
ఎర్రగులాబీతగిలించిన కోటు … S I Kishor

“ఒక యువతి నా వైపు నడుచుకుంటూ వస్తోంది … సన్నగా పొడుగ్గా ఉంది. ఆమె సొగసైనజుత్తు రింగులుతిరిగి నాజూకైన చెవులమీదనుండి వెనక్కి పడుతోంది; ఆమె కళ్ళు పువ్వుల్లా నీలంగా ఉన్నాయి. ఆమె పెదాలలోనూ, చిబుకంలోనూ, మృదుత్వంతో పాటు ధృడత్వం కనిపిస్తోంది; తను ధరించిన లేతాకుపచ్చరంగు సూటులో వసంతానికి ప్రతిరూపంలా అనిపించింది. నేనామె వైపు వెళ్ళబోయాను, ఆమె కోటుకి గులాబీపువ్వులేదన్న సంగతి పూర్తిగా మరిచిపోయి. నేను అటు కదలగానే, ఆమె పెదాలమీద ఒక సన్నని చిరునవ్వు, కవ్విస్తూ తారాడింది. “నా దారిలోకి వచ్చెస్తున్నావు, నావికుడా” అని మెత్తగా హెచ్చరించింది. ఇక నిగ్రహించుకోలేక ఆమె వైపు ఒక అడుగువేశాను. అంతే! సరిగ్గా అప్పుడు నాకు కనిపించింది… హోలిస్ మే నెల్!! ఆమె ఈ అమ్మాయికి వెనకే నిలుచుంది. మేనెల్ కి నలభై ఏళ్ళు దాటే ఉంటాయి. తెల్లబడుతున్న ఆమె జుట్టుని, తన మాసిపోయిన టోపీక్రింద అదిమిఉంచింది. ఆమెది స్థూలకాయమనే చెప్పాలి. బలిష్ఠంగాఉన్న ఆమెపాదాలు మడమలేనిజోళ్ళలోకి దూర్చిఉన్నాయి. ఆ ఆకుపచ్చరంగు సూటు తొడుక్కున్న అమ్మాయి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది. నన్నెవరో రెండుగా చీల్చినట్లనిపించింది. ఒకప్రక్క ఆ అమ్మాయి వెనక వెళదామా అని ఎంత గాఢంగా అనిపించిందో, రెండోప్రక్క తనస్ఫూర్తితో నన్నునిలిపి నాకు తోడుగానిలిచిన ఆమెతో ఉండాలని అంతగాఢంగానూ అనిపించింది. అమె అక్కడే నిలబడి ఉంది. ఆరోగ్యవంతమైన ఆమె ముఖం వాడినట్లున్నా, ఆమె ముఖంలో ఏదో ప్రశాంతత, ఆవేదన కనిపిస్తున్నాయి; తెల్లని ఆ కళ్ళు ఆర్ద్రతతో, అనురాగంతో మెరుస్తున్నాయి.
“నేనింక సంకోచించలేదు. ఆమె నన్నుగుర్తుపట్టడానికి వీలుగా పాలిపోయిన నీలిరంగుఅట్టవేసినపుస్తకాన్ని చేతుల్లో గట్టిగా పట్టుకున్నాను. ఇదిప్రేమ కాకపోవచ్చు… కాని అంతకంటే అమూల్యమైనది, బహుశా, ప్రేమకంటేకూడా గొప్పదైన ఒక స్నేహం… దానికి నేను ఎల్లప్పుడూ ఋణపడిఉంటాను. నేను నిటారుగా నిలుచుని, ఆమెకు అభివాదంచేసి, గుర్తుగా ఆమెకి పుస్తకం చూపిస్తూ, అమెతో మాట్లాడుతున్నప్పుడు కొంత అసంతృప్తితో నా గొంతుబొంగురుపోయినా, “నా పేరు బ్లాం షార్డ్. మీరు తప్పకుండ మిస్ హోలిస్ మేనెల్ అయి ఉంటారు. మిమ్మల్ని కలిసినందుకు నాకు మహదానందంగా ఉంది. మిమ్మల్ని నాతో డిన్నర్ కి తీసుకి వెళ్ళొచ్చా?” అన్నాను. శాంతమైన నవ్వుతో ఆమె ముఖం విప్పారింది. “ఈ వ్యవహారం ఏమిటో నాకు తెలియదు, నాయనా! అదిగో, ఆ వెళ్ళిపోతున్న లేత ఆకుపచ్చ రంగు కోటువేసుకున్న అమ్మాయి,” అమె చెబుతోంది, “నన్ను ఈ గులాబీని నాకోటుకి తగిలించుకోమని చెప్పింది. నువ్వుగాని నన్ను డిన్నరుకి ఆహ్వానిస్తే, అదిగో రోడ్డుకి అవతలపక్కనున్న పెద్ద రెస్టరాంట్ లో నీ కోసం నిరీక్షిస్తున్నట్టు చెప్పమంది. ఇది ఒక రకమైన పరీక్ష అని మాత్రం చెప్పింది.””
The Rose Lapel
4 responses to “ఎర్రగులాబీతగిలించిన కోటు … S I Kishor”
-
చిన్నప్పుడు హైస్కూల్లో మాకీ కథ ఇంగ్లీషు వాచకంలో ఉండేది. “The test of true love” పేరుతో.. Mark Twain రాసిన కథ అన్నట్టు గుర్తు. But, I’m not sure about it.
అప్పట్లోనే నాకీ కథ భలే నచ్చేసింది. అందుకే బాగా గుర్తుండిపోయింది. 🙂మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Thank you Madhuravani. I will search for the story and make correction about the true author. But this story was very popular in the mails and was widely circulated during early days of internet boom without the name of the author.
Thank you once again.
with best wishesమెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
ప్రేమకి రూపం తో సంబంధం లేదని, గులాబీ పువ్వు ధరించిన వారిని ప్రేమించ గలిగితే తననూ, అందరిని అంతగా ప్రేమించగలడని… గొప్ప సందేశం. గొప్ప అనువాదం. I like it
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
Sarmagaru,
It is said that ‘beauty is skin deep but, character is soul deep’. People who are attracted by character, like the hero and heroine of this story, can retain their relation/ love for each other, than people who are attracted by mere beauty of the skin. There are scores of poems and stories and sayings speaking about the ephemerality of bodily beauty… particularly the youthfulness. But this idea can be cultivated over a period and cannot be instilled in a moment. That is where the family culture plays a pert. This is more relevant now.
with best regardsమెచ్చుకోండిమెచ్చుకోండి
-
స్పందించండి