-
అదృశ్య నేత్రం …జాన్ ష్రైబర్, అమెరికను కవి
అదృశ్యమైన నురుగును ఎవరు సృష్టించగలరు; లేదా పొర్లిన ఇసుకను చూసీ, వీచిన పిల్లతెమ్మెరనుండీ అప్పుడే ఇంకిన కెరటపుజాడ ఎవరూహించగలరు? కంటికి చిక్కి, కనుమరుగై, ఇంకా అక్కడ ఆవిష్కారమౌతూనే ఉంటుంది. . జాన్ ష్రైబర్ జననం 1941 అమెరికను కవి, అనువాదకుడు, సాహిత్య విమర్శకుడు . . Camera Obscura . Who can retrieve from fallen spray or guess from altered sand or air the wave just past, caught in…
-
మరుపు… కెరొలీన్ రఫేల్, అమెరికను కవయిత్రి
ప్రారంభంలో తేడా చాలా చిన్నగా ఉండేది… తాళం ఎక్కడో పెట్టేయడమో, ఎంతో స్నేహపూర్వకంగా ఉండి, వాళ్లని పలకరించాలనుకున్నప్పుడు కొత్తగా పక్కింట్లో చేరినవాళ్ల పేరు మరిచిపోవడమో; బాగా తెలిసిన ప్రదేశమే, తెల్లారేసరికల్లా ఎవరో మాయచేసినట్టు బొత్తిగా కొత్తప్రదేశమైపోయేది… “ఫ్రాన్స్ లో చాలా పేరుపడ్ద గొప్ప కెఫే ఉంది (లేక గ్రీసులోనా?) మనం కోరింత్ లో కదూ కబుర్లుచెప్పుకుంటూ మద్యం సేవించింది (లేక నైస్ లోనా?)..” “అప్పుడే మరిచిపోయావా? అది నార్మండీ.” అలా ఇద్దరం ఒకరి పొరపాట్లు ఒకరు క్షమించేసుకుంటాం…
-
A Blade of Grass… Srirangam Narayana Babu, Telugu , Indian
Tread! Trample! March over me! After all I am just a blade, a blade of grass! I’m a flower at the auspicious moment; And a sacred haulm in the hour of need. Once the exigency passes And you encounter me in the open I am my usual self, a mean, worthless Blade of grass;…
-
About War… Vadrevu Chinaveerabhadrudu, Telugu, Indian
People who talk about war are very vociferous about war. They don’t let you sit still, hurry you up, give vent to anger and grief. They engineer new strategies, clamor at a high pitch and unfurl flags. People who talk about war, talk nothing else about but war. But it is a different matter with…
-
గీగీస్ అంటే గుర్రాలు… రిచర్డ్ మూర్, అమెరికను కవి
అప్పుడే కొత్తగా మాటలు పలకడం వస్తున్న చిన్న పిల్లల మానసిక స్థితిమీద రాసిన ఒక చక్కని కవిత . గీగీస్ అంటే గుఱ్ఱాలు; నల్లగా కనిపించే మలానికి ఆమెవాడే మాట తా-తా. ఒకసారి పొదల్లోని గడ్డీ గాదంగుండా తప్పటడుగులు వేసుకుంటూ, ఎండిపోయిన తోలులా ఉన్న ఒక పెద్ద గుఱ్ఱపు పెంటకుప్పని చూశాము; దీ? (అదేమిటీ?) అని అడిగింది. అప్పటివరకు ఆమె నోట మేము అర్థంలేని మాటలేవిన్నాము; ఒక్కసారి నాకు జ్ఞానోదయమై ఆమె అంటున్న మాటలని వరసగా పేర్చడానికి…
-
మోత సామాను… సామ్యూల్ మినాష్, అమెరికను కవి
(రషేల్ హాదాస్ కి ) పాత గాయాలు లోతైన శూన్యాన్ని విడిచిపెడతాయి. వాటిగురించి తరచు ఆలోచించేవాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా ఏ మాత్రం చెక్కుచెదరని ఒకప్పటి తమ శక్తి సామర్థ్యాలూ, అందచందాల జ్ఞాపకాలలో ఓలలాడవచ్చు- నా గాయాల మచ్చలే నన్ను ఆరోగ్యంగా ఉంచాయి. కారణం, ఇప్పుడు నన్ను ఏది గాయపరచినా అది ఇంతకు ముందు ఏర్పడిన గాయానికి పొడిగింపే; అది నాకు ఏ కష్టమూ కలిగించకుండా నన్ను నా ఆలోచనల అంతరాళంలోకి తీసుకుపోతుంది. . సామ్యూల్ మినాష్ (September…
-
ఆశావాది… జోషువా మెహిగన్, అమెరికను కవి
ఆ ఎక్స్ రే వివిధ పరిమాణాల్లో అనేక నక్షత్రాలను చూపిస్తోంది కుడిపక్క తులారాశి, ఎడమప్రక్క కర్కాటకం(కేన్సర్) మెదడు పూర్ణ మండలాన్ని చూపిస్తున్న అందులో, కొన్ని బిందువులు విచక్షణనీ, కోరికనీ… పూర్తిగా హరించాయి. డాక్టర్లకి ఆమె ఉల్లాసంగా ఉండడం ఎంతో నచ్చింది ఆమె స్థితిలో ఆశను మించి మరేమీ మిగలలేదు. ఆమె చాలా ప్రశాంతంగా ఎదురుచూసింది. ముందుగా స్పర్శ కోల్పోయింది. తర్వాత చూపు; ఆవేశం మందగించింది. ఊపిరితిత్తులూ, గుండె వంతు చివర. కానీ, ఆ క్రమాన్ని ప్రస్తావిస్తూ రుచి…
-
ఆ నమ్మలేని క్షణం వస్తుంది… కేట్ లైట్, అమెరికను కవయిత్రి
మీరు చదువుతున్నదేమిటో మీకు అర్థం అయినప్పుడు మీకు ఏమిటి తెలియజేయబడుతోందో గ్రహించినపుడు మీరు ఆశించినది అదికాదని గుర్తించినపుడు మీరు ఏది చదువుతున్నా రనుకున్నారో మీరు ఎక్కడికి వెళుతున్నారో గ్రహించినపుడు అది మీలో ఒక కొత్త ఎరుక కలిగించి ఆవేశాన్ని రగిలిస్తుంది, మీ నాడి వేగంగా కొట్టుకోనారంభిస్తుంది, అపుడు, మరొకసారి మీరు అనుకున్న మార్గంలో వెళ్లడం లేదని గుర్తించేదాకా; మీతోపాటుమీ పాఠకుడిని తీసుకుపోయేదాకా మీరు ఇంకా చదువడానికీ, రాయడానికీ నిర్ణయించుకుంటారు; మీ పాఠకులుకూడా ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని…
-
సంధి… పాల్ లేక్, అమెరికను కవి
రాజ్యం చక్రాలను ఆపడానికి నా జీవితాన్ని ఒకరకమైన వేగనిరోధినిగా చేసి జైలుకి వెళ్ళాను… నా పన్నులు చెల్లించకుండా; అంత నమ్మకం లేని మిత్రుడొకరు తిరిగి పన్ను చెల్లించి ఆ పళ్ళచక్రం కదిలి నన్ను ప్రక్కకి తొలగించేదాకా గడిపేను. అక్కడ ఆ నాలుగు మందమైన రాతి గోడల మధ్యా, బరువైన కలప- ఇనప తలుపులవెనక గడిపిన సమయంలో, రాజ్యమూ, వాటి సంస్థలూ తమకి ఇచ్ఛానుసారం బందీలుగా చెయ్యడానికి మనుషులని కేవలం రక్తమాంసాలూ, ఎముకలప్రోవులుగా ఊహించుకునే ఎంత దద్దమ్మలో అర్థం…
-
రహస్యాలు…. లెన్ క్రిసాక్, అమెరికను కవి
(… ఏంథొనీ లొంబార్డీ స్మృతిలో ) కొందరనుకుంటున్నట్టు అతను చాలా మెల్లిగా పనులుచేస్తాడనో, లేదా చాలా సామాన్య విషయాలకే అతిగా నవ్వుతాడనో అతన్ని మూర్ఖుడిగా జమకట్టవచ్చు. కానీ అది నిజం కాదు. ఉత్తరాలు తీసుకువచ్చే అతనికోసం ఎంతలా ఎదురుచూస్తామో అంతలా అతని అడుగులచప్పుడుకోసం ఎదురుచూసేవాళ్ళం. తలుపుకి తగిలించిన ఓవర్ కోటు మాకు నాలుగైదేళ్ళప్పుడు అందులో వెళ్ళిన మనిషి తిరిగివచ్చేడని సూచించేది. మమ్మల్ని ఎగరేసి ఎత్తుకోవడం, గుర్రం ఆడటం ఒక్కటే కాకుండా అతనికి చాలా విషయాలలో ప్రావీణ్యం ఉంది.…