-
షేక్స్పియర్… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
(ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరము) ఇతరులు మా ప్రశ్నలకి బందీలైపోతారు. నువ్వు స్వతంత్రుడివి. జ్ఞానశిఖరానివై, మేము పదే పదే ప్రశ్నలడుగుతున్నా నువ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉంటావు. నువ్వు తారకలకే నీ ఘనతని పరిచయం చేస్తావు. ధృఢంగా ఒక పాదాన్ని సముద్రంలో ఉంచి అత్యున్నత స్వర్గాన్ని నీ నివాసం చేసుకుని, నీ పాదాల చెంతనున్న మేఘవలయాలని మాబోటి మర్త్యుల నిరర్థకమైన వెతుకులాటకి వదిలెస్తావు. స్వయంగా నేర్చుకుని, స్వయంగా తరచిచూచి, స్వయంగా సాధించి, ఆత్మగౌరవం సంపాదించుకుని…
-
దేవతలతో గుసగుసలు… సామ్యూల్ లవర్, ఐరిష్ కవి
(ఐర్లండులో నిద్రలోనవ్వేపిల్లలు దేవదూతలతో గుసగుసలాడుతుంటారనే నమ్మకం ప్రచారంలో ఉంది. మనకి కూడా అలాంటి నమ్మకం ఉంది.) . ఓ బిడ్డ నిద్రపోతోంది; తల్లి మాత్రం శోకిస్తోంది; ఎందుకంటే ఆమె భర్త దూరంగా ఎక్కడో సముద్రం మీద ఉన్నాడు ఆ జాలరి ఇంటి చుట్టు పక్కల తుఫాను చూడబోతే తీవ్రరూపం దాలుస్తోంది. ఆమె రోదిస్తూ, “ప్రియా, డెర్మాట్, త్వరగా ఇల్లు ఏరుకో!” అని. ఆమె దేముడికి అనేక ప్రార్థనలు చేస్తుంటే బిడ్డ ఇంకా నిద్రపోతూనే ఉంది, తన కాళ్ళు…
-
ఉదయం… సముద్రపొడ్డున… ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్, ఇంగ్లీషు కవయిత్రి
(ఈ కవితలో సూర్యుడు, గుర్రాలు అన్న అంశం గమనించండి. ఆమెకు భారతీయ ఇతిహాస విషయాలు కొంతవరకైనా తెలుసునని అనిపిస్తుంది. ఈ కవిత కళ్ళకు కట్టినట్టు చిత్రించిన అపురూపమైన భావ చిత్రం.) నీ కళ్ళమీద ఈ రెండు ముద్దులతో వాటి మీద పేరుకున్న నిద్రని కరిగిస్తాను. లే ! ప్రియతమా, చూడు అప్పుడే సూర్యుడు తన బంగారు హస్తాన్ని తెల్లని ఆ సముద్రపు మేనిపై జాచి నిమురుతూ నవనవోన్మేషమైన తరగలమీంచి అద్భుతంగా పైకి లేస్తూ, విశాలంగా పరుచుకున్న సైకత తలాన్ని…
-
మరణానంతరం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఇపుడు నా పెదాలు సజీవంగా ఉన్నప్పటికీ అవి చెప్పవలసిన మాటలు చెప్పకూడదు నేను మరణించిన పిదప నా ఆత్మకు నేనేం చెప్పాలనుకున్నానో గుర్తుంటుందా? ఒక వేళ దానికి గుర్తున్నా, ప్రియతమా, వాటిని నువ్వు గణించవు; ఎందుకంటే, ఇప్పుడు అవి చెప్పకూడదు అప్పుడు నువ్వు వాటిని వినలేవు. . సారా టీజ్డేల్ August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . After Death Now while my lips are living …
-
సాయంవేళ … జార్జ్ హీమ్, జర్మను కవి
కెంపులా మెరిసిన రోజు … ఊదారంగు వన్నెల్లోకి మునిగిపోయింది అద్భుతమైన తళతళలతో ఏరు స్వచ్ఛంగా పారుతోంది అలలమీద జోరుగా పోతున్న పడవ తెరచాప… ఊగిసలాడుతోంది మెరుస్తున్న నీటిమీద సరంగు నీడ నల్లగా కనిపిస్తోంది. ప్రతి ద్వీపం మీదా శరత్కాలపుటడవులు రోదసి తన రెక్కలు బారజాపినంత మేరా తమ కుందనపు తలలు తాటిస్తున్నాయి. చీకటి కనుమల్లోంచి మంద్రంగా ఆకుల గుసగుసలు తేలివస్తున్నాయి గిరిసీమలనుండి సన్నగా వినవచ్చే తంత్రీ వాదనంలా అశ్రద్ధగా పట్టుకున్న చేతులనుండి చిక్కని మద్యం ఒలికిపోయినట్లు, తూరుపు ఇప్పుడు పెల్లుబికిన…
-
నీరవము… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
ఎక్కడా చప్పుడు పుట్టని చోట నిశ్శబ్దం ఉండిఉండొచ్చు చల్లని సమాధుల్లోనూ, సముద్రపు లో లోతుల్లోనూ ఏ శబ్దమూ వినిపించని చోట నిశ్శబ్దం ఉండొచ్చు, మూగబోయి, ఇంకా దీర్ఘనిద్రలో ఉన్న ఏ ప్రాణి కనరాని విశాలమైన ఎడారుల్లోనూ ఉండొచ్చు; కానీ ఏ గొంతుకా మూగపోలేదు, ఏ ప్రాణీ నిశ్శబ్దంగా చరించలేదు సోమరిగా ఈ నేల మీద తిరిగి, ఎన్నడూ మాటాడక నాచుపేరుకున్న శిధిలాల్లోనూ, పాడైన భవనాల్లోనూ ఒకప్పుడు మనిషి వసించిన పురాతన భవంతుల్లోనూ తిరిగే మేఘాలూ, మేఘాల్లా స్వేచ్ఛగా…
-
రెప్పపాటులో మాయమయే పగటి క్షణాలని మందలించొద్దు, అలాగే సహనాన్ని పోగొట్టే ఆలోచనలతో ఆత్మహత్యకు పాల్పడవద్దు, కాలం బరువుగా కదులుతోందని అనుకోవద్దు; ఈ నెమ్మది ఒక వరం; మనకి త్వరలోనే తెలుస్తుంది మనకి భవిషత్తు తెలుసుకుందికి ఎంత ఆరాటమున్నా నిజానికి అది తెలుసుకుందికి భయపడతామని. మార్మికమైన ఈ అజ్ఞానం మనల్ని భవిష్యత్తు తెలుసుకోలేకుండా శాసిస్తుంది, మనకోసం విధి అనుసరించే ధర్మసూత్రాల్ని ముందుకు జరపడానికి ప్రయత్నించదు; భవిష్యత్తును అపేక్షిస్తూ నువ్వుపడే ఆరాటాన్ని కాసేపు నిలువరించుకో. ఒక్కటి గుర్తించుకో: కాలం కడకు…
-
When Stomach Burns with Hunger.. Kasi Raju, Telugu, Indian
Father! Even when everything was exhausted in the house You never let us feel the want for anything Somehow you would arrange with a word or call; Mother would prepare us meal even by mooching. I come to know that There won’t be any want In lives that knew how to repay When mother serves me…
-
Another Performance… D. Vijaya Bhaskar, Telugu, Indian
I know You are too smart. As an initiation to death You ordained half of life should go in sleep; To prepare for tsunamis, You endowed billowing emotions; To stand disabling earthquakes, Taught strokes and rumblings to the heart; To ready for the Doomsday You instilled the five elements in me And set them to harmony. But…