అనువాదలహరి

నిజమైన ప్రేమ తీరు … షేక్స్పియర్

ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరం

నే నిప్పటివరకు చదివినదాని బట్టీ

చూసినవీ, కథలు కథలుగా విన్నదాన్ని బట్టీ

నిజమైన ప్రేమికుల జీవితాలెప్పుడూ సజావుగా సాగలేదు.

అయితే అవి అంతరాలున్న వర్గాలకు చెందడమో

వయసులబట్టి చూస్తే పొందిక లేకపోవడమో,

లేకపోతే హితుల ఎంపికమీద ఆధారపడడమో;

ఒక వేళ ఎంపికలో సానుభూతి ఉండి ఉంటే, అవి

యుద్ధమో, మరణమో, లేక రోగం వల్లనో ప్రేరితమై

పరిగెత్తే నీడలా, కరిగిపోయే కలలా, ధ్వనిలా

 …..   క్షణమాత్రం ప్రభావం చూపుతాయి.

విధివశాత్తో, స్వయంకృతంవల్లనో, కోపం వచ్చినపుడు

మనిషి తనను తాను నిగ్రహించుకుని ఇక చాలు అనుకునే లోపునే

చీకటి ఒక్కసారిగా విరుచుకుపడి కబళిస్తుంది.

ఎంతటి ఉదాత్త వ్యక్తిత్వాలైనా లిప్తలో తప్పటడుగువేస్తాయి.

.

షేక్స్పియర్ 

26 April 1564 (baptised) – 23 April 1616

William Shakespeare

The Course of True Love

For aught that ever I could read,      

Could ever hear by tale or history,  

The course of true love never did run smooth:    

But, either it was different in blood,

Or else misgraffèd in respect of years,       

Or else it stood upon the choice of friends;

Or, if there were a sympathy in choice,     

War, death, or sickness did lay siege to it, 

Making it momentary as a sound,    

Swift as a shadow, short as any dream;    

Brief as the lightning in the collied night,  

That, in a spleen, unfolds both heaven and earth,        

And ere a man hath power to say,—Behold!      

The jaws of darkness do devour it up:      

So quick bright things come to confusion.

.

(From “Midsummer Night’s Dream,” Act I. Sc. 1.)

.

William Shakespeare

(26 April 1564 (baptised) – 23 April 1616)

The World’s Best Poetry

Eds: Bliss Carman, et al., 

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Disappointment in Love

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: