Butterflies… vimala, Telugu, Indian

Image Courtesy: http://www.cutcaster.com

.

Whenever I forget dreaming about,

A Butterfly comes and rests on my eyelids with compassion,

And gifts me

With a dream and a smidgen of poetry.

.

When I  walk away becoming an ascetic

And a Sufi mendicant at the Vaitarini*,

Leaving behind the Sarangi of Faith and the Flag of moonbeams

A butterfly landing on my fore arm flapping its rainbow-wings

Initiates a dialogue with me

Like a very fast good old friend

.

When I watch idly the coquettish waves on the blue seashore 

Or, the voluptuous clouds wafting aloft on the azure sky,

A butterfly courses from nowhere

To spray honey over my lips.

.

When life loses its fragrance,

A band of butterflies

Dwelling on the arbor of Goldflowers,

Descend on my book-of-life

Like multi-hued letters.

.

Whenever the darkness of

Tenuous humanity frightens me,

A tiaraed butterfly settles slowly

And prognoses like a priestess of the Oracle 

Flood-lighting my way all through. 

.

When I pen a poem on the cheeks of Time,

A butterfly flies down ever so delicately

To settle on my peacock-plume pen

.

 I go in search of an island of butterflies.

I was, perhaps, a butterfly myself in my last life.

There’s a chest of butterfly-tattoos on my chest.

Today, I started off  searching for those butterflies

Which bestowed wings to my thoughts

And dabbed them with every hue.  

.

vimala

Notes:

Vaitarini : Is a river that all souls are supposed to cross to enter the pathway to Heaven

.

సీతాకోక చిలుకలు

.

నేను స్వప్నించటం  మరిచిపోయినప్పుడల్లా

నా కళ్లపై దయగా వచ్చి వాలుతుందొక  సీతాకోకచిలుక

ఒక కలని, కాసింత కవిత్వాన్ని

కానుకగా ఇచ్చిపోతుంది.

.

విశ్వాసాల సారంగినీ, వెన్నెల జెండానీ,

వైతరణీ నది ఒడ్డునే పోగొట్టుకుని

నేనిక సర్వసంగ పరిత్యాగ సూఫీ బిక్షుకినై

నడిచివెళ్ళేవేళ,

నా ముంజేతిపై వాలిన సీతాకోకచిలుక

ఇంద్రధనుస్సుల రెక్కల్ని అల్లార్చుతూ,

ప్రియాతిప్రియమైన చిరకాల నేస్తం వలె

నాతో  సంభాషణ కలుపుతుంది.

.

నీలాల సముద్రం వొడ్డున వగలుపోయే అలల్నీ

వినీలాకాశంలో హొయలు హొయలుగా తేలిపోయే మేఘాల్నీ,

అట్లా నిర్వ్యాపకంగా, మౌనంగా చూస్తున్నప్పుడు

ఎక్కడినుండో వచ్చి నా పెదవులపై

మధువు కుమ్మరించి వెడుతుందో సీతాకోకచిలుక.

.

జీవన సౌరభం నశించినప్పుడల్లా

సంపెంగ పూల పొదలపై వాలిన

సీతాకోకచిలుకల గుంపులు

నా బతుకు పుస్తకంలో రంగు రంగుల

అక్షరాల్లావచ్చి వాలతాయి.

.

అనంత ప్రకృతిలో మనుషుల అల్పత్వపు చీకటి

నన్ను భయపెట్టినప్పుడల్లా

శకునాలు చెప్పే మంత్రగత్తెవలె,

ఒక సీతాకోకచిలుక శిరస్సున వజ్రధారియైవాలి,

దారంతా వెలుగు కిరణాల్ని చల్లిపోతుంది.

.

కాలం చెక్కిలిపై నేను కవిత్వం రాసేటప్పుడు,

నా నెమలి పింఛపు కలంపై ఎక్కడినుంచో

సుతారంగా వచ్చివాలుతుందొక సీతాకోకచిలుక.

.

నేనొక సీతాకోకచిలుకల దీవిని వెతుక్కుంటూ బయలుదేరాను.

గడచిన జన్మలో నేనే ఒక సీతాకోకచిలుకనేమో

నా గుండెపై పదిలంగా సీతాకోక చిలుకల పచ్చబొట్లు.

నాఊహలకి రెక్కల్ని, సకల వర్ణాల్నివొసగిన

సీతాకోక చిలుకల్ని వెతుక్కుంటూ బయలుదేరా నీ వేళ.

.

తెలుగు మూలం: విమల

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: