Pablo Neruda

 

.

 

మిధ్యగా కనిపిస్తున్న ఈ బహుళంలో,
అన్ని ఆకులూ … ఈ ఆకే
అన్ని రేకులూ… ఈ పువ్వే.
అన్ని పళ్ళూ ఒక పండే
అన్ని చెట్లూ ఒక చెట్టే
ఒక్క పువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించగలదు. 

 

పావ్లో నెరూడా

 

(పైకి ఎంతో సరళంగా కనిపిస్తున్న ఈ కవితలో, గొప్ప తాత్త్విక సత్యం ఉంది. నిజానికి అన్ని రూపాలలో కనిపిస్తున్న పువ్వైనా, ఆకైనా, అవి ఒక్కటే. ఆ ఒక్కటీ మిగతావాటికన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తోంది.  ఒక్క పువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించగలదనడంలో, ఆశావహ దృక్పథమే కాదు, మానవతప్పిదాల వల్ల సృష్టిలో కొంత వినాశం జరిగినా, తిరిగి పుంజుకోగలదు అన్న భావన ఉంది అందులో.)

 

 

Pablo Neruda (1956)
Pablo Neruda (1956) (Photo credit: Wikipedia)

 

.

 

All leaves are this leaf,

 

all petals, this flower

 

in a lie of abundance.

 

All fruit is the same,

 

the trees are only one tree

 

and one flower sustains all the earth.

 

(“Unity,” from Manual Metaphysics by Pablo Neruda; trans. by Ben Belitt)

 

Pablo Neruda

 

 

“Pablo Neruda” కి 14 స్పందనలు

  1. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ

    మెచ్చుకోండి

    1. శర్మగారూ,
      అన్నమాచార్యులు గారు తమ “బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే” కృతిలో సమస్త జంతుజాలమూ ఒకటే అని అంటే, ఇక్కడ కవి సమస్త వృక్షజాలమూ ఒకటే అంటున్నాడు. మనం స్థాణువులుగా ఉన్నా జంగమాలుగా ఉన్నా, అంతాఒక్కటే అన్న సత్యం అవగతమైతే మనం కుల మతాలపేరుతో కొట్టుకుని చావవలసిన అవసరం పడదు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  2. నిజమే, చిన్న వాఖ్యాలలో అనంతమైన భావము.

    మెచ్చుకోండి

    1. భాస్కర్ గారూ,
      నిజం. సత్యం ఎప్పుడూ simpleగానే ఉంటుంది. అదే అందులోని చిక్కు కూడా. మనం సంక్లిష్టతలకు అలవాటు పడిపోయి, చిన్న విషయాలను, ముఖ్యంగా మౌలికమైన సత్యాలను అర్థం చేసుకో లేము. అది చిన్నపిల్లవాడి స్థాయికి దిగి పాఠం చెప్పడం లాంటిది. మనలో ఆ బాల్యావస్థచేతనని పదిలంగా కాపాడుకున్నంతకాలం ఈ ప్రమాదం ఉండదు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  3. Murty garu….what a wonderfull translation…neruda telugu kavena…anipinchehntaga undi….

    మెచ్చుకోండి

    1. అరుణ్ బవేరా గారూ,
      మీ అభిమానానికి కృతజ్ఞతలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  4. murthy gaariki namasthe

    baveraa gaarito Ekeebhavisthunnaanu saar
    wonderful translation
    with love and respects
    bolloju baba

    మెచ్చుకోండి

    1. Baba garu,
      thank you so much for the affectionate comments. We are missing you badly these days on the net.
      with best regards

      మెచ్చుకోండి

  5. కర్లపాలెం హనుమంత రావు Avatar
    కర్లపాలెం హనుమంత రావు

    .ఆరు పంక్తుల పద్యంలో అండ పిండ బ్రహ్మాండ సారాన్నంతా వడబొసినట్లు ఉంది మూర్తి గారు. and one flower sustains all the earth.- ఒక్క పువ్వే ఈ ప్రపంచాన్ని నడిపించగలదు-అన్న వాక్యం చదివినప్పుడు ఒక వింత పులకింత కూడా కలిగింది.మీ బ్లాగ్ పఠనం నాకు మంచి కాఫి తాగినంత సంతోషం కలిగిస్తుంది.

    మెచ్చుకోండి

  6. హనుమంతరావు గారూ,
    మనవాళ్లు “ఏకం సత్ బహుధా వదంతి విబుధాః అన్నారు. ఈ కవితలో అంత చక్కని సత్యాన్ని ఆవిష్కరించేడు నెరూడా. అందుకే అతని పేరు చెబుతే పిచ్చెక్కిపోతారు జనం. కవిత్వంలో సౌందర్యంతో పాటు సత్యాన్నికూడ ఆవిష్కరించగల కవి అతను.
    అయితే మీరూ నాలాగే కాఫీగత ప్రాణులన్నమాట.
    మీ అభిమానానికి కృతజ్ఞతలు.
    అభివాదములతో

    మెచ్చుకోండి

    1. ఫణీంద్రగారూ,
      మీ బ్లాగులో ఇవాళ మధురాంతకం రాజారాం గారి కథ గురించి మీ గాలంలా లాగేసిన పరిచయం చదివేను. దానితో లింకు వెతికి ఆ కథ చదివేదాకా తోచలేదు. మీకు కృతజ్ఞతలు. కవిత్వమైనా, కథ అయినా ఆ స్థాయిలో ఉండాలి. అంతే కాదు రచయితా, కవీ అటువంటి ఋషిత్వాన్ని సంతరించుకుందికి తాపత్రయ పడాలి. అప్పుడే ఈ కవితలో నెరూడా చెప్పగలిగినట్టు, తక్కువ మాటలలో కూడా అనంతమైన భావాన్ని అందించగల శక్తి వస్తుంది. అదొక తపస్సు. కొందరికే సాధ్యపడుతుందేమో!
      అభివాదములతో

      మెచ్చుకోండి

  7. మీ వివరణ వలన కవిత పూర్తిగా అర్ధమైంది.

    మెచ్చుకోండి

  8. అమ్మా జ్యోతిర్మయీ,
    కవిత్వం అర్థం చేసుకోవడంలో ఒక్కొక్కప్పుడు ఇబ్బంది దాని సందర్భం ఊహించడం. పెద్ద కవితలలో అయితే కవికి దానికి కావలసిన వాతావరణం కల్పించడానికి తగిన అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్నకవితలలో మనం చాలభాగం పదాలపొందికలోంచి దాన్ని ఊహించుకోవలసి ఉంటుంది. అది ఒకరకంగా మనకు పరిమితే(constraint).
    ఆశీస్సులతో

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: