1
It is not possible for her.
And, it is beyond me.
There is no gain blaming each other.
2
Nobody would admit us.
Secure are her people’s houses with doors and windows shut,
Mine is an open sky where sun visits at will.
3
It is just the same always.
Youth and life are not one and the same.
A visitor can’t remain forever; Even if it were she.
Visiting is something; staying behind is another.
4
However much I try, the wailing won’t cease.
On the eclipsed hands, even moon doesn’t shine
And the wound won’t heal where you gasp for breath.
5
Tell me! What can anybody do when people petrify in his presence?
When God himself hangs bat-like, who else could reassure ?
When somebody’s looks torture you, when the heart prays for a bod,
When someone’s words scissor you and the body seeks for a sacrifice
Where will you immolate? On what star shall you annihilate yourself?
.
Nandakishore,
Telugu,
Indian

.
అంతా తెలిసిందే-
1
ఆమెకి వీలుకాదు.
నాకు చేతగాదు.
ఒకర్నొకరం అనుకుంటే ఇద్దరికీ ఏం రాదు.
2
ఎవరూ మమ్మల్ని ఒప్పుకోరు.
కిటికీలు, తలుపులు వేసి ఉండే ఇళ్ళు వాళ్ళవి.
సూర్యుడువచ్చిపోయే ఆకాశం మాది.
3
ఎప్పుడైనా అంతే.
యవ్వనం జీవితం ఒకటి కాదు.
వచ్చిపోయేది ఉండిపోదు. తనకైనా అంతే.
వచ్చిపోవటం, ఉండిపోవటం వేరు వేరు.
4
ఎంత ప్రయత్నించినా ఏడుపాగదు.
గ్రహణం పట్టిన చేతులకి వెన్నెల అంటదు.
గాలి ఆడని ప్రదేశంలో గాయం మానదు.
5
నువ్వు చెప్పు. మనుషులు నీ ముందే రాళ్ళుగా మారితే ఏం చేస్తావు?
దేవుడే నీ ముందు నీ తలకిందులుగా వేళ్ళాడితే ఎవర్ని వేడుకుంటావు?
ఎవరి చూపన్నా హింసించినపుడు, హృదయం నిన్నొక దేహమడిగితే…
ఎవరి మాటన్నాకోసుకుపోయినపుడు, దేహం నిన్నొక త్యాగంకోరితే
ఎక్కడ కాలిపోతావు? ఏనక్షత్రంలో నిన్ను చీకటి చేసుకుంటావు?
Nanda Kishore
స్పందించండి