Where else is my carkless repose? … Usharani

Courtesy: Usharani (from her web album)

.

Woods are my birth place

There are comrades every way

Silken carpets of green pastures

Delicate dangling of baby branches

Ornate flowery ornaments

Fluting whispering winds

Concerts of wings on flight

Choreography of cascading steps…

.

I am a contented soul in my dominion.

.

Usharani

(Usharani is located in US and is a blogger since 2008 running her blog:  ” http://maruvam.blogspot.com/” )

The poem highlights, in my opinion, the urge for freedom and a longing for one’s roots, and asserts that one can remain safe and content in one’s own domain… may be a common urge / a recurring theme for expats.

.

అభయావాసం ఇంకెక్కడవుంది?

.

అడవి నా పుట్టినిల్లు

అడుగడుగున నేస్తాలు

పచ్చికబైళ్ళు పట్టుకంబళ్ళు

పూలసరాలు ఆభరణాలు

లేతరెమ్మలు వీవెనలు

గాలిస్వరాలు వేణువులు

ఎగిరే రెక్కల కచ్చేరీలు

కదిలే పాదాల నాట్యాలు

స్వస్థానాన నేను నవ్వే మనిషిని.

.

ఉషారాణి

.

ఉషారాణిగారు 2008 నుండి తమ “maruvam.blogspot.com” అన్న బ్లాగు  నడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికావాసి.

“Where else is my carkless repose? … Usharani” కి 6 స్పందనలు

    1. శర్మగారూ,
      నాకు చిన్నప్పుడు ఆకాశవాణి నుండి ప్రసారమయే దేశభక్తిగీతాలలో, “నాదు జన్మభూమి కంటె నాక మెక్కడుంది సురలోక మెక్కడుంది” అన్నపాట గుర్తుకువచ్చింది ఈ కవితలోని మాటల్లో.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  1. కృతజ్ఞతాభివందనాలు sunamu గారు. కృష్ణమ్మ, నాగార్జునకొండ, ఎత్తిపోతల జలపాతం, శ్రీశైలపు అడవుల నాటి స్మృతులివి; మా గోదావరి ఊర్ల మమతలకి వాఁపిరిగొట్టుని. చిన్నతనపు గురుతులు అక్కడవి కనుకనేమో, నేనీనాటికీ జన సందోహాల్లో మెసలలేను. ఆస్ట్రేలియా, అమెరికా అనే కాదు నేను హైదరాబాదులోనూ ఇలా నా ఊపిరికోసం అల్లాడాను. అదే ఈ కవితకి ప్రేరణ.

    మీకా పంక్తులు నచ్చి ఇలా అనువాదం చెయ్యటం చాలా సంతోషం. వెలికి వచ్చాక పదాల్లో పాదాల్లో సత్తా నిలుపుకునే రచనలకి, రచయితకి పునఃపరిచయం ఇలా ప్రతిస్పందించే వారు కల్పించేదేగా! మరొక్కసారి ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

    1. ఉషారాణిగారూ,
      “వాపిరిగొట్టు” అన్న మాట ఎంతచక్కగా వాడేరు! అది చిన్నప్పుడెప్పుడో పెద్దవాళ్ళు పిల్లల్ని దెబ్బలాడుతుండగా ఈ మాట విన్నాను. దానిలోని నిందార్థాన్ని తీసేసి చాలా పోజిటివ్ గా వాడేరు. ఒకసారి మీరు పెరిగిన వాతావరణం చవిచూచిన తర్వాత దానికోసం “వాచిపోడం” సహజమే.
      స్మృతిపథంలో మరుగుపడిపోయిన మంచిమాటను గుర్తుకు చేసినందుకు కృతజ్ఞతలు.
      అభినందనలతో

      మెచ్చుకోండి

  2. ఉషారాణిగారూ,
    ప్రకృతితో తాదాత్మ్యం చెందినపుడు, లేదా ఆ భావన ఏకాంతంలో నెమరేసుకున్నప్పుడు మాత్రమే అంతశ్చేతనలోంచి వెలువడగలమాటలు అవి. ముఖ్యంగా “స్వస్థానాన నేను నవ్వే మనిషిని”… ఇది పైకి చాలా prosaicగా కనిపించవచ్చు. కాని, మీద చెప్పినవన్నీ చదివినతర్వాత దీని విలువ ఎంతటిదో, దాని వెనక స్వస్థానం లో లేని మనిషి పడే ఆరాటం ఏమిటో అది అర్థాంతరన్యాసంగా భాసింపజేస్తుంది.
    మంచి కవిత్వం ఇవ్వగల ప్రేరణ ఆనందం ముందు అనువాదం లాంటివి ఎంత? మీరు ఇంకా మంచి కవితలు వ్రాయాలని ఆశిస్తూ,
    శుభాకాంక్షలతో,

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: