అనువాదలహరి

The Chemistry of Tears … Kopparthy, Telugu, Indian

Yes!

Tears are nobler than blood.

The saying that “Blood is thicker the water’

Maybe true

But, is certainly not thicker than tears.

 

When a needle pricks, or a blade cuts

Blood oozes out;

Blood spills out;

For the swish of a knife

It founts like an earthly spring;

To witness blood

One has to commission

A stone, a stick, a needle, a blade, a knife or a bullet.

Everybody’s blood being red

They once used to say that all are equal.

True. Blood has united us;

Brought us all under one umbrella.

 

The very blood circulates through all of us.

Beat anyone you would, the same blood flows out;

When the same blood comes out

Whether you prick an innocent

Or, slay a despot;

When the same blood spills out

Whether you slay a white, or a black

A moneyed or a have-not

A gentleman or a rogue…

It only attests that blood confers us our being

But how can it stand a testimony of our humanity?

 

There is what we call good blood and poor blood

But is there a nobleman’s blood and a common man’s blood?

For that reason,

Tears are nobler than blood.

Tears are physical manifestation of

The humanity residing within;

Tears are the archetype of the six-foot primal man.

Do you know?

There are arcane lacrimal pools of tears in man.

There are perennial sprouts of riverine mouths in him.

One need not throw in a stone,

Nor need cross his sword.

All that it they need is a simple word

No matter it meant to soothe or singe,

In a trice, the tears swell up in the eye-cups

 

A small incident in the book you read is enough,

A scene on the screen you watch is enough,

A slice of life you witness through the window is enough,

Why, even a line of verse dunked in essence of life is enough

For the tears to whelm you on their own.

For that matter, you don’t need any of them,

Just an ethereal thought,

A small trembling disturbing thought is enough…

To churn out tears.

 

If the heart gets heavy

And you find a lump in your throat with grief

With tears streaming down… then you are a man.  

 

When the eyes rain,

Man becomes an overcast sky.

When the tears drain out,

Man becomes a farm of rich water resources.

Tears are the silvery white jewels

We mine out from our own selves.

 

Tears are not replenished like blood constantly within,

Nor, like blood, tears flow to every nook of capillary in the body.

Who can say that a man should possess this much,

Or, has this much of tears in him?

A physical act is enough for blood to spill.

But, for tears to swell,

The chemical reaction should take place.

 

The blood that has united people

Had divided itself into cells and corpuscles;

Paled out as positive and negative.

But tears remained ever pure and clear… like rain water.

 

 

Blood … is a symbol of catastrophe of war

Tears … are monuments of war’s devastation.

Blood… freezes in war… but,

Tears continue to swell in memories.

 

Heart maybe floating in blood,

But it is the tears that establish its existence.

 

Just as there is ‘anaemia’

There can be ‘grieve-less’ness.

But, just as one can transfuse blood

Can anyone transfuse tears?

.

(From :  Recent Anthology “Rain of 50 years” )

Kopparthy

9.1.1959

Telugu

Indian.

.

Kopparthy Venkata Ramana Murthy
Kopparthy Venkata Ramana Murthy

 

Sri Kopparthy is presently working as  Principal, Govt. Degree College Eluru, WG Dt. AP.

He has to his credit 3 Collections of Poetry and several awards.
he can be reached at :kopparthyvrm@gmail.com.

.

కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్

.

అవును

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

బ్లడ్ ఈజ్ థిక్కర్ దేన్ వాటర్

నిజమే కావచ్చు

బట్ నాట్ థిక్కర్ దేన్ టియర్స్

 

 

సూదిగుచ్చుకున్నప్పుడు, బ్లేడు కోసుకున్నప్పుడు

రక్తం ఉబుకుతుంది

రక్తం ఉరలుతుంది

కత్తివేటుకి ఉవ్వెత్తున ఎగసిపడుతుంది

రక్తం కళ్ళచూడాలంటే

రాయి, కర్ర, సూది, బ్లేడు కత్తి బుల్లెట్

ఏదో ఒకటి ప్రయోగింపబడాలి.

 

అందరి రక్తం ఎర్రగా ఉండడంతో

అందరూ ఒక్కటేనని ఒకప్పుడు చెప్పే వాళ్ళు

నిజమే. రక్తం మనందరినీ ఒకటిచేసింది

ఒకేగొడుగు కిందకు తెచ్చింది.

అందరిలోనూ ఒకే రక్తం ప్రవహిస్తోంది

ఎవర్ని కొట్టినా అదే రక్తం ప్రసరిస్తోంది

అమాయకుణ్ణి గుచ్చినా అదే రక్తం

నియంతను నరికినా అదే రక్తం

తెల్ల వాణ్ణి నల్ల వాణ్ణి

డబ్బులున్నవాణ్ణి లేని వాణ్ణి

మంచి వాణ్ణీ చెడ్డవాణ్ణి

ఎవర్ని ఎవర్ని నరికినా అదే రక్తం చిందుతున్నప్పుడు

మనిషికి రక్తం అస్తిత్వాన్ని ఇస్తున్నట్టు అవుతున్నదే కానీ

మనిషితనానికి చిరునామా అవుతున్నదా?

 

మంచి రక్తం చెడు రక్తం అంటూ ఉంటాయి గానీ

మహామనిషి రక్తం మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా

అందుకే

రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి

లోలోపలి మనిషితనానికి

బాహ్యరూపం కన్నీళ్ళు

ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్ళు

 

తెలుసా

మనిషిలో కన్నీళ్ళరహస్య తటాకాలున్నాయి

నదీములాల్లాంటి కన్నీటిచెలమలున్నాయి

ఒకరు రాయి విసరనక్కరలేదు

మరొకరు కత్తిదూయనక్కరలేదు

గాయపరచేదైనా అనునయించేదైనా

చిన్నమాట చాలు— కళ్ళ దోనెల్లోనీళ్ళుకదలాడుతాయి

చదువుతున్న పుస్తకంలో చిన్న సందర్భం చాలు, కన్నీళ్ళకి

చూస్తున్న తెరమీద ఒక్క సన్నివేసం చాలు, కన్నీళ్ళకి

కిటికీలోంచి కనిపించే ఒక జీవిత శకలం చాలు, కన్నీళ్ళకి

జీవితంలోంచి ముంచితీసిన కవిత్వ చరణం చాలు, కన్నీళ్ళకి.

నిజానికి ఇవికూడా అక్కరలేదు

ఒక్క ఊహ

వణికించి తొణికించే ఒక్క ఊహ చాలు, కన్నీళ్ళకి

 

గుండెబరువెక్కి

ఒక దుఃఖపు గుటక గొంతుపట్టేసి

కన్నీళ్ళు తొణికిసలాడేయా, నువ్వు మనిషివి

 

కళ్ళు వర్షించినపుడు

మనిషి నల్లమబ్బుల ఆకాశం

కళ్ళల్లోకి నీళ్ళుతోడుకున్నప్పుడు

మనిషి జలవనరులున్న సస్యక్షేత్రం

మనలోంచి మనం తవ్వుకునే

తెల్లటి మణులు కన్నీళ్ళు

రక్తంలా కన్నీళ్ళు అనిక్షణం తయారుకావు

రక్తంలా కన్నీళ్ళు అణువణువూ ప్రవహించవు

మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ, ఉండాలనీ ఎవరుచెప్పగలరు

రక్తంచిందడానికి భౌతికచర్య సరిపోతుంది

కళ్ళుచిప్పిల్లాలంటే

రసాయనిక చర్య జరగాల్సిందే

మనుషులందరినీ ఒకటిగాకలిపిన రక్తం

కణసముదాయాలుగా విడిపోయింది

పోజిటివ్ నెగెటివ్ గా పాలిపోయింది

కన్నీళ్ళుమాత్రం వర్షం నీళ్ళలా స్వచ్ఛంగా ఉండిపోయాయి

యుద్ధ బీభత్సప్రతీక— రక్తం

యుద్ధవిధ్వంస స్మృతి … కన్నీళ్ళు

యుద్ధంలో రక్తం గడ్డకట్టుకుపోతుంది

స్మృతుల్లో కన్నీళ్ళు స్రవిస్తూనే ఉంటాయి

హృదయం రక్తంలో తేలుతూ ఉంటుంది కానీ

దాని ఉనికిని చాటేది కన్నీళ్ళే

 

 

రక్తహీనత ఉన్నట్టే

దుఃఖలేమికూడా ఉంటుంది

రక్తాన్ని ఎక్కించగలరు గానీ

కన్నీళ్ళనెవరైనా ఎక్కించగలరా

.

(50 ఏళ్ళ వాన… కవితా సంకలనం నుండి)

కొప్పర్తి

9.1.1959

తెలుగు

భారతీయ కవి

 

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: