రెప్పపాటులో మాయమయే
పగటి క్షణాలని మందలించొద్దు,
అలాగే సహనాన్ని పోగొట్టే ఆలోచనలతో
ఆత్మహత్యకు పాల్పడవద్దు,
కాలం బరువుగా కదులుతోందని అనుకోవద్దు;
ఈ నెమ్మది ఒక వరం;
మనకి త్వరలోనే తెలుస్తుంది
మనకి భవిషత్తు తెలుసుకుందికి ఎంత ఆరాటమున్నా
నిజానికి అది తెలుసుకుందికి భయపడతామని.

మార్మికమైన ఈ అజ్ఞానం
మనల్ని భవిష్యత్తు తెలుసుకోలేకుండా శాసిస్తుంది,
మనకోసం విధి అనుసరించే ధర్మసూత్రాల్ని
ముందుకు జరపడానికి ప్రయత్నించదు;
భవిష్యత్తును అపేక్షిస్తూ నువ్వుపడే
ఆరాటాన్ని కాసేపు నిలువరించుకో.
ఒక్కటి గుర్తించుకో: కాలం కడకు
నీ ఆశకి పట్టాభిషేకమైనా చేస్తుంది;
నీ భయాలని నిర్మూలించనైనా నిర్మూలిస్తుంది.
.
థామస్ స్టాన్లీ
(1625 – 12 ఏప్రిల్ 1678)
ఇంగ్లీషు రచయిత

 

 .

Expectation

 

Chide, chide no more away      

The fleeting daughters of the day,       

Nor with impatient thoughts outrun    

      The lazy sun,  

Nor think the hours do move too slow;                  

      Delay is kind, 

  And we too soon shall find     

That which we seek, yet fear to know.

 

  The mystic dark decrees

Unfold not of the Destinies,                

Nor boldly seek to antedate      

      The laws of Fate;      

Thy anxious search awhile forbear,    

      Suppress thy haste,   

  And know that Time at last               

Will crown thy hope, or fix thy fear.

.

Thomas Stanley

(1625 – 12 April 1678) 

The Book of Restoration Verse.  1910.

Ed:  William Stanley Braithwaite.

http://www.bartleby.com/332/19.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: