అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • అక్టోబర్ 8, 2013

    Solitude or Loneliness? … Manasa Chamarti

    Even amidst a large gathering This loneliness hurts me deep; Even as I go in search of solitude A vague idea treads on my trails. Whole world is asleep… excepting me, Even the capering stream takes rest, suspending its giggles, The recent agitation amidst the foliage is absent, and There is no trace of the…

  • అక్టోబర్ 7, 2013

    కాలమొక ఒడిదుడుకుల ప్రవాహం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి

    కొమ్మలు నరికినచెట్టు మళ్ళీ పెరగవచ్చు, మోడులైన మొక్కలు తిరిగి పుష్పించి ఫలించవచ్చు; దౌర్భాగ్యుడికి కష్టాలు తొలగిపోవచ్చు, ఎండి బీడైననేల కూడా చిరుజల్లులోని తేమ గ్రహించవచ్చు కాలచక్రం క్రిందుమీదవుతుంటుంది, అదృష్టం చంచలమైనది కష్టాన్నుండి సుఖానికీ, మంచిరోజులనుండి గడ్డురోజులకీ మారుతుంది. . అదృష్టసాగరం నిరంతరం ప్రవహించదు అణగారినవారిని అది ఒకోసారి అనుగ్రహిస్తుంటుంది దాని ఆటుపోటులు సమాన అంతరంలో కొనసాగుతాయి ముతక, సన్నని కలనేతల నేతపని దానిది. చివరిదాకా కొనసాగిన ఏ గొప్ప సుఖమూ లేదు, గతిమారని అలవిమాలిన కష్టమూ లేదు.…

  • అక్టోబర్ 6, 2013

    చాడీలు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    వాళ్ళు నీ మీద నేరాలు చెప్పడానికి వచ్చేరు ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయేరు. చెప్పడం పూర్తయేక గట్టిగా ఫక్కున నవ్వేను అవన్నీ నాకు ఇంతకుముందే తెలుసు. ఓహ్! వాళ్లు ఎదురుగుండా కనిపిస్తున్నా చూడలేని గుడ్డివాళ్ళు ఆ నీ తప్పులే  నిన్నింకా గాఢంగా ప్రేమించేలా చేసేయి.   . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి సారా టీజ్డేల్ అపురూపమైన కవయిత్రి.  ఆమె  ఎంత సరళంగా రాస్తుందో, అందులో…

  • అక్టోబర్ 5, 2013

    ఒక రైతు మరణం … రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, వెల్ష్ కవి

    డేవీస్ నీకు గుర్తున్నాడా? పాపం, పోయాడు, తెలుసా? వెల్ష్ కొండల్లో, పేదరైతు రాళ్లుతేరిన తనపొలంలోనే చచ్చిపోయినట్టు జీవితం మీద ఆశలు వదిలేసుకుని. నాకు ఇంకా గుర్తే … పెంకులచూరుకింద అతని గదీ, అతను పడుక్కునే విశాలమైన పక్కా దానిమీద వెలిసిపోయిన దుప్పటీను… ఒంటరిగా, మార్చినెల మధ్య ఎండల్లో ఈనలేక బాధపడుతున్న ఆడగొర్రెలా ; అంతే కాదు, ఇంట్లో చిక్కుకున్న వడిగాలి తెరలన్నిటినీ చించుకుని బయటకి పోవడమూ, ఎండ నేలమీద విన్యాసాలు చెయ్యడమూ గుర్తే. చుట్టుపక్కలవాళ్ళు గట్టిగా అడుగులేసి నడుస్తుంటే అతని…

  • అక్టోబర్ 4, 2013

    నిష్క్రమణ … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను

    నే నే తోవ తీసుకున్నా నాకు లెక్కలేదు, అదెక్కడికి వెళుతుందో అంతకన్నా పట్టింపులేదు ఈ ఇంట్లోంచి బయటపడాలి, నా గుండెపగిలేలోపు నేను వెళ్ళిపోవాలి, ఎక్కడికో అక్కడికి. నా గుండెలో ఏముందో నాకు తెలీదు నా మనసులో ఏమున్నదీ నాకు తెలీదు కానీ నాకు ఇక్కడనుండి లేచి వెళిపోవాలనుంది నా కాళ్ళు ఎక్కడికి తీసుకెళతాయో నాకు లెక్కలేదు. నేనొక పగలూ రాత్రీ నడవగలిగి సూర్యోదయం వేళకి ఒక నిర్జనప్రదేశంలో కనుచూపుమేర రోడ్డన్నది లేకుండా ఒక కొంపగాని, మనిషన్న ఊసుగానిలేకుంటే…

  • అక్టోబర్ 3, 2013

    తొలిపలుకు .. హొరేస్ హోలీ, అమెరికను కవి

    ఆహ్!  నేనొక నిపుణుడైన పనివాడి కత్తికింది ఒదిగే మెత్తని ఓక్ చెట్టు మానునో, రహస్యచిత్రలిపిలో లోతుగా చెక్కబడిన చెదరని ఏకశిలనో అయితే బాగుణ్ణు. అప్పుడు అక్షరం అక్షరం నెమ్మదిగా చదువుకుంటూ    ప్రజలు జీవితకాలం ఆనందంగా ఉండగలుగుతారు.   ఎందుకంటే నేనొక చోద్యానికి ప్రత్యక్ష సాక్షిని ఆ ఆశ్చర్యంలో ప్రవక్తల నోట వచ్చే భవిష్యవాణిలా నాది కాని ఒక ఉద్వేగమైన భాష వెలువడుతోంది అది చాలా కొత్తగానూ, చిత్రంగానూ ఉందని చెప్పక తప్పదు. అది ఈ మృత్తికతో…

  • అక్టోబర్ 2, 2013

    బిచ్చగాడి మరణశయ్య … కేరొలీన్ (బౌల్స్) సదే , ఇంగ్లీషు కవయిత్రి.

    నెమ్మదిగా అడుగులు వెయ్యండి— తల దించుకొండి గౌరవపూర్వకంగా మౌనంగా తల వాల్చండి ఎక్కడా మృత్యుఘంట మ్రోగదు అయినప్పటికీ, ఒక అనంతాత్మ దేహాన్ని విడిచి పోతోందిప్పుడు.   ఓ పరదేశీ, నువ్వెంత గొప్పవాడివయినా, గౌరవసూచకంగా శిరసు వంచుకో; అదిగో ఆ పేద గుడిశలో— నామమాత్రమైన పక్కమీద… నీకంటే గొప్పవాడు పడుక్కుని ఉన్నాడు.   ఆ బిచ్చగాడి  పూరిపాక కింద చూడు! మృత్యువు దాని అధికారం ప్రదర్శిస్తోంది: లోపలికి వెళ్ళు… జనాలెవరూ లేరులే ఫర్వాలేదు ప్రవేశించు— కాపలాదారులడ్డుకోరులే ఈ భవన…

  • అక్టోబర్ 1, 2013

    ఒక సాయంత్రం… రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, వెల్ష్ కవి.

    కాలాన్ని తన అమ్ముగా చేసుకున్న విలుకాడి వింటి నారి కొంపదీసి తెగిపోయిందేమిటి చెప్మా, ఆ హరివిల్లు మా ఊరిపై అంత నిలకడగా ఉంది?   అలా అయితే, మనకి గాయమయే లోగా మనం దాన్ని మౌనంగా వీక్షిద్దాం ఈ రమణీయమైన నిశ్శబ్దంలో క్షణకాలమైనా అనంత ప్రేమలో ఓలలాడుదాం. .     రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, (29 March 1913 – 25 September 2000) వెల్ష్ కవి.   కవిత్వం పెల్లుబకడానికి ఒక చిన్న ఆలంబన…

  • సెప్టెంబర్ 30, 2013

    పక్షులు …విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి

    అతడు:   నువ్వెక్కడ ఉంటున్నావు?  నీదే తోట? సొగసైన దానా! ప్రియతమా! ఏ సీమకైనా అందాన్నిచ్చేదానా!  నీ సుందరమైన గూడు ఎక్కడ కట్టుకున్నావు?            ఆమె: అదుగో అక్కడ దూరంగా ఒంటరిచెట్టుందే, అక్కడ నేనుంటున్నాను నీ కోసం జపిస్తూ; పగళ్లు నా కన్నీరు త్రాగితే రాత్రుళ్ళు నా వేదన గాలి మోసుకెళుతుంది.      అతడు: ఓ వసంత మాధురీ! నేను నీకోసమే బ్రతుకుతూ శోకిస్తున్నాను ప్రతి రోజూ తోట నా దుఃఖాన్ని నినదిస్తే…

  • సెప్టెంబర్ 29, 2013

    రెండు దేహాలు … ఆక్టేవియో పాజ్, మెక్సికన్ కవి

    రెండు ఎదురెదురు దేహాలు ఒక్కోసారి ఎగసిపడేకెరటాలు రాత్రి ఒక మహాసాగరం   రెండు ఎదురెదురు దేహాలు అపుడపుడు రెండు పెద్ద బండరాళ్లు రాత్రి ఒక విశాలమైన ఎడారి   రెండు ఎదురెదురు దేహాలు ఒక్కొసారి రెండు రాత్రిలోకి చొచ్చుకుపోయిన రెండు పిల్లవేర్లు       రెండు ఎదురెదురు దేహాలు అపుడపుడు రెండు కత్తులు రాత్రి పూట నిప్పురవ్వలు రాలుస్తాయి   రెండు ఎదురెదురు దేహాలు శూన్యాకాశం నుండి నేలకు రాలిపడే రెండు ఉల్కలు. . ఆక్టేవియో పాజ్ …

←మునుపటి పుట
1 … 171 172 173 174 175 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు