Knowing full well … Vimala, Telugu, Indian

http://t1.gstatic.com/images?q=tbn:ANd9GcTTDfPaJtMLpchw9I1LZDD1KKXy1ucfP1uU_oZLskZp7WNxeoEA
Image Courtesy: http://t1.gstatic.com/images?

.

(The agony and angst of the poem can be understood better by the readers if they come to know that the poetess Vimala was once an active revolutionary spending the prime of her youth in forests, married to another revolutionary (but had very little family life with both of them attending different assignments) who was later killed in an encounter by police, came out when the direction of the movement did not suit her dreams, studied law,  and is now an active practicing lawyer serving the cause of the poor and the destitute)  

.

Several Fall and Spring breezes

Have walked over me. 

I am aware of the  strands of hair

Turning gray over my head,

Of the creases appearing on my skin,

And the senescence

Slowly and serenely seizing upon me.

A smile breaks on the lips

And a ceaseless spring wells up in the eyes

.

It continues to rain…

And the steps stagger

As the frills of the seeping sari stick to the feet…

Yet, somehow, one has to walk!

.

On a similar rainy night…

I still remember…

You breezed into my house

Through the door left ajar…

.

I still remember

You kissing the mole in my palm,

My fingers browsing through your curly hair,

And in your honey eyes

My stumbling upon an age-old dream of mine …

.

How frightened was I

That the dream might take to wings like a bird !!!

I still remember

Conversing with my dream

Sealing your eyes securely with my lips.

.

It was again such similar rainy night,

An endless night … you slept in my lap,

A night when you, the dream and the rain merged into…

Many such nights … an inexplicable fear and delight…

How many nights did pass looking at you like that!

.

What an agony it is

To wait for them

You know will never turn up.

Death is an eternal truth as birth is.

Like the involuntary reflexes of breathing in and breathing out,

A yearning for you …

Knowing full well … what is up.

.

Vimala

.

తెలిసితెలిసీ… 

.

అనేక శిశిర, వాసంత సమీరాలు

నామీదుగా నడిచి వెళ్ళాయి.

తలలో తెల్లవెంట్రుకలు, చర్మం మీద ముడుతలు,

నాకు తెలుస్తూనేవుంది

ముదిమి నన్ను మెల్లగా కమ్ముకోవడం.

కన్నుల్లో ఆరని కన్నీటి జల.

పెదవులపై విరిగిన  నవ్వు.

.

వర్షం కురుస్తూనే వుంది

తడిసిన చీరకుచ్చిళ్ళు కాళ్ళకి  అడ్డంపడుతూ

అడుగులు తడబడుతున్నాయి

అయినా నడవాల్సిందే కదా!

.

ఇలాంటి వర్షపురాత్రే

తెరచిన నా ఇంటి వాకిలినుండి

పిల్ల తెమ్మెరలా వచ్చి వాలావు

నాకింకా గుర్తుంది

.

నా అరచేతిలో పుట్టుమచ్చని ముద్దుపెట్టుకోవడం

నీ ఉంగరాలజుట్టుతో నాచేతివేళ్ళు ఆటాడటం

నీ తేనెరంగు కళ్ళలో నా పురాస్వప్నం దొరకటం

నాకింకా గుర్తుంది

.

నాకెంత భయం…

స్వప్నం పక్షివలె ఎగిరిపోతుందేమోనని

పెదవులతో నీ కళ్ళు మూసి స్వప్నంతో సంభాషించటం

.

నాకింకా గుర్తుంది.

ఇలాంటి వర్షపు రాత్రే,

నావొడిలో తలవాల్చి నిదురించిన తెల్లవారని ఆ రాత్రి

నువ్వూ, కలా, వర్షమూ… కలగలిసిన రాత్రి

అలాంటి అనేక రాత్రులు ఏదో తెలియని ఆనందం,దిగులు.

నిన్నట్లాచూస్తుండగానే ఎన్ని రాత్రులు తెల్లవారాయో…

.

తిరిగిరాని వాళ్లకోసం  ఎదురుచూడటం

ఎంత ఎంత వేదన

జననం వలె మృత్యువొక నిత్య పరమ సత్యం

అసంకల్ప ఉఛ్ఛ్వాశ నిశ్వాసలవలె

తెలిసి తెలిసీ నీకోసం వెతుకులాట.

… vimala

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: