Poor Richard’s Almanac 33… Benjamin Franklin, American

321     Let thy discontents be thy secrets; if the world knows them it will despise thee and increase them.

           నీ అసంతృప్తి నీలోనే ఉండనీ. లోకానికి తెలిస్తే, నిన్ను ద్వేషించి మరింత అసంతృప్తికి గురిచేస్తుంది.

322    Let your maid servant be faithful, strong, and homely.

           నీ సేవకురాలు నమ్మకంగా, ఆరోగ్యంగా, మొరటుగా ఉండేట్టు చూసుకో.

323   Let thy vices die before thee.

          నీ వ్యసనాలు, నీకంటే ముందే నశించనీ.

324   Liberality is not giving much but giving wisely.

           దాతృత్వం అంటే ఎడాపెడా దానం చెయ్యడం కాదు, పాత్రత తెలిసి ఇవ్వడం.

325    Light gains, heavy purses.

           తేలికగా వచ్చే లాభాలు, బరువైన పర్సులు. 

326   Light purse, heavy heart.

          ఖాళీ పర్సు, గుండె బరువు.

327   Little rogues easily become great ones.

          చిన్న దొంగలు సులువుగా పెద్ద నేరస్థులవుతారు.

328   Little strokes fell great oaks.

           చిన్న చిన్న దెబ్బలు పెద్ద పెద్ద ఓక్ చెట్లను కూడా పడగొట్టగలవు. 

329   Look before, or you will find yourself behind.

          ముందు చూపు కలిగి ఉండు. లేకపోతే నిన్ను నువ్వు వెనక వరసలో చూసుకుంటావు. 

330   Lost time is never found again.

          గడచిన కాలం తిరిగి దొరకదు.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.