బాతుల అరుపులా దుస్తులు రాపిడిచేసుకుంటూ
కొట్టొచ్చినట్టుకనిపించే పూలగుత్తులుపట్టుకుని
ఈ పురాతన నిరామయ, శీతలప్రదేశంలో
ప్రశాంతతనద్దిన మా ప్రాంగణంలోకి ఎందుకొస్తావు?
ఎముకలపోగులై మా మానాన్న మేము ఉంటున్న
ఈ నిశ్చల సరస్సులో కలకలం ఎందుకు రేపుతావు?
మమ్మల్ని మా ఊహలకీ, సుదీర్ఘమైన బాధలకీ
దయచేసి విడిచిపెట్టు, సుందరీ!
.
రాబర్ట్ గ్రేవ్జ్
24 July 1895 – 7 December 1985
ఇంగ్లీషు కవి
.

.
The Lady Visitor in the Pauper Ward
.
Why do you break upon this old, cool peace,
This painted peace of ours,
With harsh dress hissing like a flock of geese,
With garish flowers?
Why do you churn smooth waters rough again,
Selfish old skin-and-bone?
Leave us to quiet dreaming and slow pain,
Leave us alone.
.
Robert Graves
From:
Graves, Robert. Fairies and Fusiliers. New York: A.A. Knopf, 1918; Bartleby.com, 1999. www.bartleby.com/120/.
వ్యాఖ్యానించండి