ఒక సాయంత్రం… రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, వెల్ష్ కవి.

కాలాన్ని తన అమ్ముగా చేసుకున్న

విలుకాడి వింటి నారి కొంపదీసి

తెగిపోయిందేమిటి చెప్మా, ఆ హరివిల్లు

మా ఊరిపై అంత నిలకడగా ఉంది?

 

అలా అయితే, మనకి గాయమయే లోగా

మనం దాన్ని మౌనంగా వీక్షిద్దాం

ఈ రమణీయమైన నిశ్శబ్దంలో

క్షణకాలమైనా అనంత ప్రేమలో ఓలలాడుదాం.

.

 

 

రొనాల్డ్ స్టూవర్ట్ థామస్,

(29 March 1913 – 25 September 2000)

వెల్ష్ కవి.

 

కవిత్వం పెల్లుబకడానికి ఒక చిన్న ఆలంబన చాలు… అది ఒక సంఘటన కావచ్చు, పైన చెప్పిన ఒక క్షణకాలపు అనుభూతి కావచ్చు. అయితే, కవి, ఆ అనుభూతిని పదిలంగా నమోదుచెయ్యగలగడమే కవిత్వం. ఇక్కడ ఒక ఇంద్రధనుస్సును ప్రాతిపదికగా తీసుకుని ఎంత సుందరమైన ఊహ అల్లుతున్నాడో కవి చూడండి:  తమ ఊరుమీద ఇంద్రధనుస్సు విరిసింది.  సాధారణంగా అది కొద్దిసేపట్లోనే కరిగిపోతుంది. కానీ, ఇక్కడ అలా కరగలేదు. మనసు దోచుకుంటున్నాది.  కాలాన్ని అమ్ములపొదిగా చేసుకోగల మహానుభావుడు ఎవరు? ఆ వేటగాడు జీవులపై బాణ గురిపెడితే గాయపడక తప్పదు.  అది మామూలు గాయమా? మృత్యువే. అయితే, మరణించేలోగా, ఈ సౌందర్యం మనలో రేకెత్తించే క్షణమాత్ర ప్రేమానుభూతి, అనుభవించెద్దాం అంటున్నాడు కవి గడుసుగా.

సౌందర్యం మనలో ప్రేమ కలిగించడమేమిటి? అని అనుకోవచ్చు. సౌందర్యం అన్నివేళలా మదనవికారాన్నే కలిగించనక్కరలేదు. ఒక ఆశ్చర్యం, ఒక విభ్రమం, ఒక ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన వాక్యసముదాయం ఏదైనా కలిగించవచ్చు. కేవలం ఊహే అయినప్పటికీ, బహుశా అటువంటి స్థితికి లోనయ్యేడేమో కాళిదాసు (సినిమాలో చూపించినట్టు) “మాణిక్య వీణాం…” అన్న శ్లోకం చదివే సందర్భంలో. 

 

సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు. సౌందర్యాన్ని గుర్తించి, దానికి శిరసువంచి నమస్కరించి, ఆనందించగల సంస్కారం అలవరచుకుంటే తప్ప వచ్చేది కాదు.  అదే రసికత. రసికత అంటే Sensual Pleasure కాదు. దురదృష్టవశాత్తూ దానికి ఆ అర్థం రూఢి అయిపోయింది గాని.   

 

సారసముఖి సకలభాగ్యదే, శ్రీ చాముండేశ్వరి, సారసముఖి సకలభాగ్యదే…  అన్న ఒక అపురూపమైన కీర్తన (ఈ వాగ్గేయకారుడిపేరు సమయానికి గుర్తులేదు.)

రెండో చరణంలో “హసిత వదనే, ఆర్ద్ర హృదయె, హరికేశపుర నిలయే, ‘రసికజన సమాజరుచిరె’ రాజేశ్వరి రక్షమాం” అని ప్రార్థిస్తాడు కవి.  ఇక్కడ భక్తిభావాన్ని ప్రక్కనబెట్టి చూసినా,  స్త్రీత్వాన్ని ఎలా మన్నించాలో ఆ సంస్కారానికి ఇది ఒక ఉదాహరణగా నాకు కనిపిస్తుంది.

అందుకే సత్యం, శివం, సుందరంలలో ఈ మూడుగుణవిశేషాలుకలసిన ప్రకృతి మనల్ని అంతగా ముగ్ధుల్ని చేస్తుంది. 

 

.
The archer with time
as his arrow— has he broken
his strings that the rainbow
is so quiet over our village?

Let us stand, then, in the interval
of our wounding, till the silence
turn golden and love is
a moment eternally overflowing.
.
Ronald Stuart Thomas
(29 March 1913 – 25 September 2000)
Welsh Poet

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: