Beauteous Torture … Vimala, Telugu, Indian
Image Courtesy: http://1.bp.blogspot.com
.
When we reduce to
Measuring 34-24-35…
Growing pimples, losing hair,
And a size-zero waistline
Become our perpetual worries…
When our life’s sole aim becomes
Yearning for a beauteous body…
What a torture we suffer from!
.
Boring our ears and nose
We hang rings and nose-beads…
We daub and dab colors to our
Lips, fingers, eyes, and eye-brows…
We chain our neck, waist and feet
With varieties of shackles…
Pricking our body every minute
With tools of beauty
We mob the marts and malls to buy beauty…
Suspending varieties of clothing
To the body-hangers…
Applying oils
Curing it with pastes and turmeric packs,
We knead and knead our figures
Until they get parenthesized between figures…
No matter whether we smile, stroll, speak or sit
We crave for a pretentious beauty…
Cuddling, and cuddling snugly into the moulds
We believe this self-imposed torture
Is connate with us…
.
Whenever we look about ourselves
I am reminded of scare-crows of the corn fields
Stuffed with reed and grass…
Hollowed out of all that we are from ourselves
We look hollow like ‘Egyptian Mummies’…
Even if muscles were measures
For our intellect, for our love, for our responses, and
For our emotions,
And we were reduced to mere bodies…
Then,
Even our bodies are not ours in the end …
What a hideous beauty is this!
.
Where beauty is a competition
Where beauty is a commodity
Let’s hate that trading of beauty!
If beauty were inevitable for our existence,
Let’s hate that very existence!
.
Where we are white-washed,
Erected like walls to hang photos on,
Reduced to decorated ‘bulls’
And hurt with this compulsive ‘beauteous torture’
There
Pals!
Let us call for a life
Nude,
Yes, as nude as when we came out of our mother’s womb,
Sans decorations…sans any measures of beauty!
.
Let us love that lack of beauty
Of Crores of women
Who can’t buy beauty,
Can’t dab colors,
Can’t rivet themselves between figures,
But labor ceaselessly… with
Lips split, hands hardened, hair disheveled,
Eyes tired, and could only don rags!
Let us love the beauty of labor and the human values!
Let us create a wonderful beauty for one and all…
And a world
Replete with unaffected, natural beauty!
.
Vimala
.
సౌందర్యాత్మక హింస
.
మనం అంటే 34-24-35 కొలతలమైన చోట,
మొటిమలు మొలవడం, జుట్టురాలడం
నడుం సన్నగాలేకపోవడమే
మన నిరంతరాందోళనలైనచోట,
దైహిక సౌందర్య పిపాసయే
మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసినచోట,
ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా!
చెవులకీ, ముక్కుకీ రంధ్రాలు పొడిచి
లోలాకులు, ముక్కెరలు వేలాడదీస్తాం.
పెదవులకూ, వేళ్ళకూ, కళ్ళకూ, కనుబొమలకూ
రంగుల్ని అద్దుకుంటాం!
మెడనూ, నడుమునూ, కాళ్ళనూ
రకరకాల గొలుసులతో బంధిస్తాం!
సౌందర్య సాధనాలతో క్షణం క్షణం
శరీరాన్ని గాయపరుచుకుంటూ
దుకాణాల్లో అందాన్ని కొనుక్కునేందుకు ఎగబడతాం.
దేహపు హేంగర్లకు రకరకాల దుస్తుల్ని తగిలించి,
నూనెలు రుద్ది, నలుగు పెట్టి, పసుపులు పూసి
దేహాలను సానబెట్టి, సానబెట్టి
అంకెల మధ్య కుదించుకుని
నవ్వినా, నడిచినా, మాట్లాడినా, కూర్చున్నా
ఒక కృత్రిమ సౌందర్యం కై వెంపర్లాడుతూ…
మూసలోకి వొదిగి, వొదిగి…
ఈ ‘స్వఛ్ఛంద’ సౌందర్య హింస మన సహజాతమని నమ్ముతూ…
.
మనల్ని చూసుకున్నపుడల్లా
గడ్డీగాదం కూరి పంటచేలో నిలబెట్టిన
దిష్టిబొమ్మ గుర్తొస్తుంది.
మమలోంచి మనల్ని తీసేసి, డొల్లచేసిన
‘ఈజిప్షియన్ ‘ మమ్మీల్లాగుంటాం!
పోనీ, మనమేధకూ, హృదయానికీ, స్పందనలకూ,
ఉద్వేగాలకూ కండరాలేకొలమానమైనా,
మనల్ని దేహాల్నే చేసినా,
చివరకు మన దేహమూ మన స్వంతం కాదు-
ఎంత వికృతమైన ‘అందం ‘ అది.
.
అందం పోటీ యైన చోట
అందం సరుకైన చోట
అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం!
మన మనుగడకు అందం అనివార్యమైనచోట
ఈ జీవితాన్నే ద్వేషిద్దాం!
మనల్ని వెల్లవేసి, పటాల్ని తగిలించిన గోడల్ని చేసి,
మనల్ని అలంకృత గంగిరెద్దుల్ని చేసి
నిర్బంధ సౌందర్యాత్మక హింస లో
గాయపరచినచోట
మిత్రులారా!
నగ్నంగా,
అవును, నగ్నంగా, తల్లిగర్భమ్నుండి బయటపడ్డట్టు
ఏ అలంకారాలూ, ఏ సౌందర్య కొలమానాలూ లేని
జీవితాన్ని పిలుద్దాం!
.
రంగులద్దుకోలేని, అంకెలమధ్య శరీరాన్ని ఇముడ్చుకోలేని
నిరంతర శ్రమలో పెదవులు పగిలి, చేతులు కాయలు కాచి,
రేగిన జుట్టుతో, అలసిన కళ్ళతో, చింకిపాతలతో
అందాన్ని ఖరీదుచెయ్యలేని కోట్లాదిమంది స్త్రీల
అందహీనతని మనం ప్రేమిద్దాం!
శ్రమ సౌందర్యాన్నీ, మానవ విలువల్నీ ప్రేమిద్దాం!
అందరికోసం అద్భుత సౌందర్యాన్ని
సహజసౌందర్యభరిత ప్రపంచాన్నీ సృష్టిద్దాం!
.
విమల
‘అడవి ఉప్పొంగిన రాత్రి’ కవితా సంకలనం నుండి
దీన్ని మెచ్చుకోండి:
మెచ్చుకోండి వస్తోంది…
స్పందించండి