291. In success be moderate.
గెలుపులో నిగ్రహం పాటించు.
292. Interest that blinds people, enlightens others.
ప్రాజాపత్యం కొందరిని గుడ్డివాళ్ళని చేస్తే, కొందరిని ఉదాత్తుల్ని చేస్తుంది.
293. In the affairs of this world men are saved, not by faith, but by want of it.
లౌకిక వ్యవహారాల్లో, మనకి రక్షణ దేముడిమీద నమ్మకం కాదు, అది లేకపోవడం.
294. I saw few die of hunger, of eating 100.000.
తిండిలేక చనిపోయిన వాడిని ఒక్కడిని చూడలేదు; ఎక్కువై చనిపోయిన వారిని లక్షమందిని చూసేను.
295. Is there anything men take more pains about than to render themselves unhappy?
తమని తాము దుఃఖపెట్టుకుందికి కష్టపడినంతగా మనుషులు మరి దేనికైనా కష్టపడతారా?
296. It is better to take many injuries than to give one.
ఒక గాయం చెయ్యడం కంటే, పది గాయాలు భరించడం మేలు.
297. It is ill jesting with joiner’s tools, worse with the doctor’s.
వడ్రంగి పరికరాలతో కోణంగి పనులు ప్రమాదకరం. వైద్య పరికరాలతో అంతకన్నా.
298. It is ill manners to silence a fool, and cruelty to let him go on.
విదూషకుడి నోరు మూయించడం అసభ్యత; అదుపులేని కొనసాగింపు క్రూరత్వం.
299. It is not leisure that is not used.
సవ్యంగా వినియోగించని విరామం, విరామం కాదు.
300. It is wise to seek a secret, but honest not to reveal it.
రహస్యాభిలాష తెలివైన పని. దాన్ని బయటపెట్టకపోవడం పెద్దమనిషి తరహా.
వ్యాఖ్యానించండి