అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జనవరి 17, 2016

    బెలిండా… అలెగ్జాండర్ పోప్, ఇంగ్లీషు కవి

    ఆమె తెల్లని గుండెమీద మెరిసే శిలువ ధరించి ఉంది దాన్ని ఆస్తికులు ముద్దాడితే, నాస్తికులు ఆరాధిస్తారు ఆమె అందమైన చూపులు ఆమె సూక్ష్మ బుద్ధిని సూచిస్తున్నాయి, చురుకైన కళ్ళలాగే, అంత నిలకడలేకుండానూ, ఎవరిమీదా ప్రత్యేకతలేకుండా, అందరికీ చిరునవ్వు చిందిస్తునాయి సూర్యుడంత ప్రకాశవంతంగా చూపరుల చూపులని ఆమె కళ్ళు తాకుతున్నాయి సూర్యుడిలాగే, అవి అందరిమీద ఒక్కలాగే ప్రకాశిస్తున్నాయి. అయినా, సరళతలో లాలిత్యం, గర్వపు పొడలేని మధురిమ ఉన్నాయి; అవి ఆమె లోపాలు కప్పిపుచ్చవచ్చు, కన్నియలు దాచడానికి లోపాలంటూ ఉంటే,…

  • జనవరి 16, 2016

    పాపాయి బరువెంత?… ఎథ్ లెండా ఏలియట్ బీర్స్, అమెరికను కవయిత్రి

    నెల్లాళ్లక్రిందటే దివినుండి దిగివచ్చిన పాపాయి ఎన్ని పౌండ్లు తూగుతుందబ్బా? ఎంతబరువుంటుందో కిరీటంలాటి వంకీ నుండి అవిశ్రాంతమైన గులాబిరంగు బొటనవేలివరకు? తాతగారు చేతిరుమాలు ఊయలలా ముడివేసి లోలకంలా ఊగుతున్నదాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నారు, జారిపోతున్న కళ్ళజోడుమీంచి జాగ్రత్తగా పరికించి “ఎనిమిది పౌన్లే” అంటూ ముల్లును చూసి చెప్పేరు. మెల్లిగా ఆ మాట ప్రతినోటికీ పాకిరింది చిట్టితల్లిని చూసి తండ్రి ఆనందంతో నవ్వేడు చక్కనైన మాతృమూర్తి పాటలు పాడుతుంటే నాయనమ్మ చిన్నదాని ముంగురులు సవరిస్తోంది. అపురూపమైన చిన్నారి మీదకి వాలి,…

  • జనవరి 15, 2016

    సానెట్ 106- షేక్స్పియర్

    ఇది షేక్స్పియర్ 400వ వర్ధంతి సంవత్సరం *** మిత్రులకీ, నా  బ్లాగు సందర్శకులకీ  సంక్రాంతి శుభాకాంక్షలు వృధాగా గడిపిన కాలాన్ని చరిత్రకెక్కించినపుడు అందులో అందమైన వ్యక్తుల వివరాలు చదువుతున్నప్పుడు మరణించిన అందమైన స్త్రీలనూ, వీరులనూ పొగుడుతూ అందాన్ని, అందంగా మలిచిన కవిత్వం చదివినపుడు… అందమైన వ్యక్తుల చేతుల్నీ, పాదాల్నీ, పెదాల్నీ, కళ్ళనీ, కనుబొమల్నీ సొగసుగా చేసిన ఆ వర్ణనలలో, అంత ప్రాచీన కవులూ, వాళ్ళ ఊహలలో చెప్పింది చాలవరకు ఇప్పుడు నీ సొమ్మయిన అందమని తెలుస్తోంది. కనుక,…

  • జనవరి 14, 2016

    సానెట్ 31… సర్ ఫిలిప్ సిడ్నీ, ఇంగ్లీషు కవి

    ఓ చంద్రమా! ఎంత మౌనంగా బరువుగా అడుగులేస్తూ ఆకశానికి ఎగబ్రాకుతున్నావు! ఎంతగా అలసిపోయింది నీ వదణం! ఏమిటి? అక్కడ స్వర్గంలో కూడా తీరుబాటు లేకుండా పూవిలుకాడు తన వాడి బాణాలు ప్రయోగిస్తున్నాడా? ప్రేమంటే ఏమిటో చిరపరిచయమున్న నాకళ్ళతో పరీక్షించినపుడు నీది తప్పకుండా ప్రేమికుడిబాధలాగే కనిపిస్తోంది; నీ కళ్ళలో స్పష్టంగా కనిపిస్తోంది; నీ సొగసులేమి చెబుతోంది; సరి వేదన అనుభవిస్తున్న నాకు, నీ స్థితి అర్థం అయింది. సహబాధితుడిగా, ఓ చంద్రమా నాకు తెలియక అడుగుతాను చెప్పు ఎడతెగని…

  • జనవరి 12, 2016

    దేశమంటే ఏమిటి?… సర్ విలియం జోన్స్, వెల్ష్ కవి

    దేశమంటే ఏమిటి? ఎత్తైన ప్రాకారాలూ, కూలీలు శ్రమపడికట్టిన మట్టిదిబ్బలూ, మందమైన గోడలూ, ద్వారాల చుట్టూ కందకాలూ కాదు; గోపురాల్లా అంతస్థులమీద అంతస్థులూ, తళుకులీనే శిఖరాలూ కాదు; తుఫానులనుసైతం ధిక్కరించి, శక్తిమంతమైన నౌకాదళం తిరుగాడే విశాలమైన సముద్రతీరాలూ, పొడవైన ఓడరేవులూ కాదు; సంస్కారహీనమైన కొంచెపుదనం ఆడంబరంగా వెదజల్లే సెంటు వాసనలతో నిండి, దేశపతాక రెపరెపలాడే న్యాయస్థానాలూ కాదు; అవును కానే కాదు. దేశమంటే ఉదాత్తమైన వ్యక్తులు, అనాగరికులూ, మందమతులకంటే మహా శక్తివంతులు అడవుల్లో, పొదల్లో, కొండ గుహల్లో మృగాలు…

  • జనవరి 11, 2016

    కల్పన… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి

    ఓ కల్పనా! నీ జీమూత గుహలనుండి బయటకి రా! నీ వన్నె వన్నెల రెక్కలను విస్తరించు. ఇప్పుడు నీ అన్ని ఆకారాలూ అంగీకారమే వస్తువుల అన్ని స్వరూపాలూ ఆమోదయోగ్యమే; ఒక ఉధృత ప్రవాహంలా ఊహాచిత్రాలు సృష్టించు, అవి రక్తమాంసాలు కలిగి ఉండాలి, జడత్వాన్ని కాదు; అవి వట్టి పగటి కలలు అయితే అవనీ, కానీ అవి సుగంధంలా తేలిపోవాలి అన్ని ఇంద్రియాలనూ లోబరచుకోవాలి, మా కళ్ళమీద నిద్రలా అల్లనల్లన వాలాలి లేదా సంగీతంలా చెవులపడాలి. . బెన్…

  • జనవరి 10, 2016

    ఒక చక్కని ఉదయం… జాన్ స్టెర్లింగ్, స్కాటిష్ రచయిత

    ఓ అగోచరమైన దివ్యాత్మా! నీ నుండి ఒక అపూర్వమైన ప్రశాంతత ప్రసరిస్తోంది, భూమ్యాకాశాలు ఉప్పొంగుతున్నాయి! వృక్షాలూ, కొండలూ, వాకిళ్ళూ స్పష్టంగా మెరుస్తున్నాయి, నీ విశాలమైన సాగరం నలుదిక్కులా సేదదీరుతోంది. ఊదారంగు ఆకాశ నేపధ్యంలో గిరిశిఖరాల వరుస స్పష్టంగా, నిలువుగా, నల్లని రాళ్లతో, లోయలతో కనిపిస్తోంది, అనాచ్చాదితమైన వెలుగు రేకలు విశాలంగా పరుచుకుంటున్నాయి దూరంగా రోదసిలో నీ ఉనికికి ఆటపట్టయిన శూన్యంలో. ఎక్కడో మ్రోగుతున్న గంటలు, మంద్రంగా ఘోషిస్తున్న సముద్రమూ, అడవిలో, ఊసులాడే పొదల్లో పక్షులుపాడే కమ్మని పాటలూ…

  • జనవరి 9, 2016

    సెయింట్ అగస్టీన్ జీవితంలో ఒక రోజు… అజ్ఞాత కవి

    సెయింట్ అగస్టీన్ చాలసేపు ఆ పేజీమీద దృష్టిపెట్టాడు, సందేహాల పరంపర అతని మనసంతా అలముకుంది; భగవంతుని నిగూఢమైన స్వరూపంలో, మూడు మూర్తులు కలగలసి ఎలా ఉన్నాయి, అని ఆలోచించాడు. అతనికి ఆలోచిస్తున్నకొద్దీ అతనికి అసాధ్యంగా కనిపించసాగింది ఒకదాని తర్వాత ఒకటి ఒరుసుకొస్తున్న సందేహాలు నివృత్తిచెయ్యడం పెను తుఫానులో చిక్కుకున్న ఓడని అదృష్టం ఎక్కడకి విసిరెస్తే అక్కడకి చేరినట్టు  అతని మనసు కకావికలమై, సాంత్వన దొరకక అల్లాడుతోంది. బుర్రవేడేక్కిపోయి, సంపుటాన్ని మూసి పక్కనబెట్టి సముద్రపొడ్డుకి కాసేపు మనశ్శాంతికోసం తిరగడానికి…

  • జనవరి 8, 2016

    నిజమైన ప్రేమ తీరు … షేక్స్పియర్

    ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం నే నిప్పటివరకు చదివినదాని బట్టీ చూసినవీ, కథలు కథలుగా విన్నదాన్ని బట్టీ నిజమైన ప్రేమికుల జీవితాలెప్పుడూ సజావుగా సాగలేదు. అయితే అవి అంతరాలున్న వర్గాలకు చెందడమో వయసులబట్టి చూస్తే పొందిక లేకపోవడమో, లేకపోతే హితుల ఎంపికమీద ఆధారపడడమో; ఒక వేళ ఎంపికలో సానుభూతి ఉండి ఉంటే, అవి యుద్ధమో, మరణమో, లేక రోగం వల్లనో ప్రేరితమై పరిగెత్తే నీడలా, కరిగిపోయే కలలా, ధ్వనిలా  …..   క్షణమాత్రం ప్రభావం చూపుతాయి.…

  • జనవరి 7, 2016

    ప్రభాతసమయం… సర్ విలియం డేవినంట్, ఇంగ్లీషు కవి

    భరతపక్షి తన జలస్థావరాన్ని విడిచి, మంచుపేరిన రెక్కలల్లార్చి గాలిలోకి ఎగురుతోంది, ప్రభాతమా! తూరుపున నీ కిటికీ తలుపు తడుతోంది వెలుగునభ్యర్థిసూ, అవ్యక్తగీతాలాలపిస్తోంది; లే! లే! నీ కన్నుల్లో తన అందాన్ని సరిదిద్దుకోకుండా ఉదయకాంత బయటకి రాలేదులే. వేగుచుక్కకి వర్తకుడు వేయి దండాలు పెట్టుకుంటున్నాడు హాలికుడు అరుణబింబాన్నిబట్టి ఋతువులు లెక్కిస్తున్నాడు; తన ప్రేయసి కంటే ముందులేచిన ప్రియుడు ఆ రేండూ ఏమిటో తెలియక వింతగా చూస్తున్నాడు. లే! లే! ఆ మంచుముసుగునుచీల్చుకుని రా ప్రభాతమా! చీకటితెరలు తీసి, రోజుకి…

←మునుపటి పుట
1 … 96 97 98 99 100 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు