అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • ఫిబ్రవరి 24, 2020

    నేను పెద్దవాణ్ణవుతున్న కొద్దీ… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికన్ కవి

    చాలాకాలం క్రిందటి మాట. నేను నా కలని పూర్తిగా మరిచేపోయాను. కానీ అప్పుడు ఆ కల నా కళ్ళముందు కదలాడేది సూర్యుడిలా ప్రకాశవంతంగా అందమైన నా కల! తర్వాత ఒక గోడ లేచింది నెమ్మది నెమ్మదిగా నాకూ నా కలకీ మధ్య ఒక అడ్దుగోడ ఆకాశాన్ని తాకేదాకా లేస్తూనే ఉంది ఆ గోడ. పెద్ద నీడ. నేను నల్లగా. నేను ఆ నీడలో పరున్నాను. ఇపుడు నా కళ్ళకెదురుగా నా కల వెలుగు లేదు. నా మీదా…

  • ఫిబ్రవరి 22, 2020

    వాసంత ప్రభాతవేళ… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

    ఇంత చక్కని మనోజ్ఞ వాసంత ప్రభాతవేళ హృదయమా! ప్రాణప్రదమైన నా ప్రియుని అడుగుజాడలు తెలుపవా? అప్పుడు నేను నా స్వామికి, నా ప్రభువుకి ఉచితమైన దృక్కులతో, నైవేద్యములతో త్వరత్వరగా ఎదురేగి స్వాగతిస్తాను సప్తవర్ణాల ఇంద్రధనుస్సులను సృష్టించే తుంపరలుగా మహోన్నతమైన శిలలపై పతనమయే నీటిచాలుల అతని కనుగొంటే, అవి నే తెచ్చే కలలకు సాటిరావని గ్రహిస్తాడు; తెల్లని ఎండలో తళతళలాడే పచ్చని గోరింటలతో మైదానం కళకళలాడే చోట అతని దర్శించితినా ‘ఆమె బంగారురంగు శిరోజసౌందర్యము ముందు ఈ పూలసౌందర్యమేకాదు,…

  • ఫిబ్రవరి 16, 2020

    The Lost Case… Sriraj Ginne, Telugu, Indian

    Sriraj Ginne (Born: November 22, 1946) ********   “A lawyer shouldn’t discriminate between one case and the other. Doing justice to one’s clients is true dispensation of justice,” is what lawyer Sundara Ramayya always told his colleagues. Everybody knew that only Sundara Ramayya had the knack of distancing ‘in’ from ‘justice’ jumbling with words and…

  • ఫిబ్రవరి 9, 2020

    చెట్టునుండి రేగుపళ్ళు రాలుతున్నాయి…అజ్ఞాత చీనీ కవి.

    చాలా కాలం క్రిందట ఒక కథ చదివేను. పేరు గుర్తు రావటం లేదు. అందులో కథానాయకుడికి ఒక అమ్మాయిమీద మనసుంటుంది. దగ్గర చుట్టం కూడా. అమ్మాయి వాళ్ల దగ్గరనుండి సంబంధం కలుపుకుందామని కబుర్లు వస్తుంటాయి. ఇష్టం లేనపుడు ‘నాకప్పుడే పెళ్లి వొద్దు అనడం ఒక ఆనవాయితీ’. అబ్బాయి వాళ్లింట్లో తల్లీ, వదినా, అన్నా ఒక్కొక్కరే కథానాయకుడి అభిప్రాయం కనుక్కుందికి ప్రయత్నిస్తారు వేర్వేరు సందర్భాలలో. సిగ్గుకొద్దీ ‘నాకప్పుడే పెళ్లి వొద్దు’ అని అనేవాడు వాళ్లతో. దానితో, చివరకి మన…

  • ఫిబ్రవరి 8, 2020

    చుంగ్ జు… అజ్ఞాత చీనీ కవి

    మనందరికీ కొన్ని భయాలుంటాయి. ముఖ్యంగా, చిన్నప్పుడు కొన్ని విషయాలన్నా, కొందరు వ్యక్తులు, వాళ్ళతో స్నేహం అన్నా మనకి ఇష్టం ఉంటుంది కానీ అమ్మానాన్నా, అన్నదమ్ములూ, లోకులూ ఏమంటారో అన్న భయంతో ఆ పనులూ, ఆ స్నేహాలూ చెయ్యలేకపోవడం బహుశా అందరికీ కాకపోయినా కొందరికి అనుభవమే. ఈ కవిత ఆ మానసిక స్థితిని బాగా పట్టి ఇస్తుంది. ఇది సుమారు 3 వేల ఏళ్ల క్రిందటి కవిత అంటే ఆశ్చర్యం వేస్తుంది. * చుంగ్ జూ, నిన్ను బతిమాలుకుంటాను…

  • ఫిబ్రవరి 7, 2020

    11 వ కవిత, తావొ తే చింగ్ నుండి…

    ముప్ఫై చువ్వలు చక్రానికున్న కన్నాలకు బిగించినపుడు శూన్యమూ, పదార్థమూ జతకలుస్తాయి. బండి నడుస్తుంది. మట్టిని ఒక కూజా ఆకారంలోకి మలిచినపుడు శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి. కూజా పనిచేస్తుంది. తలుపులూ కిటికీలూ గదికి దారి చేసినపుడు శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి. గది పనిచేస్తుంది. నిజంగా అదంతే! పదార్థం లాభపడుతుంది శూన్యం దన్నుగా పనిచేస్తుంటే. . లావొ జు చీనీ కవి తావొ తే చింగ్  చీనీ గ్రంధము నుండి. క్రీ. పూ. 4వ శతాబ్ది.   Poem Eleven…

  • ఫిబ్రవరి 5, 2020

    ప్రేమే సర్వస్వం కాదు (సానెట్ 30) … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    ప్రేమే సర్వస్వం కాదు (సానెట్ 30) … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

    ప్రేమే సర్వస్వం కాదు; తినేదీ తాగేదీ అసలు కాదు. సుఖంగా నిద్రపుచ్చేదో, వాననుండి రక్షించే పైకప్పో కాదు. అందులో పడి మునుగుతూ తేలుతూ, మునుగుతూ తేలుతూ, మళ్ళీ ములిగే మగాళ్ళని రక్షించగల ‘తేలే కలపముక్కా’ కాదు. ప్రేమ దాని ఊపిరితో ఆగిపోయిన గుండెను కొట్టుకునేలా చెయ్యలేదు రక్తాన్ని శుభ్రపరచలేదు, విరిగిన ఎముకను అతకనూ లేదు. నేను ఇలా చెబుతున్నప్పుడుకూడా, ఎంతో మంది పురుషులు కేవలం ప్రేమలేకపోవడం వల్ల మృత్యువుతో చెలిమిచేస్తున్నారు. హాఁ! ఒకటి నిజం. ఏదో ఒక…

  • ఫిబ్రవరి 4, 2020

    Last Night’s Dream… Sowbhagya, Telugu, Indian

    It was dark. Up the sky, someone had dropped a blue diaphanous veil over the earth. buildings were asleep; hillocks were asleep and forests were also in tranquil sleep. The speeding rivers slumbered And the sea was actually snoring. in the cradle of this somnolent world just you and I were awake. Even the flame…

  • ఫిబ్రవరి 3, 2020

    A Loyalist’s Reply to Aurangzeb… Sripada Subrahmanya Sastry, Telugu, Indian Poet

    When the Mughal Emperor Aurangzeb (31 July 1658 – 3 March 1707) tried to wean away the loyal soldier Abdur Razzak Khan Lari of Golkonda Nawab Abul Hasan Kutubshah (10 August 1600 – 1699)  by sending him a message: “You join my army. I will put you in the coveted post. Send your elder son…

  • ఫిబ్రవరి 1, 2020

    రజనీస్తుతి… ఋగ్వేదం నుండి

    దిగంతపరీవ్యాప్తమై తమస్విని లేస్తుంటే  చుక్కలు కళ్ళు మిటకరించి చూస్తున్నాయి; ఆమె ఉడుపుల ఆడంబరం అంబరాన్ని తాకుతోంది. చీకట్లను తరుముతూ అక్షయమైన తమస్సు  భూమ్యాకాశాలను ఆవహిస్తోంది. సోదరి అహస్సు అడుగులో అడుగులేస్తూ పయనిస్తోంది. చీకట్లను వ్యాపించనీండి… ఓ విభావరీ! పక్షులు గూళ్ళకి ఎగసినట్టు  నీ ఆగమనతో మేము ఇంటిదారి పట్టుతాము. మనిషీ, మెకమూ, విహంగమూ మొదలుగా సమస్త జీవవ్యాపారాలూ సద్దుమణుగుతాయి. విహాయస పథంలో నిర్విరామంగా ఎగిరే డేగలు సైతం విశ్రాంతికై తిరోన్ముఖమౌతాయి. ఓ రజనీ! మమ్మల్ని దొంగలూ, తోడేళ్ళబారినుండి…

←మునుపటి పుట
1 … 19 20 21 22 23 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు