Hope Against Hope… Kondepudi Nirmala

http://static2.bigstockphoto.com/thumbs/3/8/1/large2/18394331.jpg
Image Courtesy: http://static2.bigstockphoto.com

.

She abhors moonshine…

And detests the drizzle…

She vents impatience

At the inability of her dwarfish hands

To reach out to Rajahmundry from Bezwada 

And her vengeance over the world and

something she can’t name or express

In locking the door…

Scurrying out with a lunch box stuffed in hurry,

hanging on to the bus, to the rickshaw, to her own walk,

And to the nail-biting typewriter,

dragging the day with black carbons till night fall

With bought out sleep and endless dreaming …

And even in those fortuitous fortnightly love-plays

Remembering only the last swearing of the boss for asking for leave,

Before they could rehearse how to open up

with the none-too-assuring words,

the devil of a train blares the whistle

and they withdraw their embracing looks  —

“I remain, ta-ta, take care of your health”

become routine hackneyed phraseology.

For the miracle of getting tethered to the same post happen—

they go on sending application after application

And reassuring their existence through

postal-delayed letters and with connected and disconnected calls,

with the fond hope … that,  at least,

“passed away’ message

passes on to the other partner on time..

.

షరా మామూలే

……………………….

వెన్నెలంటే చీదరగా…

వానంటే చిటచిటగా …..

బెజవాడ నుంచి రాజమండ్రికి అల్లుకోలేని

మరుగుజ్జు చేతులమీద అసహనంతో ఆవిడ

లోకంమీద కసినీ, మరేదో తెలీనితనాన్నీ తలుపుకి తాళం బిగించడంలో చూపిస్తూ

కంగారు మెతుకుల డబ్బాతో

బస్సుకి వేలాడి నడకలో వేలాడి

పటపటా వేళ్ళు కొరుక్కుతింటున్న టైపుమిషనుకి వేలాడి

నల్లటి కార్బనుతో పగటిని రాత్రికి మోసికెడుతూ

కొనుక్కున్న నిద్రలతోనూ,  కొలిక్కిరాని కలల కలవరింతలతోనూ

పున్నమికో అమవశకో పోగుపడ్డ ప్రేమాటలో సైతం

సెలవడిగిన వేడుకోలుకి అధికారి వాడిన ఆఖరితిట్టు గుర్తొచ్చి

భరోసాలేని కబుర్లతో గొంతెలా విప్పాలో రిహార్సలు వేసుకునేలోగా

కూత వేటు వేసిన రైలు రాకాసికి పెనగి

ఎవరి చూపులు వాళ్ళు లాక్కుంటూ

“వుంటాను టాటా ఆరోగ్యం జాగ్రత్త “గా

షరా మామూలై

ఒకే రాటకు మెడ బిగించుకునే అధ్బుతంకోసం

అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూ

పోస్టల్ డిలే ఉత్తరాలతోనూ కలిసీ కలవని టెలిఫోన్ తీగలతోనూ

బతికే వున్నామనిపించుకుంటూ

చావు వార్త చేరుతుందని నమ్ముతూ….

.

కొండేపూడి నిర్మల

12.6.90

బాధా సప్త నది – కవితా సంకలనం నుంచి

“Hope Against Hope… Kondepudi Nirmala” కి 2 స్పందనలు

  1. మూర్తి గారికి
    నిర్మలగారు నా అభిమాన కవయిత్రి. ముందు తెలుగు వెర్షన్ చదివాను.
    ఒకే రాటకు మెడ బిగించుకునే అధ్బుతంకోసం
    అన్న వాక్యాలు ఎలా అనువదించి ఉంటాయా అని ఆతృతగా చూసాను.అద్బుతంగా చేసారు.
    తెలుగు కు సంబ్ందించినంత వరకూ ఇంగ్లీషునుంచి తెలుగు చేసేవారు తప్ప తెలుగు నుంచి ఇంగ్లీషులో కి అనువదించేవారి సంఖ్య తక్కువ. మన బ్లాగుల్లో అయితే జగద్దాత్రిగారు కనిపిస్తారు. ఆ విధంగా మో, వివిబి రామారావు గారలు చక్కని అనువాదాలు చేసేవారు.
    ఆ కారణంగా తెలుగు సాహిత్యం ఇతర భాషా కవులను చేరలేకపోతుంది. ఆ లోటు మీరు భర్తీ చేస్తున్నందుకు సంతోషిస్తూ…….

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    మెచ్చుకోండి

  2. బాబాగారూ, మీ అభిమానపూర్వకమైన లేఖకి ధన్యవాదాలు. అనువాదం మూలానికి విధేయత ప్రకటిస్తూనే, ఇంగ్లీషు సంబంధించినంతవరకు, దాని ఉనికి అది కలిగిఉండేలా అనువాదం చెయ్యాలని నా తపన. మీకు నచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: