు ఎవడూ ఇప్పటివరకు  డమాస్కస్ లో అలాంటి కత్తి తయారు చెయ్యలేదు… కాకపోతే నరకడానికి, ఉక్కుతోచేసిన కత్తి నీటికంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. . ముతామిద్, సెవిల్ మహరాజు  (1040-1095)  అరబ్బీ కవి అనువాదం: డల్సీ ఎల్. స్మిత్. అనువాదకుడు ఈ రాజు గురించి: అతని పరాక్రమ సూర్యుడు ఏనాడో అస్తమించి పశ్చిమదేశాలు అతని వైభవాన్ని మరిచిపోయినా, ఏ రాజ్యంకోసం అతనూ,…

←మునుపటి పుట
1 … 5 6 7 8 9 … 247
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • అనువాదలహరి
    • మరో 117గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • సైటును మార్చండి
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు