-
కృతజ్ఞతా భావన … Shernaz Wadia, Indian Poet
ఆ మాట ఇంకా ప్రచారంలోకి రాక ముందే ఆ అద్వితీయ భావనని మాలోకి చొప్పించారు మీరు. తనముక్కు చాలాపొడుగ్గా ఉందని ఒకరు విచారిస్తుంటే మీరన్నారు: “నయం!అదింకా వాసనలు పసిగట్టగలుగుతోంది. కుష్టురోగం అక్కడఒక ఒక గొయ్యి మిగులుస్తుంది తెలుసా?” అని. తన పాదాలు అందంగాలేవని మరొకరు తపిస్తుంటే, మీరు అభిశంసించేరు: “సంతోషించు! నీ కాళ్ళమీద నువ్వు నిలబడగలుగుతున్నందుకు. ఒక వేలు పోగొట్టుకున్నవాళ్ళని అడిగిచూడు దాని అవసరమెంతో తెలుస్తుంది.” మూడవది తనగొంతులో కోకిలారవాలు పలకడంలేదని తపిస్తుంటే, మీరు ఆదేశించారు :…
-
ఆప్త మిత్రుడికి… Shernaz Wadia, Indian Poet
మిత్రమా! తీరని ఈహల నిర్జీవ హృదయాన్ని నీ కిచ్చాను. లలితజీవన చుంబనాన్ని దానిపై నువ్వు ప్రసరించావు. ఇపుడది కొంగ్రొత్త జవంతో కేరింతలు కొడుతోంది. ఆప్తుడా! తప్త కాంక్షల చితా భస్మాన్ని నీకిచ్చాను. దాన్ని నీ ప్రేమ పేటికలో భద్రపరిచావు. ఇపుడది పునరుజ్జీవనంతో కళకళలాడుతోంది. నేస్తమా! పీటముడులుపడిపోయిన ఆలోచనల పోగులను నీ ముందుంచాను. అవిఛ్ఛిన్న ప్రశాంతతతో చిక్కులు విప్పి నాకు సాంత్వన నందించావు. సహచరుడా! రసహీనమైన నా జీవితాన్ని నీ ముందు పరిచాను. దయార్ద్రహృదయంతో దానికి ప్రేమలేపనం పూసావు.…
-
చిరు దివ్వె … Shernaz Wadia
దివాకరుడు రోజును వెలిగించినంత దేదీప్యంగా నువ్వు నా జీవితాన్ని వెలిగించలేక పోవచ్చు కానీ, చిరుదివ్వెలా ఒక కాంతిపుంజాన్ని విరజిమ్మి మనసుని అలముకొన్న విషాదకరమైన వెలితిని పటాపంచలు చేశావు. ధ్రువనక్షత్రంలా అచంచలమైన నీ అనునయ సన్నిధి ఎల్ల వేళలా నా తప్పటడుగులని సరిదిద్దుతూ నే పోగొట్టుకున్న నా వ్యక్తిత్వం వైపు నన్ను మరలిస్తూనే ఉంది. నీ తీయందనపు వెలుగులు నాలో నిబిడమైన శక్తిని వెలికితీసి ఎ బంధనాలూ, బంధాలూ లేకుండానే స్నేహమనే అస్వతంత్ర స్వతంత్రంతో నన్ను…
-
చి’త్తరువు’ సౌందర్యం… Shernaz Wadia
ఏకాంత తరువు విశాల వివర్ణ ప్రకృతి నిస్సంగ నిరంబర దేహం అపర్ణ, విభూతిశాఖీశాఖా వియద్వీక్షణం వాగామగోచర విలాసం వసంతాగమ నాభిలాష అంతరాంతర కృతజ్ఞతాంజలి . English Original : Shernaz Wadia
-
కవిత ఎలా ఉండాలి ? … Shernaz Wadia
స్ఫటికం లా… అంది నిశ్చల సరస్సు మెరుస్తూ నాలా ఉదాత్తంగా — గంభీరంగా పలికింది మహావృక్షం నిరాఘాటం గా ప్రవహించాలి — గలగలలాడింది సెలయేరు సద్యః స్ఫురణ కలిగిస్తూ జీవం తొణికిసలాడాలి — కూని రాగాలు పోయింది పిట్ట సువాసనలతో మత్తెక్కించాలి — ఝుంకరించింది తుమ్మెద మనసు దోచుకోవాలి — నవ్వింది సీతాకోక చిలుక రమణీయం గా ఉండాలంటేనో ? అడిగాయి పూలు లోతుగా సారవంతంగా ఉండాలి — ఘోషించింది లోయ కొంత రాజసం కూడా ఉండాలి…