అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

  • క్లుప్తంగా
  • అక్టోబర్ 9, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 5 వ భాగం

    చతుర్థాంకం   దృశ్యం 5 [రాజు నిద్రిస్తుంటూ మేడమీది గదిలో;  సుల్తాన్ మొగలి క్రింద గదిలో; బాహుదా బయట] బాహుదా: (చీకటిలో నెమ్మదిగా  మెరుపుల ఆసరాతో నడుస్తుంటుంది. మహా ప్రమాదకరమైన ప్రయత్నం. నాకుగాని వివేకము తప్పడం లేదు గదా! ప్రకృతికన్న బలీయమైన శక్తి ఏదో నన్ను ప్రేరేపిస్తోంది. అతను ఈ ఇంటిలోనే ఎక్కడో నిద్రిస్తుంటాడు. నాన్నా, క్షమించు! నీ ఆజ్ఞని ఉల్లంఘించి వచ్చినందుకు మన్నించు. నా హృదయాన్ని చీలుస్తున్న సందేహాన్ని అణుచుకోగల శక్తి నాకు లేదు.  ఇన్ని సంవత్సరాలూ,…

  • అక్టోబర్ 8, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 4 వ భాగం

    చతుర్థాంకం                        దృశ్యం 4 [రాజు, సుల్తాన్, మొగలి] సుల్తాన్: [బయట ఒంటరిగా ఆకాశంలోకి చూస్తుంటాడు. మెల్లి మెల్లిగా మేఘాలు దట్టంగా కమ్ముకోవడం ప్రారంభిస్తుంటాయి.  అప్పటికే రాత్రి బాగా పొద్దుపోతుంది.  మెరుపులు బాగా మెరుస్తుంటాయి. దూరాన్నుండి ఉరుములు వినిపిస్తుంటాయి] ఇంక కాసేపట్లో ఈ  ప్రదేశం శ్మశానంలా నిర్మానుష్యమైపోతుంది.  ఇదొక చిత్రమైన వ్యవహారం. నాకు ఇదేమీ అర్థం కావటంలేదు.  (రాజును చూపిస్తూ) మనకు తెలియనిది ఏదో ఈ మనుషులని ఆవహించి ఉంది. (ఆకాశాన్ని మరోసారి పరీక్షిస్తాడు. ఆ సమయంలో రాజు…

  • అక్టోబర్ 7, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 3 వ భాగం

    చతుర్థాంకం  దృశ్యం 3 [త్రిభుల, సుల్తాన్ బయట; రాజు మొగలి లోపల] త్రి: (బంగారు నాణేలు  సుల్తాన్ కి ఒక్కొక్కటీ లెక్కబెడుతూ) నువ్వు ఇరవై అడిగేవు.  ప్రస్తుతానికి ఇవిగో పది. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాడంటావా? (నాణేలు ఇవ్వబోతూ ఆగిపోతాడు) సు: (ఆకాశాన్ని పరీక్షిస్తూ) మేఘాలు కమ్ముకుంటున్నాయి.  ఇంకో గంటలో గాలీ వానా వచ్చి అతన్ని ఈ రాత్రికి ఇక్కడే ఉంచేటట్టయితే, మా మొగలికి అవి సహాయం చేస్తాయి. త్రి: అలా అయితే నేను అర్థరాత్రికి వస్తాను.…

  • అక్టోబర్ 7, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 2 వ భాగం

    చతుర్థాంకం   దృశ్యం 2 [ బాహుదా- త్రిభుల బయట; సుల్తాన్, మొగలి, రాజు లోపల.] రాజు: (సుల్తాన్ భుజంపై పరిచయస్తుడిలా చెయ్యి వేసి తడుతూ) “చుక్క”లు రెండూ ఒక్కసారే- నీ సోదరీ, ఆ చుక్కా. త్రి: (తనలో) దేముడి అనుగ్రహం వలన రాజయి, తనమీద ఏ నిఘా లేదని తెలిసి, నీచ సాంగత్యంకోసం నీతి నియమాల్ని బలిచేస్తున్నాడు. కేవలం, ఒక రాదారి విడిది నడుపుకునే వాడు పోసే మద్యం, పాలకులని సైతం సేవకులుగా మార్చే మద్యం, కోరుకుంటున్నాడు. రా: (పాడును)…

  • అక్టోబర్ 6, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం చతుర్థాంకం 1 వ భాగం

    చతుర్థాంకం          బాహుదా దృశ్యం 1 నగర ప్రథాన ద్వారం. అతి ప్రాచీనద్వారం. దానిప్రక్కగా ఒక పాడుబడ్డ ధాన్య నిల్వచేసుకునే గిడ్డంగి. దాని అవతారం చూడగానే అది చవుకబారు మనుషుల విలాస గృహం అని అర్థం అవుతుంది.  ఆ ఇంటిముఖద్వారం ప్రేక్షకులవైపు తెరిచి ఉంటుంది. లోపల చాలా సాదా సీదాగా- ఒక మేజాబల్ల- గోడలోకి చలికాచుకునేందుకు పొయ్యి- డాబామీదకో, డాబామీది గదిలోనికో  వెళ్ళేందుకు సన్నని మెట్ల వరుస. పైనున్న గదిలో కిటికీలోంచి కనిపిస్తున్న మంచం. మంచానికి కుడిప్రక్కగా లోపలకి…

  • అక్టోబర్ 5, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 4 వ భాగం

    తృతీయాంకం  దృశ్యం 4 బాహుదా- త్రిభుల త్రి: (విచారంతోనూ, తీవ్ర స్వరంతోనూ)  ఊ! ఇక చెప్పు! బా: (అవనత శిరస్కురాలై- మధ్య మధ్య వెక్కిళ్ళతో) నాన్నా! నిన్న రాత్రే.. మొదటిసారిగా… అతను మన ఇంటిలోకి ప్రవేశించాడు. ( ఆమె ముఖం చేతుల్లో దాచుకుంటూ) చెప్పలేను! (త్రిభుల ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా తలనిమిరి, నుదుటిమీద ముద్దు పెట్టుకొనును) బా: కాని చాలా కాలం నుండి…. నీకీ విషయం ఎప్పుడో చెప్పి ఉండవలసింది….  నన్ను వెంటాడుతున్నాడు. కాని…

  • అక్టోబర్ 5, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 3 వ భాగం

    తృతీయాంకం దృశ్యం 3  మరువీచి – దర్బారు ప్రముఖులు- త్రిభుల  [పెన్న మినహా మిగతా దర్బారు ప్రముఖులంతా లోనకి వస్తారు.  అతను ద్వారబంధం దగ్గర కాపలా కాస్తుంటాడు.]  మరువీచి: (తలుపువైపు వేలు చూపిస్తూ)  గొర్రెపిల్ల ఆశ్రయంకోసం సింహం గుహలోకి దూరింది.  పార్థివన్: పాపం, త్రిభుల!  పెన్న: (లోపలికి వస్తూ) హుష్! నిశ్శబ్దం! అతను వస్తున్నాడు.  అందరికీ ఇదే హెచ్చరిక.  ఏమీ ఎరగనట్టు ఎవరి పని వారు చేసుకుంటూ పొండి.  మరు: అతను నాతో తప్ప ఎవరితోనూ మాటాడలేడు. …

  • అక్టోబర్ 4, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 2 వ భాగం

    తృతీయాంకం  దృశ్యం 2 రాజు- బాహుదా రా: (బాహుదా ముసుగు తొలగిస్తూ) బాహుదా! బా: (ఆనందం, ఆశ్చర్యంతో) ఓహ్! భగవంతుడా! మధుపాయి! రా: (పట్టరాని నవ్వుతో) నా మీద ఒట్టు! కాకతాళీయం అనుకున్నా, ముందుగావేసుకున్న పధకం అనుకున్నా సరే! లాభం మట్టుకు నాకే! ఓ! బాహుదా! ప్రియా! హృదయేశ్వరీ! ఏదీ, రా! నాచేతులలోకి రా! బా: (లేవబోతూ, మళ్ళీ కూర్చుంటుంది) ప్రభువులు నన్ను మన్నించాలి! నిజానికి నాకు ఏం మాట్లాడాలో తెలియడంలేదు. మధుపాయి! కాదుకాదు, ఇప్పుడు దయగల…

  • అక్టోబర్ 4, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం తృతీయాంకం 1 వ భాగం

    తృతీయాంకం           దృశ్యం 1                                రాజు [ రాజప్రాసాదంలో  ముందరి గదులు.  రినైజాన్సు కాలం నాటి అభిరుచులకు అనుగుణంగా లోపలి అలంకరణలు ఉంటాయి. రంగస్థలం ముందుభాగంలో ఒక మేజాబల్ల,  ఒక కుర్చీ, ఒక స్టూలు, వెనుక భాగంలో తళతళలతో ఒక పెద్ద తలుపు ఉంటాయి. అందంగా వ్రేలాడుతున్న తెరలతో ఎడమవైపుగా రాజుగారి శయన మందిరం. కుడిప్రక్క పింగాణీ పాత్రలు ఉంచుకునే సైడు బోర్డు. వెనుకనున్న తలుపు  డాబామీదకు తెరవబడి ఉంటుంది. దర్బారు ప్రముఖుల ప్రవేశం] గద్దే: ఈ సాహస…

  • అక్టోబర్ 2, 2010

    రాస లీల (The King Amuses Himself) Victor Hugo నాటకానికి స్వేఛ్చానువాదం ద్వితీయాంకం 5 వ భాగం

    ద్వితీయాంకం  దృశ్యం 5 [బాహుదా,  దర్బారు ప్రనుఖులు,  కొంతసేపు పోయిన తర్వాత త్రిభుల. బాహుదా డాబా మీదకు వచ్చును.   ఆమె ఇంటికి ఆవలిముఖంగా ఉంటుంది. చేతిలో ఒక దివిటీ ఉంటుంది. దాని వెలుగు ఆమె ముఖంపై పడుతూంటుంది.] బాహుదా: మధుపాయి! ఆహా! ఎంత తియ్యనైన పేరు!  నా మనోఫలకంపై శాశ్వతంగా  ముద్రించబడుతుంది. (ఇంటి బయట) పెన్న: (తక్కిన వారుతో) సాత్త్వికులారా! అ.. త.. ను కాదు…. ఆమె! గద్దే:  ఎవరో మధ్యతరగతి సుందరి. … (ఆమెను సంభోదిస్తున్నట్టూగా)…

←మునుపటి పుట
1 … 242 243 244 245 246
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

  • అనుసరించు అనుసరిస్తున్నారు
    • అనువాదలహరి
    • మరో 117గురు చందాదార్లతో చేరండి
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • సైటును మార్చండి
    • అనుసరించు అనుసరిస్తున్నారు
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు