అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • సెప్టెంబర్ 18, 2012

    మనం ఏం చేసుకుంటాం? … చార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను కవి

    మహా బాగుందనుకున్నప్పుడు, ఈ మానవజాతిలో సాధుత్వం, కొంత అవగాహన, అప్పుడప్పుడు కొన్ని సాహసకృత్యాలూ ఉంటాయి గాని మొత్తం మీద ఇది ఒక మంద… చెప్పుకోదగ్గదేమీ లేని ఒక శూన్య గోళం. అది మంచి గాఢనిద్రలో ఉన్న ఒక పెద్ద జంతువులా ఉంటుంది; దాన్నెవ్వడూ మేల్కొలపలేడు. అది బాగా చురుకుగా ఉన్నప్పుడు మహాక్రూరంగా ఉంటుంది; స్వార్థపూరితంగా, హత్యలుచేస్తూ, అన్యాయంగా ప్రవర్తిస్తుంది. ఇలాంటిమానవజాతిని మనం ఏం చేసుకుంటాం? ఏమీ చేసుకోలేం. సాధ్యమైనంతవరకు దానికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా విషపదార్థాన్నీ,…

  • సెప్టెంబర్ 17, 2012

    కుఠారధారీ, ఈ చెట్టుని విడిచిపెట్టు!… జార్జ్ పోప్ మారిస్

    ఓ, వనజనుడా! ఆ చెట్టుని విడిచిపెట్టు! దాని ఏ కొమ్మని కూడా తాకవద్దు! నా చిన్నతనంలో దాని నీడనే ఆడుకున్నాను, దాన్నిప్పుడు నేను సంరక్షిస్తాను. మా గుడిశె ముందు మా తండ్రి స్వయంగా నాటిన చెట్టది. కనుక ఓ వనవాసీ, దాని ఊసెత్తకు. నీ గొడ్డలితో దాన్ని బాధించకు. . ఆ చెట్టు అందరికీ చిరపరిచితం దాని పేరు ప్రఖ్యాతులు  దేశాలూ, మహాసముద్రాలు దాటి వ్యాపించేయి. అటువంటిదాన్ని ఇప్పుడు నరకబోతావా? ఓ వనచారీ, ఈ నీ ప్రయత్నం…

  • సెప్టెంబర్ 16, 2012

    అనంతకాల గీతిక… సిడ్నీ లేనియర్,

    ఒక రోజు రాత్రి మా దివాణం తోటలో నేనూ, నా ప్రేయసీ చాలాసేపు మౌనంగా ఉండిపోయాం ఏ గ్రహచారం వల్లనైనా, మా ఇద్దరికీ ఎడబాటు సంభవిస్తుందేమోనని బాగా దిగులుపడుతూ. . అకారణంగా దుఃఖపడుతున్న నా ప్రేయసి, మా మీద నక్షత్రకాంతి పడకుండా అడ్డుగా ఉన్నతీగమీది ఒక ఆకుని చేయి జాచి, పక్కకి తప్పించింది. . ఆమె దుఃఖాన్ని గమనించిన ఒక తారక ఆకు తొలగించిన మార్గంలోనే సూటిగా ప్రకాశిస్తూ, అద్దంలో ప్రతిబింబంలా,ఆమె కనుకొలకుల చివర వేలాడుతున్న అస్రుకణంలో…

  • సెప్టెంబర్ 15, 2012

    నేను ఖగోళ శాస్త్రజ్ఞుణ్ణి విన్నప్పుడు … వాల్ట్ వ్హిట్మన్

    నే నొకసారి ఖగోళశాస్త్రపారంగతుడిని విన్నప్పుడు అతను సిధ్ధాంతాలనీ దాఖలాల్నీ, అంకెల్లో అడ్డంగా, నిలువుగా పట్టీలువేసి చూపిస్తూ; పటాలూ, బొమ్మలతో విశదపరుస్తూ; సంకలనవ్యవకలనాలతో అంచనాలు వేసి చెబుతుంటే; ఆ గదిలో అతని ప్రసంగాన్ని అందరి అభినందనల మధ్యా కూర్చుని నేను వింటున్నప్పుడు నాకు వల్లమాలిన విసుగేసి, ఎంత వెగటు అనిపించిందో చెప్పలేను. తక్షణం అక్కడనుండి లేచి మెల్లగా బయటకు జారుకున్నాను . మంత్రముగ్ధుల్ని చేసే ఆ చల్లని రాత్రిలో ఒక్కడినీ బయట తిరుగుతూ పరీవ్యాప్తమైన నీరవ నిశీధిలో అప్పుడప్పుడు…

  • సెప్టెంబర్ 14, 2012

    అలబామాలో సూర్యోదయం… లాంగ్స్టన్ హ్యూజ్

    నేను స్వరకర్తని కాగలిగినపుడు అలబామాలో సూర్యోదయం గురించి ఒక చక్కని స్వర రచన చేస్తాను . దానికి తంపరల మీదనుంచి అలవోకగా ఎగసివచ్చే పొగమంచులాగా ఆకాశమునుండి తేలికగా నేలకిరాలే తెలిమంచులాగా  ఉండే చక్కదనాల గీతాలని సమకూరుస్తాను . . ఆ గీతాల్లో మహోన్నతమైన వృక్షాల గురించీ, దేవదారుచెట్ల ముళ్ల సువాసనగురించీ ఎర్ర రేగడినేలమీద చినుకులుపడిన తర్వాత వచ్చే సుగంధపరిమళం గురించీ, సుదీర్ఘమైన ఎర్రని మెడలతో సింధూరపు రంగు ముఖాలతో బలిష్టమైన గోధుమవన్నె బాహువులతో తెల్లని “డెయిజీ” ల…

  • సెప్టెంబర్ 13, 2012

    ఫ్రాన్సిస్… మొపాసా, ఫ్రెంచి కథా రచయిత

    మేము పిచ్చాసుపత్రినుండి బయటకు వస్తున్నప్పుడు, ముందు ఆవరణలో, కనిపించనికుక్కను అదేపనిగా పిలుస్తున్న ఒక బక్కపలచని వ్యక్తిని చూశాను.  ఎంతో ప్రేమగా మృదువుగా “కోకాట్, నా చిన్ని కోకాట్;  ఇలా దామ్మా కోకాట్, దగ్గరకి రా నా చక్కదనాల కోకాట్,” అని పిలుస్తూ, దూరంగా ఉన్న కుక్క దృష్టిని  ఆకర్షించడానికి మనం సాధారణంగా చేసేట్టుగానే  కాలు నేలకేసి కొడుతున్నాడు. నేను డాక్టర్ని అడిగేను అతనిపిచ్చికి కారణం ఏమిటని. “ఓహ్, అతని సంగతా… అదొక చిత్రమైన కథ,” అని, “అతని పేరు…

  • సెప్టెంబర్ 12, 2012

    అది మారదు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    ఇన్నిసంవత్సరాలు గడిచేక అది ఇంకేం మారుతుంది? మారదు. వియోగమూ, కన్నీళ్ళూ కూడా జీవితాన్ని విఛ్ఛిన్నం చెయ్యలేకపోయాయి. , మృత్యువు దాన్ని ఇక మార్చలేదు. నేను మరణించిన తర్వాత నీకోసం రచించిన నా గీతాలన్నిటిలో అది చిరస్థాయిగా మిగిలిపోతుంది. . సారా టీజ్డేల్ (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . It Will Not Change . It will not change now After so many years; Life…

  • సెప్టెంబర్ 11, 2012

    Immortality … SivaSagar, Indian Poet

    Before it ceased the seed reassured a harvest; Before it dropped off the youthful flower promised of a definite produce with a smile; The reeking forest fire avowed raging towering infernos; And the dusk, holding hands while receding assured a promising dawn tomorrow… . Immortality is a bliss… Taking Time into its warm embrace It pledged…

  • సెప్టెంబర్ 10, 2012

    ప్రేమికులు … Rumi, Iranian Sufi Poet

    (ఇస్లాంలోని సూఫితత్త్వం ప్రధానంగా ఆలోచన (దైవం వినా అన్ని ఆలోచనలనీ పరిహరించడం),ఆచరణా (విషయ వాంఛలన్నీ వదులుకుని పూర్తి నిరాడంబరమైన జీవితం గడపడం) బోధిస్తుంది. సూఫీ తత్త్వవేత్తల జీవనశైలీ, ఆలోచనా విధానమూ, మానవతా దృక్పధమూ కొన్నివందలసంవత్సరాలు మిగతా మతాలని కూడ ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు. ఈ కవితలో, వివరిస్తున్న సురాపానము, నిజమైన సురాపానము కాదు. అది దైవ ధ్యానం లేదా భగవన్నామస్మరణకి  ప్రతీక. హేతువాదం నమ్మకానికి పెద్ద అడ్డంకి. కనుక భక్తితో, మనోవాక్కాయ కర్మలా ధ్యానం చేసినపుడు…

  • సెప్టెంబర్ 9, 2012

    సరోవరం జ్ఞాపకంలో … ఎడ్గార్ ఏలన్ పో, అమెరికను కవి

    యౌవనం తొలినాళ్ళలో ఈ విశాలవిశ్వంలో అన్నిటికంటే ఇష్టమైన  ప్రశాంతంగా ఉండే జాగా కోసం వెతుక్కోవడం నాకో అలవాటుగా ఉండేది. . చుట్టూ నల్లని రాళ్లతో, అంబరాన్ని తాకే  పైన్(pine) చెట్లతో ఈ ప్రకృతిసిధ్ధమైన సరోవరపు ఏకాంతం ఎంత హాయిగా ఉండేదో చెప్పలేను. . కాని, చీకటిపడిన తర్వాత నిశాసుందరి మనఅందరిమీద కప్పినట్టే ఈ ప్రదేశం మీద కూడా తన నల్లని ముసుగుకప్పిన తర్వాత మార్మికపు పిల్లతెమ్మెర ఏవో రహస్యాలాలపిస్తూ పక్కనుండి పరిగెత్తుతున్నప్పుడు చూడాలి, అబ్బ! ఈ సరోవరపు…

←మునుపటి పుట
1 … 209 210 211 212 213 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
  • Subscribe Subscribed
    • అనువాదలహరి
    • Join 114 other subscribers
    • Already have a WordPress.com account? Log in now.
    • అనువాదలహరి
    • Subscribe Subscribed
    • నమోదవ్వండి
    • లోనికి ప్రవేశించండి
    • ఈ విషయాన్ని నివేదించండి
    • సైటుని రీడరులో చూడండి
    • చందాల నిర్వహణ
    • ఈ పట్టీని కుదించు