పది సరికొత్త దైవాజ్ఞలు … ఆర్థర్ హ్యూ క్లఫ్, ఇంగ్లీషు కవి

నువ్వు ఒక దేవుడినే నమ్ముకో;

ఇద్దరు దేవుళ్ళని నమ్మి ఎవడు బ్రతకగలడు?

విగ్రహారాధన చెయ్యవద్దు

ఒక్క కరెన్సీనోట్లని తప్ప;

శాపనార్థాలు పెట్టవద్దు; ఆ విషయానికొస్తే

మీ శత్రువు మీకు అందులో తీసిపోడు;

మీరు ఆదివారం చర్చికి వెళ్ళడం వల్ల

ప్రపంచంలో ఏమిజరుగుతోందో మీకు తెలుస్తుంటుంది;

మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, అంటే,

ఎవరివల్లనైతే మీకు భవిష్యత్తులో లాభం ఉంటుందో;

మీరు హత్యలు చెయ్యవద్దు, అలాగని అతిచొరవ తీసుకుని

ప్రాణాలు నిలబెట్టడానికి ప్రయత్నించవద్దు;

వ్యభిచారం చెయ్యవద్దు;

దానివల్ల, లాభం కలిగిన సందర్భాలు తక్కువ;

దొంగతనం చెయ్యవద్దు; అది వృధాప్రయాస

దానికంటే మోసం చెయ్యడం సులువైనపుడు;

తప్పుడు సాక్ష్యం చెప్పవద్దు; అసత్యాన్నిదాని రెక్కలమీద

తీరుబాటుగా విహరించే అవకాశాన్ని ఇవ్వండి;

దేన్నీ ఆశించవద్దు; కానీ సంప్రదాయం

అన్నిరకాలపోటీలనూ అంగీకరిస్తుంది.

.

ఆర్థర్ హ్యూ క్లఫ్

1 January 1819 – 13 November 1861

ఇంగ్లీషు కవి

.

Arthur Hugh Clough

.

The Latest Decalogue

.

Thou shalt have one God only; who

Would be at the expense of two?

No graven images may be

Worshipp’d, except the currency:

Swear not at all; for, for thy curse

Thine enemy is none the worse:

At church on Sunday to attend

Will serve to keep the world thy friend:

Honour thy parents; that is, all

From whom advancement may befall:

Thou shalt not kill; but need’st not strive

Officiously to keep alive:

Do not adultery commit;

Advantage rarely comes of it:

Thou shalt not steal; an empty feat,

When it’s so lucrative to cheat:

Bear not false witness; let the lie

Have time on its own wings to fly:

Thou shalt not covert; but tradition

Approves all forms of competition.

.

Arthur Hugh Clough

1 January 1819 – 13 November 1861)

English Poet

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.com/1999/07/latest-decalogue-arthur-hugh-clough.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: