The Ultimate Survivor … Vinnakota Ravi Sankar, Indian Poet

.

Gradually
Life becomes
a reconciliation to death.
Instead of pigeons, now
Lapwings carry messages.

The smiling faces
of the childhood group-photo
leave one by one
searching for their own.

Not only the actors,
even the audience recede
one after another.
There will be nobody left
on either side,
to share tears
for the tragedy on the stage.

Besides shedding its leaves,
The deciduous Family Tree
sheds its roots as well
intermittently.

After all tangles are disentangled
and all strings are snapped,
a wizened spiritless frame remains
like the sole thread
connecting it to the Nature.
.

Photo Courtesy: Vinnakota Ravi Sankar

Vinnakota Ravi Sankar

Mr. Vinnakota Ravi Sankar is living in Columbia, South Carolina, USA for the last 14 years. He has to his credit three collections of poetry in Telugu published so far — kuMDeelO marri ceTTu (The Bunyan in a Flowerpot) (1993), vEsavi vaana(Summer Rain) (2002) & remDO paatra (The Second Role)(2010).

.

తెలుగు మూలం:

ఆఖరి మనిషి
.

క్రమక్రమంగా
మరణానికి అలవాటుపడటమే
జీవితంగా మారిపోతుంది.
పావురాలకి బదులు తీతువు పిట్టలు
ఉత్తరాలు మోసుకువస్తాయి.

చిన్నప్పటి గ్రూప్ఫోటోలో
చిరునవ్వులు చిందించినవారంతా
ఎవరి ఫొటో వారు వెతుక్కుని
వెళ్ళిపోతారు

నటులేకాదు, ప్రేక్షకులు కూడా
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
రంగస్థలం మీది విషాదానికి
కలిసి కన్నీరు పెట్టటానికి
ఇరువైపులా ఎవరూ కనబడరు

ఆకులతోబాటు
ఈ “సంసారవృక్షం”
వేళ్ళు కూడా ఒకటొకటిగా
పోగొట్టుకుంటుంది

అన్ని ముడులూ విడిపోయాక
అన్ని తీగలూ తెగిపోయాక
ప్రపంచంతో కలిపే ఏకైక సూత్రంలా
శుష్కించిన ఒక శరీరం
మిగిలిపోతుంది.

.

విన్నకోట రవిశంకర్

“The Ultimate Survivor … Vinnakota Ravi Sankar, Indian Poet” కి 8 స్పందనలు

    1. Bhaskar garu,
      Thank you.
      with best regards

      మెచ్చుకోండి

  1. చాలా బాగుంది. సంసార వృక్షం అన్నదాన్ని The deciduous family tree అని అభివర్ణించడం మరీబాగుంది.

    మెచ్చుకోండి

  2. గోపాలకృష్ణగారూ,
    అసలు సంసారవృక్షం ఆకులు రాల్చే చెట్తుగా వర్ణించడం లో విన్నకోట రవిశంకర్ గారి కవితా శక్తి ఉంది. అంతే కాదు ఆయన “వేళ్ళు కూడా రాలుస్తున్నాదని” మరికొంత సౌందర్యం చేకూర్చారు.
    అభివాదములతో

    మెచ్చుకోండి

  3. కర్లపాలెం హనుమంత రావు Avatar
    కర్లపాలెం హనుమంత రావు

    పోగొట్టుకోవడంలోని సంపూర్ణతను విన్నకోట వారు దృశ్యమానం చేయించిన తీరు..భౌతిక జీవితంలోని అల్పత్వాన్ని కళ్ళకు కట్టించింది. నటులేకాదు, ప్రేక్షకులు కూడా
    ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
    రంగస్థలం మీది విషాదానికి
    కలిసి కన్నీరు పెట్టటానికి
    ఇరువైపులా ఎవరూ కనబడరు- నిజమే!మనిషిని చరిత్ర కిందకి మార్చే అంతిమ సత్యమ్ ఇదే కదా!

    మెచ్చుకోండి

  4. హనుమంతరావు గారూ,
    నాకు ఈ పద్యం లోని చమత్కారం, పోలిక, సహజత్వం సంసార వృక్షాన్ని ఆకులు రాల్చే చెట్టుతో పోల్చడం. అందులో ఇంకొక యదార్థం కూడ ఉంది, ఇది ఒక కుటుంబం లో తోబుట్టువులందరూ పోగా చివరకి మిగిలిపోయిన వ్యక్తి మనసులోని బాధను ఆవిష్కరిస్తుంది. (ఆ బాధ మా నాన్నగారి కళ్లలో చూసేను. తన ఆఖరిచెల్లెలుకూడా పోయి తను మిగిలిపోయినప్పటి బాధ. ఆ తర్వాత సంవత్సరం తిరక్కుండానే పోయారనుకొండి. అదివేరే సంగతి. )ఒక రకంగా వాళ్లకి ఇది ఒక ఎలిజీ అనుకోవచ్చు. మంచి భావగంబీరమైన కవిత. కాకతాళీయంగా “ఈమాట” వెబ్ పత్రికలో చదవగానే నచ్చింది. విన్నకోట రవిశంకర్ గారిని సంప్రదించడం జరిగింది.
    అభివాదములతో

    మెచ్చుకోండి

  5. There will be nobody left
    on either side,
    to share tears
    for the tragedy on the stage.

    oh what a rendering sir.

    గంభీరమైన భావన గువ్వలా గుప్పెడు మాటల్లో ఒదిగిపోయింది.
    విన్నకోటగారి కవిత్వం చిక్కగా, జీవన సౌందర్యాలను ఆవిష్కరిస్తుంది.

    ఒక సారి ఆయనను కలసినపుడు
    కవిత్వం లో అస్ఫష్టతగురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినపుడు (ఆయనెంత స్పష్టంగా, లోతుగా రాస్తారో తెలుసుకనుక) — అస్పష్టత కూడా ఒక అనుభూతే కనుక, అనుభూతిని కలిగించేదేదైనా కవిత్వమే అని జవాబిచ్చి- కవిత్వానికి నేనిచ్చుకొనే నిర్వచనాన్ని మార్చుకొనేలా చేసారు. i still remember and love that meeting sir

    bolloju baba

    మెచ్చుకోండి

  6. Hello Ravi shanker garu
    Today morning
    I read this poem
    It is good .
    Yours ” rendo patra” anthology is
    Simply superb.
    Zimbo
    Camp at Baltimore

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: