-
స్మృతిగీతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
చారెడేసి ఉన్న నీ కనులని నేలలో భద్రంగా ఎక్కడో రహస్యంగా దాచనీ. సన్నని నీ వేళ్ళు, మెత్తనైన అందమైన వింతవన్నెల నీ కురులూ… ఇవన్నీ ఏదో విధంగా తప్పకుండా నేలలోని రహస్యమాళిగగుండా పైకి లేస్తాయి; కానీ, అందుకుకాదు గుండెపగిలి సర్వమూ శూన్యమై కళ్ళప్పగించి చూస్తూ నేనిక్కడ కూచున్నది; అందంగా అలంకరించినట్టు నీ చిన్ని ఎముకలను కప్పిన నీ నునులేత చర్మం వాతావరణంలోకి పువ్వులా విచ్చుకుంటుందని. కానీ, నీ గొంతు… నేలపొరల్లో మంద్రంగా పరిగెత్తే నీటి ఊటలు గాని,…
-
చరమ శ్లోకం… కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
నిలు బాటసారీ, క్రైస్తవుడా! నిలు, దేవుని బిడ్డా సున్నితహృదయుడవై చదువు. ఈ మట్టిక్రింద ఒక కవి పరుకున్నాడు, కాదు, ఒకప్పుడు అలా కనిపించేవాడు ఓహ్! ఒక్కసారి S T C కోసం ప్రార్థన చెయ్యి: అతను అనేక సంవత్సరాలు కష్టపడి కష్టపడి బ్రతుకులో చావు ఉచూసేదు; చావులో బ్రతుకుచూడనీ అని. ప్రశంసకి కరుణనీ, కీర్తికి క్షమాపణనీ క్రీస్తుద్వారా అర్థించాడు. నువ్వూ అదే ప్రార్థించు. . శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ 21 October 1772 – 25 July…
-
ఎన్ని రహస్యాలు దాచుకుంటామో… రిల్కే, ఆస్ట్రియన్ కవి
మనం ఎన్ని రహస్యాలు దాచుకుని ఉంటామో ఎన్ని పువ్వులకి చెప్పుకుని ఉండి ఉంటామో, అందుకే అందమైన పొదరిళ్లలో అవి మన ఆవేశాలెంతగాఢమో తెలియజేస్తుంటాయి మనకష్టాలన్నీ చెప్పుకుంటామని చుక్కలన్నీ నివ్వెరపోతాయి లోలోపలే. ఇక, అత్యంత సమర్థవంతమైనది మొదలుకుని అతి దుర్బలమైనదాని వరకూ ఏదీ భరించలేదు మన నిలకడలేని చిత్తవృత్తులూ, మన తిరస్కారాలూ, రోదనలూ— ఒక్క అలుపెరుగని రాతబల్లా.. అది పోయినపుడు, పడకబల్లా మినహాయిస్తే. . రిల్కే (4 December 1875 – 29 December 1926) ఆస్ట్రియను కవి…
-
మగపురుగులు… వాల్ఝీనా మార్ట్, బెలారూస్ కవయిత్రి
కవులు ఎంతసేపూ సిల్లీగా ప్రేమగురించి వ్రాయడమే గాని, తమ చుట్టూ జరుగుతున్న ఘోరాలని, రొమాంటిసైజ్ చెయ్యకుండా రాయడం ఎలాగో నేర్చుకోవడం లేదు. ఇప్పుడు వస్తున్న కవిత్వమంతా సెంటిమెంట్ కవిత్వమే. వాస్తవానికి కనుచూపు మేరలో ఉండనిదీ, ఎక్కువగా అందరికీ తెలిసిన విషయాలనే నీతులుగా బోధించేదీ. తమదృక్పథంలోనుండి చూడడమే గాని, బాధితుల సమస్యలు అవగాహన చేసుకుని వాటిని నిజాయితీగా ప్రతిబింబించడానికి ప్రయత్నించే సందర్భాలు అరుదు. ఏ పక్షమూ తీసుకొకుండా చరిత్రని రికార్డు చెయ్యడం కవి బాధ్యత. ఇంతకంటే ఎక్కువ చెబితే…
-
దాడికి వెళ్లిన ఆటగాడు … రాబర్ట్ ఫ్రాన్సిస్, అమెరికను కవి
మన చెడుగుడు (కబడ్డీ) ఆటకి పోలికలున్న Prisoner’s Base ఆట మీద వ్రాసినట్టున్నా, ఈ కబడ్డీ మనలో చాలమందికి పరిచయమే కాబట్టి ఇక్కడ ఇస్తున్నా. ఆటలు వర్ణిస్తూ వచ్చిన అతి తక్కువ కవితల్లో ఇదొకటి. *** అవసరమైతే ముందుకివెళ్లడానికీ లేకుంటే వెనక్కి మళ్ళడానికి సిద్ధంగా, తాడుమీద నడిచే వీటివాడిలా అటూ ఇటూ పడకుండా నిలదొక్కుకుంటూ రెండూ చేతుల వేళ్లూ రెండు వ్యతిరేకదిశల్లో చాచి ఉంచి క్రిందపడిన బంతి మీదకెగిరినట్టు మునివేళ్ళ మీద గెంతుతూ లేదా, ఒక అమ్మాయి…
-
రాత్రి ప్రశంస… థామస్ లోవెల్ బెడోస్, ఇంగ్లీషు కవి
అయితే మళ్ళీ వచ్చేవన్నమాట, కాలవిహంగాల ముసలివగ్గూ, ఓ రాతిరీ! మాకూ సూర్యుడికీ మధ్య అడ్డంగా పెద్ద పక్షిలా నీ శరీరాన్ని వ్యాకోచింపజేసి వెలుతురును మరుగుపరుస్తూ; చాలనట్టు, నిర్దాక్షిణ్యమన నీ గుండె అంచున చీకట్లలో మబ్బు రెక్కల దిగువన, పొగమంచు తెగుళ్ళనీ పొదుగుతూ, తుఫానులకీ, కర్కశమైన హిమపాతాలకి ప్రాణం పోస్తూ, పగటి గోర్వెచ్చని ఎంద లాలనలు కరువుచేస్తూ… భీతితో ముడుచుకుపోయిన గుడ్లగూబలు పైకి ఎగబ్రాకిన లతల ఉయ్యాలల్లో నిను వేడుకుంటూ ప్రార్థనలు చేస్తున్నాయి. కాంతిహీనమైన ప్రపంచం మీదకి ఒక్క…
-
బలవంతపు కవాతు… మిక్లోష్ రాద్నోతి, హంగేరియన్ కవి
[మిక్లోష్ రాద్నోతి రెండవ ప్రపంచయుద్ధకాలంలో హిట్లరు చేసిన మారణహోమంలో బలైపోయిన హంగేరియన్ కవి. ఈ కవిత చదువుతుంటే మీకు రెండు విధాలుగా కన్నీళ్ళు రాకమానవు. ఒకటి అంత మంచి భవిష్యత్తు ఉన్న కవి అలా అన్యాయంగా చనిపోయినందుకు; రెండు, ఈ కవితలో అతను ఉపయోగించిన దృశ్యరూపకమైన ఉపమాలంకారాలకి. ముఖ్యంగా, నిదురిస్తున్న తోటలో, తిరోగమిస్తున్న గ్రీష్మం తీరికగా స్నానంచెయ్యడం, ఆకుల మధ్యలో పళ్ళు దిగంబరంగా ఉయ్యాలలూగడం, ఈ రెండింటికంటే అందంగా, “పగలు మెల్ల మెల్లగా నీడలు గీసుకుంటూ పోవడం”.…
-
బేగల్… డేవిడ్ ఇగ్నతోవ్, అమెరికను కవి
మన చిత్రమైన మానసిక స్థితిని పట్టిచ్చే కవిత ఇది. కొన్ని వస్తువులు పోగొట్టుకుంటాం. వాటిని తిరిగి సంపాదించడానికి తెగ వెతుకులాడతాం. ఈ వెతుకులాటలో పొరపాటున ఏదైనా కొత్త వ్యాపకం దొరికితే, ముందు చికాకుపడినా, కొంతసేపటికి, మనం వెతుకుతున్న లక్ష్యం మరిచిపోయి, ఈ వ్యాపకానికి అలవాటుపడిపోతాం. బేగల్ అన్నది ముందు పులియబెట్టి, తర్వాత వేచి, గట్టిగా, గారెలూ, చేగోడీల్లా గుండ్రంగా, కానీ పలచగా చుట్టలుచుట్టి తయారుచేసే వంటకం. . గాలికి దొర్లిపోతున్న బేగల్ ని పట్టుకుందికి నిలబడ్డాను. దాన్ని…
-
I did Not Take Proper Leave of You… Bojja Tarakam, Telugu Poet
I am sorry I did not take proper leave When we parted… I could not speak out my mind when the police arrested me. You stood awestruck with tears swelling in your eyes. Poor me! These cuffed -hands were helpless to dry your tears. Ringing the ‘long-bell’ to silence marched … the police boots. I could…
-
అంతా సంగీతమైన చోట… రూమీ, పెర్షియన్ కవి
ఈ గీతాల్ని భద్రపరచుకోవడమెలా? అని చింతించకు! మన వాయిద్యాల్లో ఏది పగిలిపోయినా ఫర్వా లేదు. మనం ఇప్పుడు పడిన చోట సర్వం సంగీతమయం. తంత్రీ నినాదాలూ,పిల్లనగ్రోవి స్వరాలూ వాతావరణంలో తేలియాడుతూనే ఉంటాయి ప్రమాదవశాత్తూ ఈ విశ్వవీణియ అగ్నికి ఆహుతైనా, ఇక్కడ ఇంకా చాలా నిగూఢవాయిద్యాలుంటాయి … మ్రోగుతూ. ఒక కొవ్వొత్తి మిణుకుమిణుకుమని చప్పున ఆరిపోతుంది. అయినా, మన చెంత ఒక చెకుముకిరాయి, నిప్పురవ్వా ఉంటాయి. ఈ సంగీత కళ ఒక సముద్రపు నురుగులాంటిది. సముద్ర గర్భంలో ఎక్కడో…