సమాధి ఫలకంలా శూన్యంగా రాత్రిపూట తలగడ నా వంక చూస్తుంటుంది తదేకంగా; నీ కురులలో నిద్రపోకుండా ఒంటరిగా ఉండడం ఇంత కటువుగా ఉంటూందని ఎన్నడూ అనుకోలేదు.
వేలాడుతున్న దీపం మసిబారి ఈ సడిలేని ఇంటిలో ఒంటరిగా ఉంటున్నాను నీ చేతులు అందుకుందామని నా చెయ్యి జాచి నీ కోసం కాంక్షతో జాచిన మెత్తని పెదాలకు లక్ష్యం దొరకక విసుగుతో నీరసంగా నా పెదాలే దొరుకుతాయి. అప్పుడు ఒక్కసారిగా మెలకువ వస్తుంది, నన్నావరించిన చెమ్మ చీకటి ఇంకా చిక్కబడుతోంది. కిటికీలోంచి ఒక నక్షత్రం స్పష్టంగా మెరుస్తోంది… ఏవీ నీ స్వచ్ఛమైన కురులు? ఏవీ నీ తీయని పెదిమలు?
ఇపుడు సంతోషాన్ని చూసినపుడల్లా వేదననీ తాగిన ప్రతి గుటకలోనూ విషాన్ని దిగమింగుతున్నాను నువ్వు లేకుండా ఒక్కడినీ ఇలా ఒంటరిగా ఉండడం ఇంత కష్టంగా ఉంటుందని నేనెన్నడూ ఊహించలేదు.
.
అనువాదం: James Wright
హెర్మన్ హెస్ 2 జులై 1877 – 9 ఆగష్టు 1962 స్వీడిష్ కవి, నవలా కరుడూ, చిత్రకారుడూ
.
Herman Hesse
.
Without You
.
My Pillow gazes upon me at night Empty as a gravestone; I never thought it would be so bitter To be alone, Not to lie down asleep in your hair.
I lie alone in a silent house, The hanging lamp darkened, And gently stretch out my hands To gather in yours, And softly press my warm mouth Toward you, and kiss myself, exhausted and weak- Then suddenly I’m awake And all around me the cold night grows still. The star in the window shines clearly- Where is your blond hair, Where your sweet mouth?
Now I drink pain in every delight And poison in every wine; I never knew it would be so bitter To be alone, Alone, without you. .
స్పందించండి