అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 26, 2012

    నా భయాలు … జాన్ కీట్స్

    ధాన్యాగారాల్లో పసిడిపంటను నిల్వజేసినట్టు తలలో పొంగిపొర్లుతున్న ఆలోచనలను అక్షరరూపంలో పుస్తకాలలోకి నా కలం అనువదించేదాకా బతకనేమోనన్న భయం నన్నావహిస్తోంది. నక్షత్రాచ్ఛాదిత నిశీధి ముఖం లోకి చూసినపుడు దొరలాడిన మబ్బు దొంతరల శృంగారకేళీ విలాసము తలుచుకుంటే, అదృష్టదేవత ఇంద్రజాలముచేసినా జీవితంలో ఆ ఛాయ లనుకరించగలనని అనుకోను. ఓ ఈక్షణిక సుందరీ! నిన్ను మళ్ళీచూసేభాగ్యం నాకు లేదని తలుచుకున్నప్పుడల్లా, ప్రతిఫలాపేక్షలేనిప్రేమ సమ్మోహనశక్తిని ఆస్వాదించలేకున్నాను. అందుకే, ఈ విశాల విశ్వసాగర తీరాన ఏకాకిగా నిలబడి ప్రేమకీ కీర్తిప్రతిష్టలకీ కడసారి వీడ్కోలు చెబుతున్నాను.…

  • ఫిబ్రవరి 25, 2012

    ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు … మార్టిన్ నీమలర్

    . ముందు వాళ్లు కమ్యూనిస్టులకోసం వచ్చేరు నాకెందుకు అక్కరలేనివని మాట్లాడలేదు నేను కమ్యూనిస్టుని కాదుగదా! . తర్వాతవాళ్ళు  కార్మిక నాయకులకోసం వచ్చేరు. నాకెందుకని ఊరుకున్నాను నేనేమైనా కార్మికనాయకుణ్ణేమిటి? . ఆ తర్వాత వాళ్ళు యూదులకోసం వచ్చేరు మనకెందుకని అడగలేదు నేను యూదును కాదుగదా! . చివరికి వాళ్ళు నాకోసం వచ్చేరు నన్ను వెనకేసుకుని రావడానికి ఎవ్వరూ మిగల్లేదు. . మార్టిన్ నీమలర్ జర్మను  ప్రొటెస్టెంటు పాస్టరు. (14 జనవరి 1892 – 6 మార్చి 1984) “వాళ్ళు…

  • ఫిబ్రవరి 24, 2012

    సానెట్ LXVI: రాత్రి వరద భీభత్సం… ఛార్లెట్ స్మిత్

    . శిలలతో నిండిన సముద్రపుటొడ్డున రాత్రి-వరద భీభత్సం సృష్టిస్తోంది: అలుపులేక పోటెత్తిన తన కెరటాలక్రింద సమాధికాబడ్డవాటికోసం రంపపుపళ్ళలాంటి కొండకొనలమీదా, చలువరాయి గుహల్లోనూ బొంగురుగొంతుతో సముద్రం శోకిస్తోంది. తవ్విపోస్తున్న తన కరకుకెరటాలతాకిడికి ఎత్తైనమిట్టకొనకొమ్ము మీంచి పచ్చికతోసహా ఒక శాలిబండ దొర్లుకుంటూ అఖాతంలోకి దబ్బుమని నిలువుగాపడింది నిశానిశ్శబ్దశ్రవణాలపై పిడుగుపడ్డట్టు. దానిప్రతిధ్వనులకి ఒడ్డు ఒణికింది. మనిషిజాడలేని ఈ తుఫాను రాత్రి ఆకాసంలో తేలుతున్న మబ్బుతెరలమాటున చంద్రుడు కళావిహీనంగా వెలుగుతున్నాడు; యువతా, బడలిన శరీరాలూ హాయిగా కలతలేక నిద్రిస్తుంటే, నేనొకడినే లక్ష్యంలేకుండా తిరుగాడుతున్నాను. నిట్టూర్పులతో…

  • ఫిబ్రవరి 23, 2012

    ఆమె నడకే అందం… లార్డ్ బైరన్

    . మబ్బులేని రాత్రి, ఆకాశంలోనిచుక్కల్నివెంటేసుకునివచ్చే చీకటిలా ఆమె అందంగా నడుస్తోంది. అసలు, ఆ తెలుపు నలుపులలోని వన్నె అంతా ఆమె కన్నులలోనూ, రూపంలోనే మిళితమై ఉంది: పరువానికొచ్చిన ఆ వెలుగు జిలుగు ప్రకృతి పగటికికూడా ప్రసాదించలేదు. ఆ నీలికురుల ప్రతి కదలికలోనూ ఆ ముఖపు ప్రతి కవళికలోనూ లలితంగా జాలువారే ఆ అజ్ఞాత సౌందర్యానికి నలుపు చిన్నమెత్తు ఎక్కువైనా, వెలుగు ఓ రవ్వ తక్కువైనా లోపమేమీరాదు: ఎప్పుడూ గంభీరంగా తేనెలొలుకుతూ ఉండే ఆ ఆలోచనల పుట్టినిల్లు ఎంత…

  • ఫిబ్రవరి 22, 2012

    Where else is my carkless repose? … Usharani

    . Woods are my birth place There are comrades every way Silken carpets of green pastures Delicate dangling of baby branches Ornate flowery ornaments Fluting whispering winds Concerts of wings on flight Choreography of cascading steps… . I am a contented soul in my dominion. . Usharani (Usharani is located in US and is a…

  • ఫిబ్రవరి 21, 2012

    I Have No Nat… Afsar

    . I am some limb Lingering under a hollow head You never told me Where I originated from Who brought me up or Why I was partitioned exactly in ’47 Cutting off, or appropriating each limb of God Else, looting them for yourself, You did not leave anything for me. I am an ethereal shadow…

  • ఫిబ్రవరి 20, 2012

    పిచ్చికుక్క స్మృతికి… Oliver Goldsmith

    . మంచి మనసున్న మనుషులు మీరంతా నా పాట కాస్త చెవొగ్గి వినండి ఇది మీకు వింతగా అనిపించకపోతే మీ పని మీరు చేసుకుందురుగాని ఇస్లింగ్టన్ లో ఒక మనిషుండేవాడు అతని గురించి లోకమేమనుకునేదంటే అతను ప్రార్థన చెయ్యడానికి నిలబడితే ఆ దేముడే దిగివచ్చేడా అని అనిపించేదట. మిత్రులనీ శతృవులనీ అనునయించడానికి అతనికి సున్నిత, దయార్ద్ర హృదయముంది అతను వస్త్రధారణచేసేడంటే కేవలం తన నగ్నత్వాన్ని కప్పిపుచ్చడానికే వేటకుక్కల్లాంటి మేలుజాతి మొదలు సంకరజాతివీ, నాటుకుక్కలదాకా ఉన్న ఆ ఊర్లో, …

  • ఫిబ్రవరి 19, 2012

    ఒక పురాతన అభినయం … Edna St. Vincent Millay

    [గమనిక: ఈ కవితని బాగా అర్థం చేసుకోవాలంటే ఇందులో ప్రతీకలుగా ప్రస్తావించిన రెండు పాత్రలగురించి కొంత తెలియాలి. పెనిలోప్, యులిస్సిస్ … ఈ ఇద్దరూ హోమరు మహాకవి వ్రాసిన గ్రీకు మహాకావ్యంలోని రెండు పాత్రలు.  ట్రోజను యుధ్ధంలో నిమగ్నమైన భర్త యులిస్సిస్ గురించి భార్య పెనిలోప్ కి 20సంవత్సరాలపాటు ఏ సమాచారమూ ఉండదు. అసలు బ్రతికిఉన్నాడో లేదో కూడా తెలియదు. కాని ఆమె భర్త వస్తాడని అలా సముద్రం వైపు నిరీక్షిస్తూ చూస్తుంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ…

  • ఫిబ్రవరి 18, 2012

    నీతో ఒక గంట చాలు… సర్ వాల్టర్ స్కాట్.

    . నీతో ఒక గంట చాలు! ప్రాభాతసంధ్య తూరుపు నీలితెరలపై బంగారు వన్నెలు అద్దుతున్నప్పుడు నీతో ఒక్క గంట చాలు! ఇక రోజులో రాబోయే కష్టాలనీ, కన్నీళ్ళనీ శ్రమనీ, సంక్షోభాల్నీ బాధలూ, వాటి జ్ఞాపకాలనీ మరిచిపోకుండా నన్నేదీ కట్టిపడెయ్యలేదు! నీతో ఒక గంట చాలు! మండువేసవి మధ్యాహ్న సూర్యుడు ప్రచండంగా ప్రకాశిస్తున్నప్పుడు చల్లని చెట్టునీడకంటే, సేదదీర్చే కొండవాలు కంటే పొలంలో నమ్మకంగా పాటుపడుతున్న రైతుకి శ్రమకుతగ్గ ప్రతిఫలం ముట్టజెప్పగలిగిన దెవ్వరు? నీతో ఒక్క గంట చాలు! ఆహ్!…

  • ఫిబ్రవరి 17, 2012

    ఏకాంత స్తుతి … అలెగ్జాండర్ పోప్

    . వంశపారంపర్యంగా వచ్చే ఆ నాలుగుమూరల నేలకే తన కోరికలూ, కష్టమూ పరిమితమై, తను పుట్టిన నేలమీది గాలి పీలుస్తూ, ఏవడు సంతృప్తిచెందుతాడో, ఎవని పసులు పాలతో సమృధ్ధిగా, ఎవని పొలాలు పంటలతో సుభిక్షంగా, ఎవని “జీవాలు” ఉన్నితో పుష్కలంగా ఉంటాయో; ఎవని వృక్షాలు వేసవిలో నీడనూ, చలికాలంలో చితుకుల్నీ నిరాటంకంగా అందిస్తాయో, వాడే సుఖజీవి. ఎవనికి, వాని ఎరుకలేకనే గంటలూ, రోజులూ, వత్సరాలూ దొర్లిపోతుంటాయో; ప్రశాంత చిత్తమూ, ఆరోగ్యవంతమైన శరీరమూ, చీకూ చింతాలేని ఉదయాలూ, కలతనిదురలేని రాత్రులూ ఉంటాయో;…

←మునుపటి పుట
1 … 228 229 230 231 232 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు