అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఆగస్ట్ 21, 2016

    ప్రతి రాత్రీ ఈ పీడకలే… గెరాల్డ్ గోల్డ్, ఇంగ్లీషు కవి

    ఈ పీడకలే… ఏ రాత్రికి ఆ రాత్రి నా తలగడపై పళ్ళికిలిస్తూ కనిపిస్తుంటుంది … నేను అమాయకత్వంలో ఉండే మనశ్శాంతితో ఆనందానికి ఆర్రులుజాచే కాంక్షని కలగలుపుతునానట: ఇంతకుమించిన అపవాదూ, దూషణ ఉందా కేవలం దివ్యసంకల్పంతో, నిరపేక్షగా చేస్తుంటే… సోమరితనానికీ స్వార్థానికీ ముసుగు వేస్తున్నానట ఫాదిరీ నల్లగౌనులోనూ, దేవత తెల్లగౌనులోనూ. మహప్రభో, మీరు పాపం చేస్తే, దానిలో ఆనందం అనుభవించండి, దాన్ని ఆనందంకోసం చెయ్యండి. అంతే కాని “అదిగో చూడు, ఆత్మ ఎంత స్వేఛ్ఛగా ఎగిరిపోతోందో!… ఒక్క క్షణంలో…

  • ఆగస్ట్ 20, 2016

    మతచర్చ … ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికను

    మనం చాలా విశాలంగా ఆలోచిస్తాం కాని నడిచేది మాత్రం దగ్గరదారిలో; మనం దయ్యాలకు అడుగులకు మడుగులొత్తి ఇంటిముఖం పట్టేటపుడు గడగడ వణుకుతుంటాం; మనం రాత్రి కొలిచేదొక దేవుడిని పగలు ప్రార్థించే దింకొక దేవుడిని. . ఎర్నెస్ట్ హెమింగ్వే July 21, 1899 – July 2, 1961 అమెరికను నవలా కారుడు (ఈ కవితలో రచయిత మన ఆత్మవంచన తత్త్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు.  మన ఆలోచనలు మహోన్నతంగా ఉంటాయి.  కానీ ఆచరణలో మాత్రం దొడ్డిదారి పడతాం.  మనం  సేవించేది, అడుగులకి…

  • ఆగస్ట్ 19, 2016

    ఒక వాదము… థామస్ మూర్,ఐరిష్ కవి

    ఒకే విషయం మీద వేర్వేరు కవులు స్పందించిన కవితలన్నీ ఒకచోట దొరికే సందర్భం అరుదుగా తటస్థిస్తుంది. అలాంటిదే ఇది.  “Sin”  మీద ముగ్గురు కవుల (నిజానికి అందులో ఒకరు గొప్ప నవలా కారుడు) స్పందన వరుసగా మూడు రోజులపాటు చదవొచ్చు. ***  . నాకు చాలాసార్లు జ్ఞానులైన ఫకీరులు చెప్పారు ఊహించడమూ, ఆచరించడమూ రెండూ నేరమేనని దైవం ఆచరించిన వారిని ఎలా శిక్షిస్తాడో మనసులో కోరుకున్నవారినీ అలాగే శిక్షిస్తాడని. కోరిక శిక్షార్హమైనప్పుడు, నువ్వూ నేనూ మనస్సాక్షిగా నేరానికి శిక్షార్హులమే.…

  • ఆగస్ట్ 17, 2016

    సానెట్ 43… ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    ఏ పెదాలు నా పెదాలను చుంబించాయో; ఎక్కడ, ఎందుకు నేను మరిచిపోయానో; ఏ చేతులు తెల్లవారే వరకూ నా తలకి ఆసరా ఉన్నాయో; కానీ ఈ రాత్రి వర్షం మాత్రం భీకరంగా ఉంది, కిటికీ అద్దాలపై టప్ టప్ మంటూ; సమాధానానికి ఎదురుచూస్తూ నిట్టురుస్తూ, నా గుండెలో ఎక్కడో బాధ మెత్తగా కలుక్కుమంటోంది కారణం నను గుర్తుపెట్టుకోని నా పిల్లలు మరొకసారి ఏడ్చుకుంటూ ఈ అర్థరాత్రి నా దగ్గరకి రారు. అనుకుంటూ ఒంటరిగా హేమంతంలో నిలుచుంటుందొక చెట్టు.…

  • ఆగస్ట్ 16, 2016

    నన్ను నిద్రపుచ్చు… ఎలిజబెత్ ఏకర్స్ ఏలన్, అమెరికను

    వెనుతిరుగు వెనుతిరుగు నీ పరుగులో ఒకసారి కాలమా! వెనుదిరిగి ఒక్క రాత్రికి నన్ను పసిబిడ్డగా మార్చవా! ప్రతిధ్వనులెరుగని తీరంనుండి ఒకసారి మరలిరావా అమ్మా! మునపటిలాగే ఒకసారి నన్ను నీ గుండెలకు హత్తుకోవా; నా నుదిటినుండి వంతల ముడుతలు ముద్దాడి పోవా; అక్కడక్కడ నెరిసి నిలబడుతున్న నా జుత్తు సవరించవా ఎప్పటిలానే నే నిదరోతున్నపుడు ప్రేమగా కాపుకాయవా;- అమ్మా నన్నొకసారి నిద్రపుచ్చు! నను నిద్రపుచ్చు వెనుదిరుగు వెనుదిరుగు ఓ కాలకెరటమా! ఈ కష్టాలకీ కన్నిళ్ళకీ నేను అలసిపోయాను,- ప్రతిఫలం…

  • ఆగస్ట్ 14, 2016

    మరొకసారి రా! … రూమీ,పెర్షియన్ కవి

    రా! రా! నువ్వెవరైనా ఫర్వాలేదు. దేశదిమ్మరి, భక్తుడు, హతాశువు ఎవరైనా ఒకటే. ఇది నిరాశానిస్పృహల బిడారు కాదు. రా! నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని వెయ్యిసార్లు నిలుపుకోలేకపోయినా సరే రా! మరొకసారి రా! రా! రా! . రూమీ పెర్షియన్ కవి Come, come, whoever you are. Wonderer, worshipper, lover of leaving. It doesn’t matter. Ours is not a caravan of despair. Come, even if you have broken…

  • ఆగస్ట్ 12, 2016

    మనిద్దరం ఎన్నాళ్ళనుండో స్నేహితులం… కెరొలీన్ సారా నార్టన్, ఇంగ్లీషు కవయిత్రి

    చిన్నప్పుడు మొదటిసారి ఆ బాదం చెట్టుక్రింద ఆడుకోవడం మొదలుపెట్టినదగ్గరనుండి బాగున్ననాడూ, బోగున్ననాడూ మనిద్దరం ఎప్పటినుండో స్నేహితులం. ఎందుకో నీ మనసులో ఉదాసీనత చోటుచేసుకుంది. నీ కళ్లలో ఏదో అనుమానం పొడచూపుతోంది. మనిద్దరం ఎన్నాళ్ళనుండో స్నేహితులం కదా ఒక చిన్న మాట ఇపుడు ఇద్దరినీ విడదీయనివ్వవచ్చా? ఇద్దరం కలిసి ఆనందంగా గడిపేం, నవ్వుకుంటూ పరాచికాలాడుకున్నాం, మనిద్దరి మనసుల్లో ఎన్నో ఆశలూ ప్రేమగా పెల్లుబుకజొచ్చేవి నీ పెదవి మీద ఇపుడు చిరునవ్వు మాయమైంది నీ కన్నుల విషాదం కమ్ముకుంటోంది. మనిద్దరం…

  • ఆగస్ట్ 11, 2016

    మనోహరమైన ఈ యవ్వనశోభలు అంతరించినా… థామస్ మూర్, ఐరిష్ కవి

    నన్ను నమ్ము! ఈ రోజు నేను ఎంతో తమకంతో పరీక్షిస్తున్న మనోహరమైన ఈ యవ్వన శోభలు రేపు ఒక్కసారి మారిపోయినా, దేవతల వరాల్లా అవి నా చేతిలోంచి ఎగిరిపోయినా ఈ క్షణంలోలానే నిన్ను అప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను. నీ సౌందర్యం దాని చిత్తమొచ్చినపుడు మారిపోనీ, ఆ మార్పులో నా ప్రతికోరికా పచ్చగా నిన్ను అల్లుకునే ఉంటుంది. అందమూ, వయసూ నీ స్వంతమైననాడే కాదు, కన్నిటితో నీ బుగ్గలు మలినమైననాడే కాదు ఈ ఆత్మకి నీపై గల అనురక్తీ,…

  • ఆగస్ట్ 9, 2016

    సాలెగూడు… ఇ. బి. వైట్, అమెరికను

    సాలీడు, ఒక చిన్న కొమ్మనుండి వేలాడుతూ దాని కలాపనకి ఒక రూపం ఇస్తుంది, ముందుగా ఆలోచించి ఒక సన్నని దారపుపోగువంటి సాధనాన్ని, పైకి ఎక్కడానికి వీలుగా. రోదసిలో తను దిగినంతమేరా గుండెదిటవుతో, నమ్మకంగా దిగుతుంది, తను బయలుదేరినచోటు చేరుకుందికి ఒక నిచ్చెనలా దారాన్ని వడుకుతుంది. అలాగే నేనూ, గూడు అల్లడానికి సాలీళ్ళు కనబరిచే తెలివితో తిరిగి బయటకి రావడానికి అనువుగా ఒక పట్టుదారాన్ని నీకు వేలాడదీస్తున్నాను. . ఇ. బి. వైట్ July 11, 1899 –…

  • ఆగస్ట్ 8, 2016

    పది సరికొత్త దైవాజ్ఞలు … ఆర్థర్ హ్యూ క్లఫ్, ఇంగ్లీషు కవి

    నువ్వు ఒక దేవుడినే నమ్ముకో; ఇద్దరు దేవుళ్ళని నమ్మి ఎవడు బ్రతకగలడు? విగ్రహారాధన చెయ్యవద్దు ఒక్క కరెన్సీనోట్లని తప్ప; శాపనార్థాలు పెట్టవద్దు; ఆ విషయానికొస్తే మీ శత్రువు మీకు అందులో తీసిపోడు; మీరు ఆదివారం చర్చికి వెళ్ళడం వల్ల ప్రపంచంలో ఏమిజరుగుతోందో మీకు తెలుస్తుంటుంది; మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, అంటే, ఎవరివల్లనైతే మీకు భవిష్యత్తులో లాభం ఉంటుందో; మీరు హత్యలు చెయ్యవద్దు, అలాగని అతిచొరవ తీసుకుని ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నించవద్దు; వ్యభిచారం చెయ్యవద్దు; దానివల్ల, లాభం కలిగిన…

←మునుపటి పుట
1 … 82 83 84 85 86 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు