ఒంటరి కోతగత్తె … వర్డ్స్ వర్త్


https://s3.amazonaws.com/saatchi/58834-7512590-7.jpg
Image Courtesy: https://s3.amazonaws.com

.
చూడుడామెను, ఒక్కతె… పొలమునందు 

ఎదర కనిపించు ఒంటరి మిట్టవాసి,

కోతకోయుచు తనుదానె పాటపాడు,

నిలుడు! లేకున్న మిన్నక సాగిపొండు.

ఒంటరిగ చేను కోయుచు, పనల గట్టు,

ఆమె గీతిక ఆపాతవిషాదభరము,

వినుడు! మార్మ్రోగె లోయ ప్రతిరవముతో.

.

అరబుదేశపు ఇసుక ఎడారులంట,

సేదదీరెడు బాటసారుల విహారములయందు,

వారి శ్రమదోవ ఇంత కమ్మని రవమ్ము,

మచ్చుకొక చకోరమైన వినిపించలేదు 

ఇంత తియ్యని స్వరము వినిపించలేదు

కోకిలలుగూడ మును వసంతాగమనవేళ,

దూరతీరాల ద్వీప సమూహమందు,

కడలి సాంద్ర గభీర నీరవమణచుచు.

. 

ఎవ్వరైనను చెప్పరే పాట భావ

మది గతించిన బాధల పల్లవియొకొ?

యుధ్ధ గీతికొ? లేకున్న జానపదమొ?

మనకు ఎరుకైన వృత్తమొ?మరల మరల

కలత పెట్టెడు స్మృతి, విషాదమొ, పోగొట్టుకున్న బాధొ? 

.

విషయమేదైన, పాటకు ముగింపు

లేనియట్టుల పాడెను పడతి,  నేను

జూచితి కొడవలిని నూతగొనుచు

పాటుబడె నామె, పాటను విడువలేదు,

చెవుల చవిగొని,  గుండెనిండార త్రావి 

కొండ నెక్కితి పాటను తోడుగొనుచు,

గుండెసడిలోన అది ప్రతిధ్వనించె,  

గడచినది కాలమెంతయొ, పాట వినిపించి మున్ను

.

వర్డ్స్ వర్త్

The Solitary Reaper
.

Behold her, single in the field,

Yon solitary Highland Lass!

Reaping and singing by herself;

Stop here, or gently pass!

Alone she cuts, and binds the grain,

And sings a melancholy strain;

O listen! for the Vale profound

Is overflowing with the sound.

No Nightingale did ever chaunt

So sweetly to reposing bands

Of Travellers in some shady haunt,

Among Arabian Sands:

No sweeter voice was ever heard

In spring-time from the Cuckoo-bird,

Breaking the silence of the seas

Among the farthest Hebrides.

Will no one tell me what she sings?

Perhaps the plaintive numbers flow

For old, unhappy, far-off things,

And battles long ago:

Or is it some more humble lay,

Familiar matter of to-day?

Some natural sorrow, loss, or pain,

That has been, and may be again!

Whate’er the theme, the Maiden sang

As if her song could have no ending;

I saw her singing at her work,

And o’er the sickle bending;–

I listened till I had my fill;

And, as I mounted up the hill,

The music in my heart I bore,

Long after it was heard no more.

.

William Wordsworth

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.