అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • జూన్ 17, 2012

    సుఖమయ జీవితానికి ఆనవాళ్ళు … సర్ హెన్రీ వాటన్

    . స్వతంత్రుడుగా పుట్టినవాడుగాని, బానిసగా బతకకూడదని నేర్చినవాడుగాని ఎంత సుఖంగా ఉంటాడో గదా! నైతికవర్తనే అతని కవచం; సత్యమే నైపుణ్యం. ఆవేశాలు అతన్ని శాసించలేవు మృత్యువంటే అతనికి భయమూ ఉండదు; కీర్తి ప్రతిష్టల లాలసగాని, స్వంత ఆస్థుల లౌల్యం గాని అతన్ని కట్టిపడెయ్యవు అదృష్టం అందలమెక్కించినవాళ్ళనుచూసి అసూయ ఉండదు; వ్యసనాల ఊసు లేదు; పొగడ్తలతో మానని గాయాలు చెయ్యడం తెలియదు; సద్వర్తనమే తప్ప, చట్టాల నిబంధనలు తెలియవు. పుకార్లకి దూరంగా ఉంటాడు ప్రశాంత చిత్తమే అతని బలమైన…

  • జూన్ 16, 2012

    మనిషి… సర్ జాన్ డేవీస్

    . నాకు తెలుసు ఈ జీవికి అన్నీ తెలుసుకోగల సమర్థత ఉందని, కానీ, అది అన్ని విషయాలలోనూ గుడ్డిగానూ, అవివేకంగానే ప్రవర్తిస్తుంది. నాకు తెలుసు, ప్రకృతి ముద్దుబిడ్డల్లో నేనూ ఒకడినని కానీ, ఎప్పుడూ తుఛ్ఛమైన విషయాలకే బానిసనవుతుంటాను. . నా జీవితం బాధామయమనీ, కానీ క్షణికమనీ తెలుసు; నా ఇంద్రియాలు నన్ను అన్నివిషయాలలోనూ వంచిస్తాయనీ తెలుసు; చివరగా, నేను మనిషినని కూడ నాకు తెలుసు— అది గర్వకారణమే కాదు, దౌర్భాగ్యం కూడా. . సర్ జాన్ డేవీస్ (16…

  • జూన్ 15, 2012

    మంచుకురుస్తున్న సాయంత్రం… ఊరికి దూరంగా… రాబర్ట్ ప్రాస్ట్.

    . ఈ కళ్ళాలు* ఎవరివో నాకుతెలుసుననుకుంటున్నాను, అయితే, అతని ఇల్లుమాత్రం ఊర్లోనే ఉంది; అతను నేనిక్కడ ఆగడంగాని, అతని తోటనిండా మంచు పరుచుకోడం గాని చూడలేడు. ఈ ఏడాదిలోనే ఇంతచీకటి ఎరుగని సాయంత్రవేళ గడ్డకట్టుకుపోయిన సరస్సుకీ ఈ కళ్ళాలకీ మధ్య ఏ ఖండ్రికా లేనిచోట ఆగిపోవడం నా చిన్ని గుర్రానికి వింతగా తోచవచ్చు దాని జీరాకి తగిలించిన చిరుగంటలు ఒకసారి మోగిస్తూ సంజ్ఞచేసింది పొరపాటున ఆగలేదుగదా అన్నట్టు. ఇక్కడ వినిపిస్తున్న ఇతర శబ్దమేదైనా ఉందంటే, అది చల్లగా వీస్తున్న గాలిదీ,…

  • జూన్ 14, 2012

    Driftwood… Sara Teasdale

    . కొట్టుమిట్టాడుతున్న నా ఆత్మజ్యోతికి ఒక ఆకారాన్నీ, ఒక హృదయాన్నీ, ఒక పేరునీ ఇచ్చింది నా తాతముత్తాతలే గాని నిలకడలేని ఆ దీపకళికకి ఇంద్రధనుసు వన్నెలనద్దింది మాత్రం నా ప్రేమికులే… రగుల్తున్న బల్లచెక్క తన రతనాలవెలుగులను సముద్రంమీద దిక్కులేక కొట్టుకొస్తున్నప్పుడు, నీలి అలల దీప్తులనుండీ, రంగురంగుల రేయింబవళ్ళనుండీ నేర్చుకున్నట్టు. సారా టీజ్డేల్ . Driftwood . My forefathers gave me My spirit’s shaken flame, The shape of hands, the beat of…

  • జూన్ 13, 2012

    సుద్దులు … ఫాతిమా అల్ మతార్, కువైటీ కవయిత్రి

    నీళ్ళు ఎలా సంతోషంగా ముందు కూజా ఆకారంలోకి ఒదిగిపోతాయో, మరు నిమిషంలోనే మంచినీళ్ళ గ్లాసులా ఎలా మారగలుగుతాయో ఆమె తన మనసుకి ప్రదర్శించింది; ఆమెకి తెలుసు వేడి టీ కప్పులో పంచదారని సాత్త్వికంగా కలిపినా, మోటుగా కలిపినా, త్వరత్వరగాకలిపినా, నెమ్మదిగాకలిపినా ఇష్టపూర్వకంగానే  కరిగిపోతుందని; ఒక టులిప్ దుంప ఎక్కడ పాతితే అక్కడే మొలిచి, శ్రద్ధగా పెకలించి మరొక తోటలోకి తీసుకెళ్ళి పాతితే, అక్కడకూడ అంత బాగానూ పెరిగి, అభివృధ్ధిచెందుతుందనీ తెలుసు; ఆమె అయిష్టంగా ఉన్న తనమనసుకి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది: పలుపుతాడుతో…

  • జూన్ 12, 2012

    అనుభూతి … రింబో, ఫ్రెంచి కవి

    . వేసవి వినిర్మల సాయంత్రపువేళలో, నీలాకాశం దిగువన అలా కాలిబాటల్లో  లే పచ్చికమీంచి నడుచుకుంటూ పోతుంటాను వరికంకులు గుచ్చుకుంటుంటాయి, నా కాళ్ళక్రింద ఆ చల్లదనాన్ని ఏదో కలలోలా, అనుభూతిచెందుతాను. రక్షణలేని నా శిరసుమీదినుండి చిరుగాలి ఒరుసుకుని పోనిస్తూ…   నేనేం మాటాడను… ఏ ఆలోచననీ దరి రానీయను… అంతులేని ప్రేమతో నా ఆత్మ నిండిపోతుంది.  నే నెక్కడెక్కడికో పల్లెసీమలవెంట దేశద్రిమ్మరిలా తిరుగాడుతుంటాను…  నాకిపుడు ఎంత ఆనందంగా ఉందంటే…  చెంత నా సహచరి ఉందేమోన్నంత.   . రింబో ఫ్రెంచి కవి…

  • జూన్ 11, 2012

    నాకు పూలంటే ఇష్టం లేదు … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి

    నాకు పూలంటే ఇష్టం లేదు… అవి ఎప్పుడూ విందుభోజనాలనీ, నాట్యశాలల్నీ, పెళ్ళిళ్ళనీ శవయాత్రలనీ గుర్తుచేస్తుంటాయి. కానీ, చిన్నప్పుడు నాకు ఊరటగా నిల్చిన నశ్వరమైన గులాబీల నిత్య నూతన సౌందర్య శోభ ఇన్ని సంవత్సరాలూ నాలో నిలిచిపోయింది…వారసత్వంలా… మోచాత్ అజరామర సంగీతం గొంతులో కూనిరాగాలు తీసినట్టు. . అనా అఖ్మతోవా (జూన్ 23, 1889 – మార్చి 5,  1966) సోవియట్ రష్యను కవయిత్రి . (ఈ కవితలో ఆవేదన పూలంటే నిజంగా ఇష్టం లేకపోవడం కాదు. వాటిని…

  • జూన్ 10, 2012

    నవ్వే హృదయం … ఛార్ల్స్ బ్యుకోవ్స్కీ

    నీ జీవితం నీది. దాన్ని ఒకరికి దాసోహం అనేలా తొక్కిపెట్టకు. అప్రమత్తంగా ఉండు మార్గాంతరాలు లేకపోలేదు. ఎక్కడో ఒకచోటునుండి చిన్నవెలుతురు కనిపించకపోదు అదేమంత పెద్ద వెలుగుకాకపోవచ్చు గాని, చీకటిని హరించడానికి సరిపోతుంది కనుక అప్రమత్తంగా ఉండు దైవం నీకు అవకాశాలు కల్పిస్తూనే ఉంటుంది. అవితెలుసుకో. వాటిని అందుకో. నువ్వు మృత్యువునయితే జయించలేకపోవచ్చు గాని, అప్పుడప్పుడు జీవితంపై కలిగే నిరాసక్తతని మాత్రం జయించగలవు. ఇది నువ్వు ఎంత ఎక్కువ నేర్చుకుంటుంటావో, నీకు అంత ఎక్కువ వెలుగు కనిపిస్తుంటుంది. నీ జీవితం…

  • జూన్ 9, 2012

    నోటెర్ డాం చర్చిలో నల్ల యువతి … రాబర్ట్ విలియం సెర్విస్.

    ఈ రోజు నేను చర్చిలో ప్రార్థనకి హాజరైనపుడు, ఒక నల్లజాతి యువతి నా ప్రక్కన కూర్చుంది. ఆమె మోకాలిపై ప్రణమిల్లి ప్రార్థనచేసిన తీరు ఎంతో ముచ్చటవేసింది. దయాళువూ, శక్తిమంతుడూ అయిన భగవంతుడున్నాడో లేడో గాని, అతనిపట్ల ప్రకటించే ప్రేమ మట్టిపెళ్ళనిసైతం వెలుగుచిందేలా చేస్తుంది. నాకు రెండోవైపున గంజిపెట్టిన బట్టలేసుకుని కూర్చున్న అహంకారం తొణికిసలాడుతున్న యువతి నాతో ఇలా అంది: “ఆర్యా! ఇలాంటి విషయాలు కొనసాగనివ్వడం అమర్యాదకాదూ? మా వైపు, ఈ నీగ్రోలని ఎక్కడ ఎలా ఉంచాలో బాగా తెలుసునని…

  • జూన్ 8, 2012

    Death Adrift … Bhavani Phani

    (This is one of the most touching poems I have read on the net of late. This is an address to Death by a little child, perhaps a terminal case. The Telugu knowing readers are advised not to read the English translation and stay content with the original provided.) . You are not my pal,…

←మునుపటి పుట
1 … 217 218 219 220 221 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు