ఇది నా తుపాకీ.
దాని లాంటివి చాలా ఉన్నాయి గానీ, ఇది నాది.
నా తుపాకీయే నా ఆప్త మిత్రుడు. అది నా ప్రాణం.
నా జీవితం మీద పట్టుసాధించవలసినట్టే
దానిమీదా పట్టు సాధించాలి.
నేను లేకుంటే నా తుపాకీ నిరుపయోగం.
నా తుపాకీ లేకుంటే, నేనూ నిరుపయోగం.
నా తుపాకీని నేను సరిగా వాడుకోగలగాలి.
నన్నుచంప ప్రయత్నించే నా శత్రువుకంటే సూటిగా నేను దాన్ని వాడగలగాలి.
అతను నన్ను కాల్చేలోగా నేనతన్ని కాల్చాలి. తప్పకుండా.
నాకూ నా తుపాకీకీ తెలుసు… మేము ఎన్ని గుళ్ళు కాల్చేమన్నది కాదు ముఖ్యం
ఎంతగట్టిగా అరిచేనన్నదీ, ఎంతపొగ సృష్టించేమన్నదీ అంతకన్నా కాదు.
ఎన్ని సార్లు గురితప్పకుండాకొట్టగలిగేమన్నదే ముఖ్యం. గురి తప్పం.
నా తుపాకీ కూడా మనిషిలాటిదే, నా లాగ. ఎందుకంటే అది నా ప్రాణం కనుక.
అందుకే దాన్ని నా తోబుట్టువులా క్షుణ్ణంగా తెలుసుకుంటాను.
దాని బలాలూ, దాని బలహీనతలూ, దాని విభాగాలూ,
దాని ఉపకరణాలూ, దాని గొట్టమూ, అదిచూడగల దూరమూ…
అది వాతావరణంలోని మార్పులకి చెడిపోకుండా కాపాడుకుంటాను.
నన్ను నేను పరిశుభ్రంగా, సిద్ధంగా ఉంచుకున్నట్టే
నా తుపాకీని కూడా ఎప్పుడూ శుభ్రంగా,తయారుగా ఉంచుతాను.
మేమిద్దరం ఒకరికొకరు శరీరంలో భాగం అయిపోతాం.
భగవంతుని ముందు ఇది ప్రమాణం చేసి చెబుతాను:
నేనూ నా తుపాకీ నా దేశానికి రక్షకులం.
మేము మా శత్రువుని లోబరుచుకోగలం.
మేము నా ప్రాణాన్ని కాపాడుకోగలం.
శత్రువులందరూ సమసి శాంతిమాత్రమే నెలకొనేవరకూ
ఇలా ఉండవలసి వస్తే, ఉండనీ. ఫర్వాలేదు.
.
మేజర్ జనరల్ విలియం హెన్రీ రూపర్టస్.
(November 14, 1889 – March 25, 1945)
.
.

స్పందించండి