-
For A New Metaphor… Vadrevu Chinaveerabhadrudu
There’s Fall in the air. It’s time the viridity returns to the bark, to the stalk, and to the spirit lying deep Within the living cells. The melodies playing before eyes till now, retreat in endless cycles like winding on a spool. Winter comes to an end. A whirlwind of withered leaves. A pale anemic…
-
Accused Forever…. Neeraja Amaravadi, Telugu, Indian
That the death sentence Shall be abolished in all cases except Serious terrorist activities Heartened even a yet-to-be-born. Rider: There are exceptions And dealt with on case to case basis. If you are sure that foetus is a girl child Execution shall be forthwith. For the crime of giving birth to a girl A mother…
-
మహాత్ముడు… యూనిస్ టీట్యెన్స్ , అమెరికను కవయిత్రి
అతని గొప్పదనాన్ని నే నెన్నడూ తెలుసుకోలేకపోయాను. ఒక్కొసారి తను నా పక్కనే, అడుగులో అడుగు వేసుకుంటూ, నెమ్మదిగా ఎలా నడిచే వాడంటే చాలా సాదాసీదాగా, నా ఆలోచనల్లాగే రెక్కలురానట్టు. అప్పుడు నాతా బాతాఖానీ కొట్టేవాడు, తనకి నచ్చేది కూడా. గరుత్మంతుడంతకాదుగాని, తన వెడల్పు రెక్కలు ముడుచుకుని నాతో నడవడానికి ఇష్టపడేవాడు, అది అతను కావాలని కోరుకున్నదే. కానీ, నా మిత్రుడు చాలా సామాన్యుడిలాగే ఉండేవాడు. నేను మరిచేపోయాను. కాని ఒక్కసారి రోదసీ కుహరాల్లోంచి ఒక పెద్ద పిలుపు…
-
చిత్రం! … లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
శ్వాసించలేనివీ, వేటినీ చూడలేనివీ అలాంటి వాటికే ఎందుకు మరణం ఉండదో? ఒక పిసరంత నేలకీ, స్పందనలేని రాతికీ, ఒక ధూళి కణానికీ, కేవలం మట్టిపెల్లకీ శాశ్వతత్వం అనుగ్రహించబడింది. ఒక రైలుదారి పక్క గులకరాయికి మృతిలేదు… భగవంతుని అపురూపవరం లభించింది దానికి. మన పూర్వీకులు కోసిన గడ్డి ఇపుడు వాళ్ళ సమాధులపై మొలుస్తోంది. పారీ పారనట్టి అతి చిన్న వాగులు ఎప్పుడూ ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయి. ఇసకలా జడమై బలహీనమైనవాటిని చంపి ప్రాణంతీయగల మృత్యువు లేదు. మనిషొక్కడే…
-
The Prop… Indus Martin, Telugu, Indian
Ever since hutments cropped up around, Like a lone central column, The singular prop for our lives Has been that serrated sickle. To snap the umbilical cord That noosed around my neck In the hands of my granny What came handy was… that gory scalpel To prevent post parturition paralysis To the just yeaned dappled…
-
నేను మేఘాలని చూసేను… హెర్వీ వైట్, అమెరికను
నేను కొండల మధ్య మేఘాలని చూసేను కారు మొయిలు పింఛాలు జలధారలు కురిపిస్తూ… దిగువనున్న అడవుల నీలిమ లోయకే పరిమితమైపోయింది పక్వానికొచ్చిన పళ్ళ బరువుతో, గింజపట్టిన వెన్నులతో చెట్లు సంతృప్తిగా తడిసి ఆనందిస్తున్నాయి. నేను ఆ మైదానంలో సమాధులు చూశాను తొలితరం వాళ్ళు, నేలను పొదువుకుని అది చేసాగుకి లొంగేదాకా శ్రమించి శీతావాతాతపాల్ని ఎదిరించినవాళ్ళు; వాళ్ళ సంతానం, అదృష్టం కలిసివచ్చి ఇపుడు పెద్దలుకట్టిన భవంతుల్లో వసిస్తునారు నేను కొన్ని మరుగుపడ్డ పాటల్ని విన్నాను దారంట పోతూ…
-
నిర్వాణము… జాన్ హాల్ వీలాక్, అమెరికను కవి
నిదురపో… నేను ఎత్తైన స్వర్గ కవాటాలదగ్గర ఉన్నాను దిగువన మీ జాలీ కిటికీలపై మెరుస్తూ ఎదో గొణుగుతూ పరిభ్రమించే నక్షత్రాల మీద ప్రతి తారకా ఏదో కొంత గొప్పదనం ప్రతిబింబిస్తుంది అది నాకు తెలుసు. నేను నిన్ను ఎన్నడో మరిచిపోయాను; వెండిమువ్వలు చేసే చిరుసవ్వడి సంగీతంలా మాయమైపోయాను, సన్ననై, పలచబడి వినిపించని గీతంలా. నిదురపో… నేను ఎత్తైన స్వర్గ కవాటాలదగ్గర ఉన్నాను నిన్ను ఎంతో గాఢంగా ప్రేమించేను. . జాన్ హాల్ వీలాక్ September 9, 1886…
-
పవన వీణ … ఫ్రాన్సిస్ షా, అమెరికను కవయిత్రి
మా ఇల్లు చాలా ఎత్తుగా ఉంటుంది— అక్కడ పగలూ రాత్రీ పవనవీణ మోగుతూనే ఉంటుంది నగర దీపకాంతి మాత్రం దూరంగా… ఎక్కడో. మరి గాలి మోయించే వీణ ఎక్కడున్నట్టు? ఎత్తుగా ఎక్కడో రోదసిలోనా? లేక, సముద్రం మీదనా? అదిగో దూరాన ఉన్న నగరిలోని తిన్నని పొడవాటి వీధుల్లో సరళంగా ప్రసరించే వెలుగురేకలే దాని సంగీతపు స్వరతంత్రులు ఈ పవన వీణ చిరుగాలికి వినిపిస్తుంది: నగరపు కన్నీటి వెతలూ… సన్నగా మంద్రంగా, పసిపాపల ఏడుపులూ, రాజీపడలేని ఆత్మల మనోవేదనలూ…
-
జీవితం ముగిసిపోయినపుడు… ఇరోం షర్మిలా, మణిపురి కవయిత్రి
జీవితం ముగిసిపోయినపుడు ప్రాణహీనమైన నా శరీరాన్ని దయచేసి మీరు ఎత్తి తీసుకుపోయి ఫాదర్ కౌ బ్రూ పరున్న నేల మీద ఉంచండి. ఈ నిర్జీవ శరీరాన్ని మంటలలో బుగ్గిగా మార్చడం, మధ్యలో లేచినపుడు కర్రతో కొట్టడం, తలుచుకుంటే నాకు వెగటుపుడుతుంది పైనున్న తొక్క ఎలాగూ ఎండిపోతుంది దాన్ని నేలలోనే కుళ్ళనివ్వండి ఏ గనిలోనో ఖనిజంగా మారి భావితరాలకి ఉపయుక్తమవనీయండి నా జన్మభూమి కాంగ్లీ నుండి నేను శాంతి సుగంధాన్నై నలుదిక్కులా వ్యాపిస్తాను…
-
క్లో కోసం … విలియం కార్ట్ రైట్, ఇంగ్లీషు కవి
నిజానికి మనిషికి రెండు పుట్టుకలు:మొదటిది మేల్కొన్న ఇంద్రియస్పృహపై తొలి వెలుగు కిరణం పడినపుడు; రెండవసారి రెండు హృదయాలు కలిసినపుడు; మనజీవితాన్ని అప్పటినుండే లెక్కపెట్టాలి: మనం ఒకర్నొకరు ప్రేమించుకున్నప్పుడు మనిద్దరం కొత్తగా పుట్టినట్టే లెక్క. ప్రేమ మనకి సరికొత్త ఆత్మలను ప్రసాదిస్తుంది ఆ ఆత్మలలో కొత్త శక్తులను నింపుతుంది; అప్పటినుండి మనం ఒక కొత్త జీవితం మొదలెడతాము; మనం పీల్చే ప్రతి శ్వాస మనది కాదు, ప్రేమికది: వయసు భయపెట్టే వారిని ప్రేమ యవ్వనులని చేస్తుంది తమని తాము యవ్వనులుగా…