కాలమొక ఒడిదుడుకుల ప్రవాహం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి

కొమ్మలు నరికినచెట్టు మళ్ళీ పెరగవచ్చు,

మోడులైన మొక్కలు తిరిగి పుష్పించి ఫలించవచ్చు;


దౌర్భాగ్యుడికి కష్టాలు తొలగిపోవచ్చు,


ఎండి బీడైననేల కూడా చిరుజల్లులోని తేమ గ్రహించవచ్చు


కాలచక్రం క్రిందుమీదవుతుంటుంది, అదృష్టం చంచలమైనది


కష్టాన్నుండి సుఖానికీ, మంచిరోజులనుండి గడ్డురోజులకీ మారుతుంది.


.

అదృష్టసాగరం నిరంతరం ప్రవహించదు

అణగారినవారిని అది ఒకోసారి అనుగ్రహిస్తుంటుంది

దాని ఆటుపోటులు సమాన అంతరంలో కొనసాగుతాయి


ముతక, సన్నని కలనేతల నేతపని దానిది.


చివరిదాకా కొనసాగిన ఏ గొప్ప సుఖమూ లేదు,


గతిమారని అలవిమాలిన కష్టమూ లేదు.

.

నిత్యమూ శిశిరము కాదు, నిత్యవసంతమూ ఉండదు,

అంతం లేని కాళరాత్రీ ఉండదు, పొద్దుపోని రోజూ ఉండదు,


విషాదములో మునిగిన పక్షులకుకూడా, తియ్యగా పాడే ఋతువు వస్తుంది


ఎంతపెద్ద తుఫానునైనా మరపించే ప్రశాంతత వెన్నంటి వస్తుంది.


అలా భగవంతుడు కష్టసుఖాలు పెనవేసి మనిషిని రాటుదేరుస్తాడు


మనిషికి ఎప్పుడూ లేవగల ఆశనిస్తూ, పడిపోతామేమోనన్న భయాన్నిస్తాడు.   

.


దురదృష్టంతో పోగొట్టుకున్నది అదృష్టం తిరిగి సంపాదించిపెట్టవచ్చు,


బలహీనమైన వలకూడా చిన్నచిన్న చేపలని పట్టుకోవచ్చు;


అందరికీ అందనిదేదో ఒకటుంటుంది, ఏదీ అందనివాళ్ళెవరూ ఉండరు;


కొందరికి అవసరమైనవన్నీ దక్కుతాయి, కాని ఎవరికీ అడిగినవన్నీదొరకవు;


ఏ ఒక్క మనిషికీ అకళంకమైన ఆనందం దొరకమన్నా దొరకదు,


మితంగా కోరు, కొన్ని దక్కుతాయి; అదుపులేదూ, ఎప్పుడూ ఏదీ దొరకదు.


.

రాబర్ట్ సౌత్ వెల్,


1561 – 21 February 1595

ఇంగ్లీషు కవి, కేథలిక్ ప్రీస్టు.  

ఈ కవిత సుమారు 500 సంవత్సరాల క్రిందటిది అంటే  మనలో చాలా మంది నమ్మకపోవచ్చు.  కాలం గురించి ఇంత అవగాహన ఉందా అప్పటి ఇంగ్లీషు కవులకి అని. ఎందుకంటే, ఎలిజబెత్ మహారాణి కాలం నాటికి ఇంకా గ్రీకూ లాటినే రాజభాషగా గౌరవాన్ని అందుకోవడంతో పాటు, ఇంగ్లీషు అప్పుడప్పుడే తనకాళ్ళమీద నిలబడడనికి ప్రయత్నిస్తున్న రోజులు.  పునరుద్ధరణ (Renaissance)  పుణ్యమా అని, గ్రీకు లాటిను, ఇటాలియన్ భాషల సాహిత్య వాసనలు సంపుటీకరించుకుని, ఇంగ్లీషుకి ఒక గుర్తింపు తీసుకు వచ్చిన మహామహులు చాలా మంది పుట్టారు 16వ శతాబ్దంలో.

 

కాలమహిమ గురించి సౌందరనందం కావ్యంలో పింగళి కాటూరి కవులు చాలా హృద్యంగా చెప్పారు:

“కాలవశమ్మునన్ విసరుగాడ్పులకున్ ముదురాకుపుట్టముల్

రాలగ, బాటసారుల పరామరిసింపగ లేక సంపదల్

దూలిన దాతవోలె జిగిదూలిన ఆ యెలమావి గున్న యా

కాలవశమ్ము చేతనె సఖా! వికసించెడి సౌరు గంటివే…  “

అంటారు.  ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అన్నది కాలమహిమ. కాలం ఎంత భీతావహమో అంతఆశావహము కూడా. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకుంటే, మనకి మనమున్న స్థితికి  మన శక్తి యుక్తులు కారణం కావన్న నిజం అర్థం అయి, విర్రవీగకుండా, వినయంగా ఉండగలుగుతాము.


.

Times Go By Turns

.

The lopped tree in time may grow again,
Most naked plants renew both fruit and flower;
The sorriest wight may find release of pain,
The driest soil suck in some moistening shower.
Times go by turns, and chances change by course,
From foul to fair, from better hap to worse.

The sea of Fortune doth not ever flow,
She draws her favours to the lowest ebb.
Her tides hath equal times to come and go,
Her loom doth weave the fine and coarsest web.
No joy so great but runneth to an end,
No hap so hard but may in fine amend.

Not always fall of leaf, nor ever spring,
No endless night, yet not eternal day;
The saddest birds a season find to sing,
The roughest storm a calm may soon allay.
Thus, with succeeding turns, God tempereth all,
That man may hope to rise, yet fear to fall.

A chance may win that by mischance was lost;
The net, that holds no great, takes little fish;
In some things all, in all things none are crossed;
Few all they need, but none have all they wish.
Unmeddled joys here to no man befall;
Who least, hath some; who most, hath never all.

.

Robert Southwell 

c. 1561 – 21 February 1595

England

“కాలమొక ఒడిదుడుకుల ప్రవాహం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి” కి 2 స్పందనలు

    1. Thank you Karimulla garu.
      with best regards

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: