అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 12, 2014

    కవితతో స్వగతం… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి

    ఓ నా కవితా! ఫర్వాలేదు వెళ్ళు! భయపడకు, అంతటి అందం ముందు పురుషులు భయపడినట్టు; నిన్ను ఆమె తీక్షణంగా చూడదు, నీనుంచి దృష్టికూడా మరల్చదు. ఆమె జ్ఞాపకాల్లో నువ్వు పదిలంగా నిలిచేలా నేను కొన్ని సొగసులు నీకు అద్దుతాను, చిన్న చిన్న లోపాలుకూడా కలగలుపుతాను ఆమె నిన్ను సంతోషంగా క్షమించేసేలా… . వాల్టర్ సేవేజ్ లాండర్ (30 January 1775 – 17 September 1864) ఇంగ్లీషు కవి . Image Courtesy: Poetry Foundation http://www.poetryfoundation.org/bio/walter-savage-landor…

  • జూన్ 11, 2014

    Nothing New… Nanda Kishore, Telugu, Indian

      1   It is not possible for her. And, it is beyond me. There is no gain blaming each other.   2   Nobody would admit us. Secure are her people’s houses with doors and windows shut, Mine is an open sky where sun visits at will.   3   It is just the…

  • జూన్ 10, 2014

    The Chemistry of Tears … Kopparthy, Telugu, Indian

    Yes! Tears are nobler than blood. The saying that “Blood is thicker the water’ Maybe true But, is certainly not thicker than tears.   When a needle pricks, or a blade cuts Blood oozes out; Blood spills out; For the swish of a knife It founts like an earthly spring; To witness blood One has…

  • జూన్ 9, 2014

    A poem about a poem… Si. Ra. Telugu, Indian

    . Let me tell you! These words are not so great. Even if you don’t read this poem, you aren’t at loss. It’s just a passel of words strewn carelessly…. and, An inchoate song taking shape By a chancy chancy alignment.   You ask me for its meaning? Well, what meaning can you find behind…

  • జూన్ 8, 2014

    పద చిత్రం… కార్ల్ సాండ్ బర్గ్, అమెరికను కవి

    ఓడల నీడలు లేత నీలిరంగు జిలుగుతో తీరుబాటుగా కదలి వస్తున్న మెత్తని కెరటాల శీర్షాలపై ముందుకీ వెనక్కీ ఊగుతున్నై. దిగంతాల అంచున పొడవుగా వంగిన ఆకాశపు  కపిలవర్ణం ఉప్పునీటిలో ఇసుకను కలుపుతున్నట్టుంది. సాగరదేహం మీద అంతులేని స్పష్టమైన అలల ముడుతలు ముందుకు వచ్చీ,  ముగిసిపోయీ, వెనక్కిపోతూ ఉన్నాయి. చిన్ని అలలు భగ్బమై, పేలిపోతున్న బుడగలు సాగరతీరన్ని అలుకుతున్నాయి. ఓడల నీడలు లేత నీలిరంగు జిగిగల కెరటాల శీర్షాలపై ముందుకీ వెనక్కీ ఊగుతున్నై. . కార్ల్ సాండ్ బర్గ్…

  • జూన్ 7, 2014

    మూడు బొంతకాకులు … అజ్ఞాత కవి , 17 వ శతాబ్దం

    మూడు బొంతకాకులు చెట్టుమీద కూచున్నాయి, అవి ఎంతనల్లగా ఉండగలవో అంత నల్లగా ఉన్నాయి. అందులో ఒకటి  మిగతావాటితో అంది: “మనం ఊదయాన్నే ఫలహారం ఎక్కడ చెయ్యడం?” అని “అదిగో! దూరాన పచ్చనిపొలాల్లో ఒక వీరుడు చనిపోయి తన డాలుక్రింద పడి ఉన్నాడు.” “లాభం లేదు. అతని వేట కుక్కలు పాదాల చెంత ఉన్నాయి. అవి తమ యజమానిని జాగ్రత్తగా కాపాడతాయి.” అతని పెంపుడు డేగలు ఆకాశంలో పహారా కాస్తున్నాయి అతని దగ్గరకి ఏ పక్షీ రానియ్యవు. కొంతసేపటికి…

  • జూన్ 6, 2014

    బిల్లు కలెక్టరు… (ఫాదర్) జాన్ బి టాబ్, అమెరికను

    “ఎవరు మీరు?” ఒక నల్ల కలువ…తుమ్మెదని అడిగింది మంచుబిందు సులోచనాల్లోంచి దాని భీకరమైన ఆకారం చూసి ఆశ్చర్యపోతూ .   “నేనా అమ్మా, నేను ప్రజా సేవకుణ్ణి తేనె, మైనం పన్ను వసూలు చేసే బిల్లు కలెక్టర్ని. నాకివ్వడానికి మీదగ్గర ఏమీ లేదా?” బదులిచ్చేడు గండుతుమ్మెద. . (ఫాదర్) జాన్ బి టాబ్ (March 22, 1845 – November 19, 1909) అమెరికను కవి. . Image courtesy: http://catholiclane.com/john-b-tabb-americas-forgotten-priest-poet/ . The Tax-Gatherer  .…

  • జూన్ 5, 2014

    కొత్త సిపాయిలు… అజ్ఞాత కవి, రుథేనియన్

    కొండవాలులో మంఛుపేరుకుని ఉంది, కాని తర్వాత కరిగి వాగులై ప్రవహిస్తుంది. రోడ్డుపక్కన పాపీలు విరగవూసాయి… అవి పాపీలేనా? కాదు, అవి ఎర్రగా మెరుస్తున్నాయి గాని, ఓహ్, అవి పువ్వులు కవు, సైన్యంలోకి కొత్తగా చేరిన సిపాయిలు! వాళ్ళు కొత్తగా చేరిన యువ సిపాయిలు! వాళ్ళు క్రిం (Krym) దాకా ఒకరివెనక ఒకరు స్వారీచేస్తూ వెళ్తారు, ఆ విశాలమైన పల్లెసీమలో గుర్రపు డెక్కల చప్పుడు ప్రతిధ్వనిస్తుంది. ఇంతలో ఒక తల్లి పిలుపు వినిపిస్తుంది: ఒరేయ్ శ్రద్ధమాలినవాడా! వెనక్కి రా…

  • జూన్ 4, 2014

    There is Nothing Much To Say…. Nanda Kishore, Telugu, Indian

      1 Now there are only two tenses… The times when I loved her, and the times when I can’t help loving her.   2 It never occurred to me how time would pass without her; All these days, amidst enveloping despair, I could understand I was better off because of her, But strange, I…

  • జూన్ 3, 2014

    జీవిత సంగ్రహం … జిస్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి

    నువ్విప్పుడు ఏంచెయ్యాలి? ఒక దరఖాస్తు నింపి దానికి నీ జీవిత సంగ్రహాన్ని జతపరచాలి, నీ జీవితం ఎంత దీర్ఘమైనది అన్న నిమిత్తం లేకుండా నీ జీవిత సంగ్రహం చాలా సంక్షిప్తంగా ఉండాలి. కనుక క్లుప్తత పాటించి, వాస్తవాలనే ఎంచుకో. దృశ్యాలని  చిరునామాలుగా మార్చు, లీలగా ఉన్న జ్ఞాపకాలని తారీకులుగా మార్చు, పెళ్ళి చేసుకున్నవారినే ఉటంకించు, పిల్లలలోకూడ పుట్టిన వాళ్లనే చూపించు. నీ కెవరు తెలుసునన్నదానికంటే నిన్నెవరికి తెలుసో చాలా ముఖ్యం. ప్రయాణాలు…. విదేశప్రయాణాలయితేనే, అనుబంధాలు— దేనితోనో చెప్పు, ఎందుకో…

←మునుపటి పుట
1 … 147 148 149 150 151 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు