-
చివరి కోరిక … రబీంద్రనాథ్ టాగోర్.
(విశ్వకవి రవీంద్రుని 151 వ జయంతి సందర్భంగా) . నన్ను ఇతరులు అడిగినవన్నీ, నే నివ్వలేకపోయాను. అంతమట్టుకు నాకు తెలుసు. నాకు ఎరికే… నే చేసిన మోసాలూ, తీర్చని ఋణాలూ, నెరవేర్చని పనులూ. ప్రపంచానికి నేను ఎంతో ఋణపడి ఉన్నాను. మరయితే, ఇప్పుడెందుకు ఇవన్నీ చెబుతున్నట్టు? సంధిపేలాపనా? పశ్చాత్తాపమా? కోరికతోనా? అవసరముకొద్దీనా? నేను ప్రపంచం నుండి కోరుకునేవి చాలానే ఉన్నాయి. మాటల్లోచెప్పలేని లాలసతో కోరుకుంటూనే ఉన్నాను. కోరికలు నెరవేరని నిస్పృహలో, అవసరాలు తీరని నిరాశలో, నేను శపిస్తుంటాను, ఏడుస్తుంటాను. .…
-
ముఖపరిచయం … హెన్రీ డేవిడ్ థొరో
. నాకో వ్యక్తి బాగా ముఖం పరిచయం, లోపాలేమీ కనిపించని వాడు. ఏడాదవుతుందో, లేదా కొంచెం ఎక్కువో రోజూ మా ఇంటి పక్కనుండే వెళుతుండేవాడు. అయితే అతనితో నే నెన్నెడూ మాటాడ లేదు. . ఓ సారి ఎందుకో మూడు మైళ్ళ దూరం వెళ్ళడం తటస్థించింది. అక్కడ అతను ఓ వీధిలో తారసపడ్డాడు. చేతికర్రతో సహా. అతన్ని నేనూ నన్ను అతనూ ఎగాదిగా చూసుకున్నాం చాలసేపు. . తర్వాత ఏదో దూరపుటూర్లో కనిపించాడు. అతని ముఖం చూడగానే అసంకల్పితంగా…
-
ఎర్రగులాబీతగిలించిన కోటు … S I Kishor
(శీల పరీక్ష (Test of Character) అంటారు దీన్నే. మనం కోరికకీ, విలువలకీ మధ్య సందిగ్ధంలో చిక్కుకున్నప్పుడు విలువలకి కట్టుబడుతూనో, లేక కోరికకి లొంగిపోయో మనం అమలుపరిచే నిర్ణయమే మన శీలాన్ని ఋజువుచేస్తుంది. అటువంటి అద్భుతమైన సమస్యని చిన్న ఇతివృత్తంలో ఆవిష్కరించాడీ కథానిక రచయిత. దురదృష్టవశాత్తూ ఈ రచయితగురించి ఏ సమాచారమూ నేను సంపాదించలేకపోయాను. ఎవరైనా అందించగలిగితే ఎంతో ఋణపడి ఉంటాను. ) . జాన్ బ్లాం షార్డ్ బెంచీమీంచి లేచి నిలుచున్నాడు. తన యూనిపారం ఒకసారి…
-
ఆత్మవిశ్వాసం… లేయాన్ ఫెలిపె, స్పానిష్ కవి
(ఆధునిక స్పానిష్ సాహిత్యం లో ఒక ప్రముఖ కవిగా గుర్తింపు పొందిన ఫెలిపె, ఫార్మసీ చదివి, తండ్రి ఆనందం కోసం కొంతకాలం ఫార్మసిస్టుగా పనిచేసినా, సాహిత్యం పట్ల ఉన్న వ్యామోహం కొద్దీ, సంచార నాటకబృందంలో జేరితే, బాధ్యతా రహితంగా ప్రవర్తించి వ్యాపారం నష్టపరచినందుకు రెండేళ్ళు కారాగార శిక్ష అనుభవించేడు. 1936-39 మధ్య స్పానిష్ సివిల్ వార్ లో రిపబ్లికనుల తరపున పోరాడేడు. 1938 లో స్వయంగా దేశం వదిలి మెక్సికోలో జీవితాంతం ప్రవాసజీవితం గడిపేడు. చే గెవాడా…
-
ఉచితంగా… ఓర్హాన్ వేలీ కణిక్, టర్కీ కవి
(నిరలంకారంగా కనిపిస్తున్న ఈ మాటల వెనక, కవి పేదరికాన్నీ, దుర్భరమైపోయిన జీవితాన్నీ, స్వేఛ్ఛాప్రియత్వాన్నీ, జీవించగల అదృష్టాన్నీ ఎంత గాఢంగా, నిగూఢంగా చెప్పాడో గమనించండి. “కారు బయట” అన్న మాట, కారులో కూర్చోవాలంటే ఖర్చు అని పరోక్షంగా సూచించడానికీ, దుకాణాల కిటికీలు విండో షాపింగ్ కీ, ఇందులో పేర్కొన్న ప్రకృతి ప్రసాదించే వనరులుతప్ప ప్రతీదీ ఖరీదైనదే అని సూచిస్తూ, వ్యంగ్యంగా చెప్పాడు.) . మనం స్వేఛ్చగా బ్రతికేస్తున్నాం. గాలి ఉచితం, మేఘాలు ఉచితం, ఈ కొండలూ, లోయలూ ఉచితమే. వర్షం ఉచితం,…
-
The Cultivator … Duvvoori Ramireddy (Part 1)
The name of Kavikokila Duvvoori Ramireddy strikes a chord in the old generation recalling his translation of Omar Khayyam’s Rubaiyat as “Panasala”. Besides being prolific in Arabic, Sanskrit, Telugu and English, he had published 4 volumes of poetry and a number of articles on folklore. In his book “Krishivaludu” (The Cultivator), Sri Reddy describes the…
-
నాకు శాంతి లభించలేదు … Sir Thomas Wyatt
[చిత్రంగా ఈ కవిత ప్రేమ కవిత్వమైనా, ఇది జీవుడి ఆత్మవేదనకి కూడ సరిగా సరిపోతుంది. మన జీవితం లో ఎన్నో సందర్భాలలో మనం అచ్చం ఇలాగే ఫీల్ అవుతాం. మనకి ఇష్టమైన వస్తువులూ, వ్యక్తులే ఒక్కోసారి మన కష్టాలకీ/ మనోవ్యధకీ కారణం కావడం విధి చిత్రంలా అగుపించక మానదు.] . నాకు శాంతిలభించలేదు… నా పోరాటాలు సమసిపోయాయి భయంతోనే ఆశా ఉంది;జ్వలిస్తూనే మంచులా ఘనీభవిస్తున్నా ఎంతో ఎత్తులకిఎగురుతున్నా, నా అంత నేను లేవలేకపోతున్నా నా దగ్గర ఏమీ…