-
జీవన శాఖి … తోరు దత్, భారతీయ కవయిత్రి.
పట్ట పగలే. కానీ, ఏదో తెలియని అలసట! నా కళ్ళు మూసుకునే ఉన్నాను గాని నిద్రపోలేదు, నా చెయ్యి మా నాన్నగారి చేతిలో ఉంది, నాకు అతను నా దగ్గరే కూర్చున్నట్టు తెలుస్తోంది. అలా గంటలకి గంటలు మేమిద్దరం మౌనంగా ఎన్నిసార్లు గడిపామో లెక్కలేదు. ఒకరి మనసులో కలిగిన భావాలు రెండో వాళ్ళకి తెలుస్తూ, ప్రతి గుండెచప్పుడూ కాలాన్ని కొలుస్తున్నప్పుడు అసలు మాటాడవలసిన పనేముంది? నేను మేలుకునే ఉన్నాను: ఎదురుగా విశాలమైన మైదానం అబ్బ! కనుచూపుమేర అనంతంగా…
-
బస్సు ప్రయాణం … Arun Kolatkar
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులో కిటికీలకి టార్పాలిన్లు గుండీలతో బిగించి ఉన్నాయి. జెజూరీ వెళ్ళీదాకా చలిగాలి ఆ టార్పాలిన్ అంచుని మోచెయ్యి దగ్గర టపటపా కొడుతూనే ఉంటుంది . సర్రున సాగిపోతున్న రోడ్డువైపు చూస్తావు బయటకు పడుతున్న సన్నని బస్సువెలుతురులో ఉషోదయపు ఛాయలకై వెదుకుతావు ఎదురుగా కూర్చున్న ముసలతని కళ్ళజోడులో రెండుముక్కలైన నీ ప్రతిబింబమొక్కటే నువ్వు చూడగల్గిన గ్రామీణ చిత్రం . అతని ముక్కుమీదనున్న నామానికి దూరంగా ఎక్కడో తెలియని గమ్యం వైపు నువ్వు నిరంతరం ప్రయాణిస్తున్నట్టు…
-
గోడ మీది ముఖం… EV Lucas
నిన్న సాయంత్రం డబ్నీ వాళ్లింటిదగ్గర పార్టీలో మేమందరం మాట్లాడుకుంటున్నప్పుడు మా సంభాషణ ప్రకృతిసిధ్ధమైన కారణాలతో మనం సమాధానంచెప్పలేని సంఘటనలపైకి మళ్ళింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క అనుభవం చెప్పేరుగాని ఏవీ అంతబాగా రక్తి కట్టలేదు. నాకు అపరిచితుల్లో ఒక పొట్టిమనిషి ఉన్నాడు… కుతూహలమైన చూపులూ అతనూ. ప్రతివాళ్ళనీ వాళ్ళు చెబుతున్నంతసేపూ ఎంతో శ్రద్ధగా విని ఆశక్తిగా గమనించేడు గానీ ఏ వ్యాఖ్యానమూ చెయ్యలేదు. చివరకి, అతన్ని కూడా సంభాషణలో భాగస్వామిని చెయ్యడానికి డబ్నీ అతనివైపు తిరిగి “మీకు మాతో పంచుకుందికి…
-
భారతీయ స్త్రీలు… Shiv K Kumar, Indian Poet
. ముమ్మారు వేగిన శీలవతులైన స్త్రీలు మట్టిగోడలపై కోపాన్ని ప్రకటించే కనుబొమల్ని చెక్కరు ఊరిబావి గట్టుమీది ఖాళీ కుండల్లా ఓపికగా మిస్సిసిపీ నదంత పొడవైన సిగపాయలలో ఒక్కొక్క అల్లికలోనూ ఆశలు పేనుకుంటూ నీటిలో తమ నీడలు చూసుకుంటారు తమ కళ్ళలోని చెమ్మకై వెదుకుతూ. ఇసుకలో కాలిబొటనవేలితో ఆశల ఆకాశాల్ని చిత్రించుకుంటూ మనసులోని పరివేదనల్ని అణుచుకుంటుంటారు తమ భర్తల రాకకై ఎదురుచూస్తూ… ఒక పక్క, పొద్దు మడతపెడుతున్న తమ నీడలు దూరాన కొండలపై అంతరిస్తున్నా సరే. . షివ్…
-
తేలుకుట్టిన రాత్రి… నిస్సిం ఎజకీల్, భారతీయ కవి
. మా అమ్మని తేలు కుట్టిన ఆ రాత్రి నాకు బాగా గుర్తుంది. పది గంటలపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం తేలుని బియ్యపుబస్తా క్రిందకి వెళ్ళేలా చేసింది. చీకటిగదిలో ఒక్కసారి తోక జాడించి, తోకకున్న విషం ఎక్కించి మళ్ళీ వర్షంలోకి పారిపోయింది. రైతులందరూ ఈగల్లా మూగిపోయేరు వందసార్లు భగవన్నామ జపం చేసేరు ఆ తేలు ఎక్కడుంటే అక్కడ ఆగిపోడానికి. కొవ్వొత్తులూ, లాంతర్లూ మన్ను మెత్తిన గోడలమీద పేద్ద తేలులాంటి నీడలు కదులుతుండగా దానికోసం వెతికేరు గాని, లాభం…
-
The Ultimate Survivor … Vinnakota Ravi Sankar, Indian Poet
. Gradually Life becomes a reconciliation to death. Instead of pigeons, now Lapwings carry messages. The smiling faces of the childhood group-photo leave one by one searching for their own. Not only the actors, even the audience recede one after another. There will be nobody left on either side, to share tears for the tragedy…
-
Android … Kiran Gali
. I need some pain. a pain that can squeeze my heart dry Honestly! There is no catch here, nor an ounce of exaggeration. . For, somehow, I became immune and turned mechanical and exiled myself from me. There are no longer any sleepless nights, haunting memories, or, burning passions. Nor have I the faith…
-
Pablo Neruda
. మిధ్యగా కనిపిస్తున్న ఈ బహుళంలో, అన్ని ఆకులూ … ఈ ఆకే అన్ని రేకులూ… ఈ పువ్వే. అన్ని పళ్ళూ ఒక పండే అన్ని చెట్లూ ఒక చెట్టే ఒక్క పువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించగలదు. పావ్లో నెరూడా (పైకి ఎంతో సరళంగా కనిపిస్తున్న ఈ కవితలో, గొప్ప తాత్త్విక సత్యం ఉంది. నిజానికి అన్ని రూపాలలో కనిపిస్తున్న పువ్వైనా, ఆకైనా, అవి ఒక్కటే. ఆ ఒక్కటీ మిగతావాటికన్నిటికీ ప్రాతినిధ్యం…
-
నాన్నంటే… అజ్ఞాత కవి.
. భగవంతుడు మహా పర్వతాల పటుత్వాన్నీ మహా వృక్షాల ఔన్నత్యాన్నీ వేసవి సూర్యుడి వేడిమినీ మహాసముద్రాల ప్రశాంతతనీ విశ్వాత్మ ఔదార్యశీలతనీ నిర్భీతిగా నిదురపుచ్చే రేయి నెమ్మి హస్తాన్నీ గతకాలాల విజ్ఞతనీ గరుడుడి వియద్విహార శక్తినీ వాసంత ప్రభాతపు ఆనంద హేలనీ ఆవగింజ మొక్కవోని ఆత్మస్థైర్యాన్ని అనంతమైన సహనాన్నీ సంసారమంత గంభీరమైన అవసరాల్నీ ఎంచెంచి ఏర్చి ఈ లక్షణాలన్నీ కలగలిపి ఇంకేమీ అవసరంలేకపోవడంతో తను ఊహించిన అత్యుత్తమ ఆకృతి అతనికి పూర్తయిందని దానికి తండ్రి అని నామకరణం చేశాడు.…
-
పిచ్చుకలు… K A Abbas
. రహీం ఖాన్ పొలం నుండి ఇంటికి తిరిగుముఖంపట్టే వేళకి ఊరికి పడమర పొలిమేరలోనున్న మామిడి తోటలో సూర్యుడు అస్తమిస్తున్నాడు. యాభయ్యవపడిలో పడినప్పటికీ విశాలమైనఛాతీతో బలంగా, ధృడంగా ఉండి, భుజంమీద నాగలి వేసుకుని, తన రెండెడ్లనూ తోలుకుంటూ గ్రామం ప్రధానవీధిలోంచి నడుస్తున్నాడు. అతని వాలకం చూస్తే చాలా కోపంతో ఆవేశంతో ఉన్నట్టు తోస్తుంది. అతను నాలుగురోడ్ల కూడలికి వచ్చేసరికి, అంతవరకూ రోజూ సాయంకాలం తమ దమ్ము వేసుకోడానికి అక్కడికివచ్చే పది, పదిహేనుమంది రైతుల పరాచికాలతో ఆహ్లాదంగాఉన్న వాతావరణం ఒక్కసారి…