-
నిండా ఐదు నిలువులలోతు… షేక్స్పియర్
మీ నాన్న నిండా ఐదు నిలువుల లోతులో ఉన్నాడు పగడాలు అతని ఎముకలతోనే తయారవుతాయి; ఆ మెరుస్తున్న ముత్యాలు అతని కన్నులే అతనికి సంబంధించినవేవీ కళావిహీనమవవు బదులుగా,ఒక అద్భుతమూ అపురూపమూ ఐన వస్తువుగా రూపుదాలుస్తాయి; జలదేవతలు అతని స్మృతిలో గంట గంటకీ సంగీతం ఆలపిస్తుంటారు. అదిగో విను! నాకు వినిపిస్తోంది … గంట గణగణ. . షేక్స్ పియర్ విలియం షేక్స్పియర్ అందరికీ ఒక గొప్ప నాటక కర్తగా పరిచయం. ఆ రోజుల్లో కవిత్వ సంప్రదాయం అంతా…
-
శృతిలేని స్మృతిగీతం … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
కరకు నేల ప్రేమ మయమైన హృదయాలను కప్పిపుచ్చడానికి నేనింకా అలవాటు పడలేదు; కానీ నిన్నా, నేడూ, రేపూ, అనాదినుండీ అలాగే జరుగుతోంది. పండితులూ, స్ఫురద్రూపులూ చీకట్లో కలిసిపోతారు. పూలహారాలతో లిల్లీలతో అలంకరింపబడి మరీ వెళతారు; అయినా అంగీకరించబుద్ధి కావటం లేదు. ప్రేమికులూ, ఆలోచనా పరులూ అంతా నీతోపాటే మట్టిలోకి… ఏ తేడాలూ తెలియని రసహీనమైన మట్టిలో అంతా ఒకటైపోతారు. నీకు తెలిసినదీ, నువ్వు అనుభవించినదాంట్లో ఒక లేశం, ఒక కొండగుర్తు, ఒక పేరు మాత్రం మిగిలి… ఉత్తమమైనది…
-
మార్జిన్లో రాతలు … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి
ఒక్కోసారి వ్యాఖ్యలు మరీ పరుషంగా ఉంటాయి సన్నని నల్లటి చేవ్రాలులో… ప్రతి పేజీ మార్జిన్లోనూ చెల్లాచెదరుగా కోపంతో రచయితమీద వ్యతిరేకంగా. “నా చేతికిగాని దొరికితే, Kierkegaard ! Conor Cruise O’Brien! తలుపు గడియపెట్టి మీ తలలోకి కాస్తతర్కం ఎక్కేలా చేస్తాను,” అన్నట్టు ఉంటాయి. కొన్ని వ్యాఖ్యలు మాత్రం అప్పటికప్పుడు వ్రాసినవి “అర్థం పర్థంలేదు,” అంటూ తీసిపారేసే రకమో, “ప్లీజ్”, “హ్హహ్హహ్హా” అని రాసే రకమో అన్నమాట. నాకు బాగా గుర్తు, ఓ సారి పుస్తకం చదువుతూ……
-
నీలాంబరాలు… Sara Teasdale
ఎన్ని లక్షల వసంతాలు గడిచిపోయి ఉంటాయి నీలాంబరి పూలు అంత నీలంగా ఉంటాయనీ, వాకకాయలు అంత తెల్లగా ఉంటాయని నేను తెలుసుకునే లోపు. ప్రాణం నాతో తెగతెంపులు చేసుకున్నాక అల్లనల్లన వచ్చే ఎన్ని వేల వసంతాలు నీలాంబరాలతో నీలిమంటలనీ వాకపొదల్లో తెల్లమంటల్నీ పుట్టిస్తాయో. ఓహ్! మీ అందంతో నన్ను దహించండి! ఓ చెట్టూ చేమల్లారా! నన్ను గాయపరచండి, లేకపోతే చివరికి మృత్యువు ప్రయత్నిస్తుంది ఈపాటి సంతోషసమయాన్ని కూడా మిగల్చకుండా లాక్కుపోడానికి. తూగాడే పువ్వుల్లారా!తళతళలాడే…
-
ఒక స్త్రీ సమస్య… ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, ఇంగ్లండు
నా భవిష్యత్తుని నమ్మి నీకు అప్పగించే ముందు, లేక నీ చేతిలో చెయ్యి వేసే ముందు, నీ భవిష్యత్తు నా భవిష్యత్తుని రంగుల్లో రూపించే అవకాశం ఇచ్చే ముందు నా సర్వస్వాన్నీ పణం పెట్టే ముందు, ఈ రాత్రి నీ ఆత్మని ఒకసారి నా కోసం ప్రశ్నించు చిన్న చిన్న బంధాలని తెంచుకోగలను, ఛాయా మాత్రంగా కూడా విచారం దరిజేరనీను; నీ గతంలోంచి ఇప్పటికీ నీ మనసుని కట్టి పడేసే బంధం ఏదైనా ఉందా? నేను ఎంత…
-
అభాగ్య సైనికుడి స్మృతిలో… విల్ఫ్రెడ్ ఓవెన్, ఇంగ్లీషు కవి
గొడ్లలా నరకబడే వీళ్ళకోసం ఏ గంటలు మ్రోగుతాయి, భయానకమైన ఫిరంగుల గర్జనలు తప్ప? డగడగమని చప్పుడుచేసే మరతుపాకులమ్రోత ఒక్కటే బహుశా వాళ్ళ కడసారి ప్రార్థనలను వల్లేస్తుంది. వాళ్లకిప్పుడు ఏ కర్మకాండలతోనూ, విలాపగీతాలతోనూ, బాజాలతోనూ పనిలేదు; ఆ ఒక్క మేళం తప్ప …అదే, కీచుగా, పిచ్చెత్తినట్టు నాల్గుదిక్కులా మోగే ఫిరంగుల మేళం; దేశం పల్లెపల్లెనా మృత్యుఘంటికలు మ్రోగుతూనే ఉన్నాయి; వాళ్ళ ఆత్మలకోసం ఎవరు ఇక్కడ దీపాలు వెలిగించగలరు? ఆ కుర్రవాళ్ళ వీడ్కోళ్ళు వాళ్ళ చేతులలో కాదు వాళ్ళ కళ్ళల్లో…
-
ఎడబాటు… డబ్ల్యూ ఎస్ మెర్విన్, అమెరికను కవి.
సూదిలోంచి దారం దూరినట్టి నీ ఎడబాటు నా గుండెను దూసుకుపోయింది. ఇక నా చేతలన్నీ, ఆ రంగుతో అద్దినవే. . డబ్ల్యూ ఎస్ మెర్విన్ (September 30, 1927) అమెరికను కవి కొన్ని కవితల క్లుప్తతే వాటి ప్రాణం. అంతే కాదు, కొందరు కవులు ఎంచుకునే ఉపమానాలు చాలా గడుసుగా ఉంటాయి. పైకి చెప్పిన మాటకంటే, ఉపమానంద్వారా వాళ్ళు అందించే భావం ఉన్నతంగా, సున్నితంగా ఉంటుంది. ఉదాహరణకి, ఈ కవితలో నీ ఎడబాటు నా గుండె దూసుకుపోయింది…
-
సైనికుడి శపథం… మేజర్ జనరల్ విలియం హెన్రీ రూపర్టస్, అమెరికను
ఇది నా తుపాకీ. దాని లాంటివి చాలా ఉన్నాయి గానీ, ఇది నాది. నా తుపాకీయే నా ఆప్త మిత్రుడు. అది నా ప్రాణం. నా జీవితం మీద పట్టుసాధించవలసినట్టే దానిమీదా పట్టు సాధించాలి. నేను లేకుంటే నా తుపాకీ నిరుపయోగం. నా తుపాకీ లేకుంటే, నేనూ నిరుపయోగం. నా తుపాకీని నేను సరిగా వాడుకోగలగాలి. నన్నుచంప ప్రయత్నించే నా శత్రువుకంటే సూటిగా నేను దాన్ని వాడగలగాలి. అతను నన్ను కాల్చేలోగా నేనతన్ని కాల్చాలి. తప్పకుండా. నాకూ…
-
బిల్బో హంసగీతి… జె. ఆర్. ఆర్. టోల్కియెన్, ఇంగ్లీషు రచయిత
పొద్దు ముగిసింది, కళ్ళు మసకబారుతున్నై కానీ ఎదురుగా వెళ్ళవలసిన దూరం చాలా ఉంది. మిత్రులారా! సెలవిక! పిలుపు వచ్చేసింది. రాతిగోడకి ఆవల నౌక సన్నద్ధంగా ఉంది. నురుగు తెల్లగా, కెరటాలు నల్లగా కనిపిస్తునై; పడమటి కొండనుదాటి అదిగో త్రోవ సాగుతోంది. నురుగు ఉప్పగా, గాలి హాయిగా తగుల్తునాయి. అదిగో సముద్రం ఎగిసిపడడం వినిపిస్తోంది. . మిత్రులారా, సెలవిక! తెరచాపలు తెరచాపలు పైకి లేచాయి. తూరుపుగాలి వీస్తోంది, లంగర్లు అసహనంగా కదుల్తునాయి ఎప్పుడూ ఊరిస్తూ చేతికిచిక్కని ఆకాశం క్రింద…
-
సమాధుల మధ్య సందర్శకురాలు… రాబర్ట్ గ్రేవ్జ్, ఇంగ్లీషు కవి
బాతుల అరుపులా దుస్తులు రాపిడిచేసుకుంటూ కొట్టొచ్చినట్టుకనిపించే పూలగుత్తులుపట్టుకుని ఈ పురాతన నిరామయ, శీతలప్రదేశంలో ప్రశాంతతనద్దిన మా ప్రాంగణంలోకి ఎందుకొస్తావు? ఎముకలపోగులై మా మానాన్న మేము ఉంటున్న ఈ నిశ్చల సరస్సులో కలకలం ఎందుకు రేపుతావు? మమ్మల్ని మా ఊహలకీ, సుదీర్ఘమైన బాధలకీ దయచేసి విడిచిపెట్టు, సుందరీ! . రాబర్ట్ గ్రేవ్జ్ 24 July 1895 – 7 December 1985 ఇంగ్లీషు కవి . . The Lady Visitor in the Pauper Ward…