-
మృత్యు హేల … Neruda
. అక్కడ ఒంటరి శ్మశానాలున్నాయి, సమాధులనిండా చప్పుడుచెయ్యని ఎముకలు, సొరంగంగుండా ప్రయాణిస్తున్న మనసు, అంతా చీకటి, చీకటి, చీకటిమయం, పగిలిపోయిన ఓడలా మనలోకే మన మహాభినిష్క్రమణం, మన మనసుల్లోకే మనం మునిగిపోతున్నట్టు, మన శరీరం నుండి విడివడి ఆత్మలోకి జారి బతికినట్టు. . అక్కడ శవాలున్నాయి, పాదాలు చల్లగా, బంకమట్టితో చేసినట్టు, ఎముకల్లో మృత్యువుంది, కుక్కలు లేకుండా వినిపిస్తున్న మొరుగుడులా ఎక్కడో దూరంగా రుద్రభూములనుండి వస్తున్న గంటానాదంలా చెమ్మగా ఉన్న గాలిలో వర్షిస్తున్న కన్నీళ్ళలా . .…
-
Akuntaa! Akuntaa!*…. Sivareddy
. What to speak of her! She can kick the globe like a balloon, Can roll up the sky and Tuck it under her arm, She can go aflight with the birds Flying atop the Neem tree And can land on the floor like a butterfly, Else, she can sit delicately on the flowers. What…
-
వెలుగు శిఖరం … Neruda
. ఓ వెలుగు శిఖరమా, వారాశిగర్భంలోని శిల్పాలనూ, కంఠహారాలనూ ఉత్ప్రేక్షించిన విషాద సౌందర్యమా, శుక్ల నేత్రమా, పరీవ్యాప్తజలరాశి చిహ్నమా, ఆల్బట్రాస్ తీతువా, సముద్ర దంతమా, సాగరపవన సహచరీ, ద్వీపసమూహలత లోలోతులలోనుండి ఆవిర్భవించిన ఓ విశిష్ట గులాబీ, ఓ సహజ నక్షత్రమా, ఓ పచ్చల కిరీటమా, ఒంటరి వంశంలోని ఏకైక వంగడమా, ఒక చినుకులా, ఒక ద్రాక్షలా, ఒక సముద్రంలా, ఇప్పటికీ అందవు, దొరకవు, అంతుబట్టవు. . Tower of Light O tower of light, sad…
-
Mother … Sivareddy
What do I know about being a mother, after all! I can never be a mother myself! . I never knew what it’s like being fertile Or how to glean the essence From all soils and infuse life into it. . I never knew how to collect imaginings from All directions and planetary systems, From…
-
Dilemmas at Dusk …Sri Sri
. One evening: . At Roxy Norma Shearer At Broadway Kanchanamala which way to go is the problem a student has confronted. . At Udipi Srikrishna Vilas: . Beckons to it Badam Halva Salivating… Semya Idli choosing between the two has reduced to a puzzle to an employee… . The same evening: . Cascade of…
-
నీ అధరం, నీ స్వరం, నీ శిరోజాలకై నా తపన —- Neruda
. దూరంగా తరలిపోకు… ఒక్క రోజుకైనా… దూరంగా విడిచిపోకు… ఒక్క రోజుకైనా… ఎందుకంటే, నాకెలా చెప్పాలో తెలీదు- రోజంటే చాలా దీ… ర్ఘ… మైనది… నీను నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను… ట్రైన్లన్నీ నడవకుండా ఎక్కడో షెడ్డ్లల్లో నిద్రపోతుంటే, ఖాళీ ప్లాట్ ఫారం మీద ఎదురుచూసినట్టు. . నన్ను విడిచిపెట్టకు, ఒక్క క్షణమైనా, ఎందుకంటే, బొట్లు బొట్లుగా కారే నా ఆవేదన, వరదలా ప్రవహిస్తుంది, తలదాచుకుందికి కలతిరిగిన పొగ, దారితప్పి నాలో ప్రవేశించి, కోల్పోయిన నాహృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.…
-
శ్మశాన వాటి 1… జాషువా
. Aeons passed; not one amongst this ill-fated dwellers of this field had ever woken up. Pity! How long they sleep vegetable? O poor me! How many moms were shattered and grieved Surely, these rocks were scald with the searing tears over years . ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గానీ, ఈ శ్మశానస్థలిన్ కన్నుల్మోడ్చిన మందభాగ్యుడొకడైనన్ లేచిరా, డక్కటా! ఎన్నాళ్ళీ…
-
నిరాశా గీతం – part 2 Neruda
ఓ శిధిలావశేషాల రాశీ! అన్నీ నీలోలయించాయి. నువ్వు ప్రకటించని విషాదం ఏది, నువ్వు మునక వెయ్యని విషాదం ఏది! ఓడముందు నిలబడి, నావికునిలా ఉత్తుంగ తరంగాలపైనుండి నువ్వు పిలుస్తూ ఆలపిస్తున్నావు. నువ్వు గీతాల్లో ఇంకా వికసిస్తూనే ఉన్నావు, కెరటాల్ని అదుముతూనే ఉన్నావు, ఓ శిధిలావశేషాల రాశీ! నువ్వొక గట్టులేని క్షారజల కూపానివి. పాలిపోయిన శీఘ్ర చోదకుడూ, అదృష్టంలేని వడిశల వేటగాడూ, దారితప్పిన శోధకుడూ, అందరూ నీలో లయించారు. ఇది ఇక నిష్క్రమించవలసిన సమయం, రాత్రి ప్రతి ఝాముకీ…
-
నిరాశా గీతం … Part 1 Neruda
. రాత్రయేసరికి నీ జ్ఞాపకం నన్ను చుట్టుముడుతుంది. నది తన అదుపులేని దుఃఖాన్నిసముద్రంతో కలబోసుకుంటుంది. అరుణోదయంతోనే తెరమరుగయే కాంతివిహీనమైన తారకల్లా ఓ నా విరహిణీ! ఇది ఇక విడిపోవలసిన తరుణం. నా హృదయం మీద గడ్డిపూలు వర్షిస్తున్నాయి. ఓహ్, శిధిల శకలాల గుట్ట, భీతావహమైన ఓడ మునక. నీలో సంగ్రామాలూ, తిరోగమనాలూ లయించాయి. నీలోంచే పిట్టల కిలకిలలు రెక్కలు తొడుక్కున్నాయి. అన్నిటినీ నువ్వు కబళించేవు, దూరంలా, సముద్రంలా, కాలంలా. అన్నీ నీలో మునిగిపోయాయి. ఇది చుంబనలతో దాడి…
-
కుక్క చచ్చిపోయింది— Neruda
. నా కుక్క చచ్చిపోయింది. దాన్ని నా పెరట్లో పాతిపెట్టాను. తుప్పుపట్టిన పాత మెషీను పక్కగా. ఏదో రోజు నేను కూడా అక్కడే దాని పక్కన చేరుతాను, ఇప్పటికి మాత్రం దాని బొచ్చుతో, దాని అవలక్షణాలతో, దాని జలుబుతో అది పోయింది, నాస్తికుణ్ణయిన నేను ఎన్నడూ మనిషికి ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో స్వర్గం ఉందంటే నమ్మలేదు, నాకు తెలుసు నేను స్వర్గంలో మాత్రం ఎప్పుడూ అడుగు పెట్టను. కాని, నేను కుక్కలకి స్వర్గం ఉందంటే నమ్ముతాను… అక్కడ అది…