-
నడవని త్రోవ … రాబర్ట్ ఫ్రాస్ట్
Image Courtesy: http://preapism.com . రెండు దారులు చీలి ఉన్నాయి అడవిలో. నేను బాటసారినై, ఒక్కడ్నే రెండు దారులంటా వెళ్లలేను. అదే విచారం! చాలాసేపు ఆలోచిస్తూ నిలుచున్నాను దట్టంగా పెరిగిన పొదలలో మలుపు తిరిగేవరకూ నాకు కనిపించిన ఒక దారిని గమనిస్తూ. . ఇపుడునేను రెండో బాట పట్టేను, మొదటి తోవంత నాణ్యమైనదే. బహుశావెళ్ళాలనిపించడానికీ దానికంటే కొంచెం మెరుగనిపించడానికీ గడ్డి బాగా మొలిచి ఎక్కడా నలగకపోవడం కారణమేమో. ఆమాటకొస్తే, నడుస్తుంటే రెండూ ఒక్కలాగే నలిగేవేమో. . ఆ…
-
నిశ్శబ్దం – ఎడ్గార్ ఏలన్ పో
. కొన్ని గుణాలున్నాయి- నిరాకారమైనవి, వాటి ప్రత్యేకతని గుర్తించడానికి అనువుగా పదార్థమూ- వెలుగూ; ఆకారమూ-నీడా వంటి ద్వైదీభావాలనుండి ఉత్పన్నమయేవి. . నిశ్శబ్దానికి రెండంచెలున్నాయి… సముద్రమూ- ఒడ్డూ; శరీరమూ- ఆత్మా లా. ఒకటి ఏకాంత మరుసీమల్లో వసిస్తుంది… కొత్తగా ఒత్తుగా పెరిగిన దర్భశయ్యల అంతరం లా. రెండవది భయద గంభీర లావణ్యమైనది… మానవ విషాద చరితలతో, స్మృతులతో, కలగలిసి అది అంటే భయాన్ని హరిస్తుంది. … అదే మృత్యువు… అదే అనంత నిరాకారమైన నిశ్శబ్దం. దానికి భయపడవద్దు. దానికి …
-
విలక్షణమైన స్త్రీ … మాయా ఏంజెలో
. అందమైన స్త్రీలంతా, నా సౌందర్య రహస్యం ఎక్కడుందా అని ఆశ్చర్యపోతుంటారు. నిజానికి నేనంత తీర్చినట్టుండను, ఫేషను మోడల్ అంత ఎత్తులో అసలుండను. నేను చెప్పడం ప్రారంభిస్తే, నేనబద్ధం చెబుతున్నాననుకుంటారు. నా సౌందర్యం నా పొడవైన చేతులలో ఉంది… నా జఘన విస్తృతిలో ఉంది… నా దీర్ఘమైన అడుగులలో ఉంది… నా పెదవుల వంపులలో ఉంది… నేనొక అసాధారణమైన స్త్రీని. విలక్షణమైన స్త్రీ అంటే అది నేనే! . నేను గదిలోకి అడుగు పెడితే చాలు,…
-
ఓ సమయం వస్తుంది… ఫెర్నాండో పెసో
. ఓ రోజు వస్తుంది… మన శరీరానికి అతుక్కుపోయి దాని ఆకారం పొందిన దుస్తుల్ని వదిలివేయవలసి సమయం. . మనల్ని ఎప్పుడూ వెళ్ళినచోటికే తీసుకువెళ్ళేదారుల్ని మరచిపోవలసిన సమయమూ వస్తుంది. . దానర్థం ఇప్పుడు మనం కొత్త దారి వెతుక్కోవలసిన సమయం ఆసన్నమైందని… ఇప్పుడు ధైర్యం చెయ్యలేకపోయామో ఉన్నచోటే … శాశ్వతంగా… మన రాదారి నుండి పక్కకి మనల్ని మనమే ఈడ్చుకుపోయినట్టన్నమాట. . ఫెర్నాండో పెసో పోర్చుగీసు కవి . There is a time where you have…
-
Knowing full well … Vimala, Telugu, Indian
. (The agony and angst of the poem can be understood better by the readers if they come to know that the poetess Vimala was once an active revolutionary spending the prime of her youth in forests, married to another revolutionary (but had very little family life with both of them attending different assignments) who was later…
-
వర్షం పడుతుంటే… కరీనా పెరుస్సి
. అది చలి వణికిస్తున్న రాత్రి… వర్షం పడుతూంటే, ఇంటికి ఒంటరిగా వెళ్ళేను, బట్టలు తడిసిపోయి… . అంతా చిమ్మ చీకటి, శూన్యం… విషాదం… నా మాటవినే వాళ్ళెవరూ లేరు, నిశ్శబ్దం మాత్రం రాజ్యమేలుతోంది, నేను ఒకవేళ అరవడానికి ప్రయత్నించినా … నేననుకుందామన్న మాటలు బయటకు రావు. . ప్రతి చినుకూ, కన్నీటిలో కలిసిపోయింది, భయం… బాధ… అన్ని తప్పుడువిషయాలపట్లా అసహ్యం… అలా జారి జారి… బొట్లు తునాతునకలయ్యాయి… అన్ని వస్తువుల్లాగే… అందరి మనుషుల్లాగే… అన్ని క్షణాల్లాగే… …
-
ఒంటరి కోతగత్తె … వర్డ్స్ వర్త్
Image Courtesy: https://s3.amazonaws.com . చూడుడామెను, ఒక్కతె… పొలమునందు ఎదర కనిపించు ఒంటరి మిట్టవాసి, కోతకోయుచు తనుదానె పాటపాడు, నిలుడు! లేకున్న మిన్నక సాగిపొండు. ఒంటరిగ చేను కోయుచు, పనల గట్టు, ఆమె గీతిక ఆపాతవిషాదభరము, వినుడు! మార్మ్రోగె లోయ ప్రతిరవముతో. . అరబుదేశపు ఇసుక ఎడారులంట, సేదదీరెడు బాటసారుల విహారములయందు, వారి శ్రమదోవ ఇంత కమ్మని రవమ్ము, మచ్చుకొక చకోరమైన వినిపించలేదు ఇంత తియ్యని స్వరము వినిపించలేదు కోకిలలుగూడ మును వసంతాగమనవేళ, దూరతీరాల ద్వీప సమూహమందు,…
-
Butterflies… vimala, Telugu, Indian
. Whenever I forget dreaming about, A Butterfly comes and rests on my eyelids with compassion, And gifts me With a dream and a smidgen of poetry. . When I walk away becoming an ascetic And a Sufi mendicant at the Vaitarini*, Leaving behind the Sarangi of Faith and the Flag of moonbeams A butterfly…
-
క్షణికం … కరీన పెరుస్సి పోర్చుగీసు కవి
. (మిత్రులందరికీ నా బ్లాగు ఒకసంవత్సరంపూర్తిచేసిన సందర్భంగా కృతజ్ఞతలూ, శుభాకాంక్షలూ. ఈ ఏడాదిలో సుమారు వంద దాకా అనువాదాలు అందించగలిగాను. అయితే యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో చదువునిమిత్తం వెళ్ళి స్ప్రింగ్ సెమెష్టర్ పూర్తిచేసే వరకూ అనువాదాలురచురించలేకపోయాను. అరోగ్యకారణాలవల్ల వెనకకి తిరిగివచ్చినా, ఆ అనుభవం ఇంకా ప్రేరణనిచ్చింది. ఈ ఏడాదిలో ఎంతమందోమంచి మిత్రుల్ని సంపాదించగలిగేను.అది చాలా సంతృప్తినిస్తుంది. ఈ ఏడాది కూడా అంతర్జాతీయ కవుల అనువాదాలు కొనసాగిస్తాననీ, ఇంతకు ముందులాగే సామాజిక బాధ్యత కొనసాగిస్తూ నా బ్లాగులో…
-
వెలితి … వర్డ్స్ వర్త్
. ఆకస్మాత్తుగా కలిగిన ఈ సంతోషానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ, గాలికన్నా కుదురు లేకుండా, ఈ ఆనందకరమయిన విషయం పంచుకుందామని పరిగెత్తుకుని వచ్చాను. ఓహ్! ఇంకెవరు? అదిగో అగాధ నీరవ సమాధిలో… ఏ మార్పుకీ చిక్కకుండా ఉన్న నీ దగ్గరకే. ప్రేమ, చెక్కుచెదరని ప్రేమ అనగానే నువ్వు మనసులో మెదుల్తావు. అసలు నిన్నెలా మరిచిపోగలనని? కానీ ఒక లిప్తలో వెయ్యోవంతుసేపు జీవితం లొ నాకు కలిగిన ఈ తట్టుకొలేని నష్టాన్ని నేను ఏమరిచేలా ఏ శక్తి పనిచేసిందో మరి?…