-
మా సరివి చెట్టు … తోరు దత్
(ఈరోజు తోరు దత్ 157వ జయంతి సందర్భంగా) గరుకు గరుకుగా, గంట్లుబడి మచ్చలుదేరిన మా సరివిచెట్టుని ఒక పెద్ద కొండచిలవలా, నక్షత్రాల పొలిమేరలదాకా పెనవేసుకుందొక లత. మరోచెట్టయితే దాని ధృతరాష్ట్రకౌగిలికి ఈపాటికి మరణించేది. రోజల్లా పులుగులకీ,తుమ్మెదలకీ ఆశ్రయమిస్తూ, ఈ మహాకాయిమాత్రం గొప్పగా మెడలో ధరించింది హారంలా. రాత్రిపూట మగాళ్ళంతా మంచినిద్రలో ఉన్నప్పుడు తోటల్లా తియ్యగా పరుచుకుంటూ సాగే ఈ చెట్టు మీది నల్లపిట్టపాటకి అంతుండదు. రోజూ ఉదయాన్నే నా గది కిటికీలు తెరవగానే ఆనందంతో…
-
ఒంటరిగా … వాల్టర్ డి ల మేర్
. కోకిల గూడు చిన్నబోయింది. విరిసిన మంచు, చలిగాలికి గడ్డకడుతోంది. నక్క తన మంచుబిలంలోంచి అరుస్తోంది… అయ్యో! నా ప్రేయసి నాకు దూరమయింది. నేనా ఒంటరిని… ఇది చూస్తే చలికాలం. . ఒకప్పుడు ఇవే నీర్కావి పూలు మత్తెక్కించేవి. ఆ నల్లతుమ్మెద ఎందుకో పువ్వును వదలి రావడం లేదు. అందాల్నివెదజల్లుతూ కాంతి దీప్తిమంతంగా ప్రసరిస్తోంది. నేనా ఒంటరిని… ఇది చూస్తే చలికాలం. . ఈ కొవ్వొత్తి నులివెచ్చని వేడిమినందిస్తోంది. ఆకాశంలో మృగశిర మృగయావినోదంలో ఉంది. ఇక చిమ్మటలు పట్టినా,…
-
సముద్రపొడ్డున … సారా టీజ్డేల్
. సముద్రపొడ్డున కూచోడమన్నా, ఈ మహానగరాలన్నా సుతిమెత్తని పూవుల సౌకుమార్యరహస్యమన్నా, సంగీతమన్నా, కవితరాస్తూ గడపడమన్నా నాకు చాలా ఇష్టం. ఆ క్షణాలు స్వర్గంలో తేలియాడినట్టుంటుంది. . మంచుమునిగిన కొండమీద పొడిచే తొలిచుక్కలన్నా జ్ఞానమూ, దయా ఆమ్రేడితమైన పెద్దల పలుకులన్నా, చిరకాలము నివురుగప్పినట్టుండి, చివరకి కలుసుకున్నచూపుల్లో తొణికిసలాడే ప్రేమన్నా ఇష్టమే. . నేను అమితంగా ప్రేమించాను, గాఢంగా ప్రేమించబడ్డాను కూడా. కాని, ఇపుడు జీవితం పై ఆశ సన్నగిలింది. దయచేసి నన్నీ నిశ్శబ్దానికీ, చీకటికీ విడిచిపెట్టండి అలసిపోయిన నేను, సంతోషంగా…
-
One Hysterectomy … Bolloju Baba
. Whatever reason they might offer They deracinated the tree That blossoms a sanguine-flower Every month. In the Anatomy Theatre Of civilised man The body of a woman Has always been a Guinea Pig. . Whatever be the reason, The cradle of man Which put up with two cuts earlier To give birth to a…
-
1819లో ఇంగ్లండు స్వరూపం … షెల్లీ, ఇంగ్లీషు కవి
. [ఈ కవిత చదువుతుంటే, ఇందులో పేర్కొన్న ప్రతి రాజ్యాంగ వ్యవస్థలోని భాగానికీ… సమాంతరంగా ఉన్న నేటి మన రాజకీయ వ్యవస్థ అచ్చం అలాగే పనిచేస్తున్నాదని ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. బలహీనమైన కేంద్రాన్ని బెదిరించి గడుపుకుంటున్నాయి చిన్న పార్టీలు. బ్రిటనులోపార్లమెంటు క్రమేపీ ప్రవేశపెట్టిన “Enclosure” చట్టాలద్వారా గ్రామాలలోని రైతులు భూమి హక్కులు కోల్పోయి, ముందు పాలెగాళ్ళుగాను తర్వాత రైతుకూలీలుగానూ మారినట్టు, ఈ రోజు భూసేకరణపేరుతో పంటభూములని కార్పొరేటు సంస్థలకు, తమ తాబేదార్లకూ అప్పనంగా అప్పచెబుతున్న ప్రభుత్వాలు, వ్యవసాయం గిట్టుబాటు…
-
నడిసముద్రంలో ఒక రాత్రి … హెర్మన్ హెస్
. రాత్రి, కడలి అలలఊయల ఊపుతున్నప్పుడు, మిణుకుమిణుకుమనే ఓ చుక్క మసకవెలుతురు దాని విశాలకెరటాలపై పరుచుకున్నప్పుడు, నా పనులన్నీ చక్కబెట్టుకుని బంధాలు విదుల్చుకుని ఒక్కడినీ, సడిచేయకుండా గుండెనిండాస్వచ్ఛమైన గాలిపీలుస్తూ వేలదీపాలప్రతిబింబాలతో, చల్లగా మౌనంగా సముద్రపుటుయ్యాలకి నన్నునేనప్పగించుకుని నిలుచుంటాను. అపుడు నా స్నేహితులు తలపులోకొస్తారు నా చూపులు వాళ్ళ చూపులలతో కలుసుకుంటాయి ఒకరివెంట ఒకరిని అడుగుతాను, ఏకాంతంగా, నెమ్మదిగా: “నీకు నేనంటే ఇంకా ఇష్టమేనా? నా కష్టం నీకు కష్టంగానూ, నా మృతి నీకు శోకించదగినదిగానూ కనిపిస్తాయా? నా ప్రేమలో…