వర్గం: అనువాదాలు
-
సాయంవేళ … జార్జ్ హీమ్, జర్మను కవి
కెంపులా మెరిసిన రోజు … ఊదారంగు వన్నెల్లోకి మునిగిపోయింది అద్భుతమైన తళతళలతో ఏరు స్వచ్ఛంగా పారుతోంది అలలమీద జోరుగా పోతున్న పడవ తెరచాప… ఊగిసలాడుతోంది మెరుస్తున్న నీటిమీద సరంగు నీడ నల్లగా కనిపిస్తోంది. ప్రతి ద్వీపం మీదా శరత్కాలపుటడవులు రోదసి తన రెక్కలు బారజాపినంత మేరా తమ కుందనపు తలలు తాటిస్తున్నాయి. చీకటి కనుమల్లోంచి మంద్రంగా ఆకుల గుసగుసలు తేలివస్తున్నాయి గిరిసీమలనుండి సన్నగా వినవచ్చే తంత్రీ వాదనంలా అశ్రద్ధగా పట్టుకున్న చేతులనుండి చిక్కని మద్యం ఒలికిపోయినట్లు, తూరుపు ఇప్పుడు పెల్లుబికిన…
-
నీరవము… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
ఎక్కడా చప్పుడు పుట్టని చోట నిశ్శబ్దం ఉండిఉండొచ్చు చల్లని సమాధుల్లోనూ, సముద్రపు లో లోతుల్లోనూ ఏ శబ్దమూ వినిపించని చోట నిశ్శబ్దం ఉండొచ్చు, మూగబోయి, ఇంకా దీర్ఘనిద్రలో ఉన్న ఏ ప్రాణి కనరాని విశాలమైన ఎడారుల్లోనూ ఉండొచ్చు; కానీ ఏ గొంతుకా మూగపోలేదు, ఏ ప్రాణీ నిశ్శబ్దంగా చరించలేదు సోమరిగా ఈ నేల మీద తిరిగి, ఎన్నడూ మాటాడక నాచుపేరుకున్న శిధిలాల్లోనూ, పాడైన భవనాల్లోనూ ఒకప్పుడు మనిషి వసించిన పురాతన భవంతుల్లోనూ తిరిగే మేఘాలూ, మేఘాల్లా స్వేచ్ఛగా…
-
రెప్పపాటులో మాయమయే పగటి క్షణాలని మందలించొద్దు, అలాగే సహనాన్ని పోగొట్టే ఆలోచనలతో ఆత్మహత్యకు పాల్పడవద్దు, కాలం బరువుగా కదులుతోందని అనుకోవద్దు; ఈ నెమ్మది ఒక వరం; మనకి త్వరలోనే తెలుస్తుంది మనకి భవిషత్తు తెలుసుకుందికి ఎంత ఆరాటమున్నా నిజానికి అది తెలుసుకుందికి భయపడతామని. మార్మికమైన ఈ అజ్ఞానం మనల్ని భవిష్యత్తు తెలుసుకోలేకుండా శాసిస్తుంది, మనకోసం విధి అనుసరించే ధర్మసూత్రాల్ని ముందుకు జరపడానికి ప్రయత్నించదు; భవిష్యత్తును అపేక్షిస్తూ నువ్వుపడే ఆరాటాన్ని కాసేపు నిలువరించుకో. ఒక్కటి గుర్తించుకో: కాలం కడకు…
-
When Stomach Burns with Hunger.. Kasi Raju, Telugu, Indian
Father! Even when everything was exhausted in the house You never let us feel the want for anything Somehow you would arrange with a word or call; Mother would prepare us meal even by mooching. I come to know that There won’t be any want In lives that knew how to repay When mother serves me…
-
Another Performance… D. Vijaya Bhaskar, Telugu, Indian
I know You are too smart. As an initiation to death You ordained half of life should go in sleep; To prepare for tsunamis, You endowed billowing emotions; To stand disabling earthquakes, Taught strokes and rumblings to the heart; To ready for the Doomsday You instilled the five elements in me And set them to harmony. But…
-
నీవు లేక… హెర్మన్ హెస్, స్వీడిష్ కవి
సమాధి ఫలకంలా శూన్యంగా రాత్రిపూట తలగడ నా వంక చూస్తుంటుంది తదేకంగా; నీ కురులలో నిద్రపోకుండా ఒంటరిగా ఉండడం ఇంత కటువుగా ఉంటూందని ఎన్నడూ అనుకోలేదు. వేలాడుతున్న దీపం మసిబారి ఈ సడిలేని ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాను నీ చేతులు అందుకుందామని నా చెయ్యి జాచి నీ కోసం కాంక్షతో జాచిన మెత్తని పెదాలకు లక్ష్యం దొరకక విసుగుతో నీరసంగా నా పెదాలే దొరుకుతాయి. అప్పుడు ఒక్కసారిగా మెలకువ వస్తుంది, నన్నావరించిన చెమ్మ చీకటి ఇంకా చిక్కబడుతోంది.…
-
ఆమె జవాబు… సర్ వాల్టర్ రాలీ, ఇంగ్లీషు కవి
ప్రేమా, ఈ అనంత ప్రపంచమూ ప్రాయంలోనే ఉండి ప్రతి పశుకాపరి నాలుకమీదా నిజమే తారాడితే, ఈ ఇంపైన సుఖాలు నన్ను వశం చేసుకుని నీ ప్రేయసినై, నీతో జీవించేలా చేసి ఉండేవి. కానీ కాలం మందల్ని పొలం నుండి పొలానికి తరుముతుంటుంది, నదులు వరదలై పొంగుతాయి, రాళ్ళు చల్లబడతాయి; కోయిలకూడా మూగబోతుంది; మిగతావాళ్ళు జీవితం ఎలా వెళ్లదీయాలా అన్న చింతలో ఉంటారు. పువ్వులు వాడిపోతాయి; విధేయతలేని పొలాలు నిలకడలేని హేమంతానికి తలఒగ్గుతాయి; పెదాలపై తేనె,…
-
వాళ్ళు నిద్రించే చోట… జీ. ఓ. వారెన్, అమెరికను కవి
నల్లగా నిశ్చలంగా చుట్టబెట్టుకున్న పొగమంచు పోటెత్తిన సముద్రం ఒడ్డు ఇసుకను ముంచెత్తినట్టు దట్టమైన సమాధుల్లో లోతుగా వ్యాపించి వాళ్ల శిరసులపై నక్షత్రధూళి నింపుతోంది. వాళ్ళు నిద్రిస్తూ చాలా కాలమయింది. వాళ్ళ తనుమృత్తికి ఏదో తెలియని బూజుపట్టింది. వాళ్ళ గురించి చెప్పగలిగిందేమైనా ఇంకా ఉంటే, కొద్దికొద్దిగా శిధిలమౌతున్న ఆ రాళ్లు చెప్పగలవు. దారి తప్పి ప్రయాణిస్తున్న ఒంటరి నావికుడిలా మేరలేని ఎటో తేలుతున్న పొగమంచులో ఈ మునుగుతున్న సమాధులపై వాలి చూస్తూ నేనూ ఇక్కడకు చేరవలసిందేగదా అని యోచిస్తున్నాను. అక్కడ…
-
సోమరితనం… ఎస్. వి. మిచెల్, అమెరికను కవి
గడిచిపోయిన క్షణాలను అమితంగా ప్రేమించడంలో నన్ను మించినవాడు లేడు. నేను బద్ధకంగా విచ్చుకునేపూలని మించిన బద్ధకస్తుణ్ణి; గాలల్లాడని కందకంలో నీటి కన్నా, మధ్యాహ్నం నీటిమీద బద్ధకంగా తేలే లిల్లీల కన్నా బద్ధకంగా పడుకోగలను; ఇంతవరకు ఎన్నడూ కదిలిన ఛాయలు లేని ఏ శిలాఫలకం కన్నా నిశ్చలంగా ఉండగలను; నాకు అనిపిస్తుంటుంది అమాయకపు ఆనందం అందిచ్చే అద్భుతమైన వరాలన్నిటినీ నా అచంచలమైన సోమరితనం ఇస్తుంటుందని. . ఎస్. వి. మిచెల్ February 15, 1829 – January 4,…