A Loyalist’s Reply to Aurangzeb… Sripada Subrahmanya Sastry, Telugu, Indian Poet

When the Mughal Emperor Aurangzeb (31 July 1658 – 3 March 1707) tried to wean away the loyal soldier Abdur Razzak Khan Lari of Golkonda Nawab Abul Hasan Kutubshah (10 August 1600 – 1699)  by sending him a message: “You join my army. I will put you in the coveted post. Send your elder son Abdul Qadir and other sons to me. I will find suitable employment to them as well,” this is the reply he sends in return.

*

You saved my life for that you take my bow

You have won the war, take the Fort

did some great good in pre-life, enjoy the riches now,

Enough is enough; don’t stoop to conquer.

Don’t invite me tempting with jobs

one tongue I have, and my heart is for one

If ever I should leave the Golkonda Fort

It’s either for battle or for Allah’s abode.

Staking life, bracing streaming blood

I secured the court of my Lord Tan Shah

It is not to secure the Mughal empire

But to stall it, or to cease my sword shows up.

Tan Shah has treated me like his own son

with love, respect and providing every need.

wretched that I am; could not fetch him a win

shouldn’t I bid this bod forever, as his Deed.

Instead of meeting force with force

The Sultan offered pelf; it’s a tribute to Golkonda.

Is life eternal? Go, get lost to your City!

Revel in your strange stories. It is your day today.

.

Sripada Subrahmanya Sastry,

(23 April, 1891 – 25th Feb, 1961)

Telugu, Indian Poet

“నీవు నా కొలువులో జేరుము. నీకు గొప్ప గొప్ప అధికారముల నిచ్చెదను. నీ పెద్దకుమారుడు అబ్దుల్ కాదిరును, మిగిలిన కుమారులను నా దగ్గఱకు బంపుము, వారికీ తగిన ఉద్యోగములేర్పాటు చేయుదు” నని గోల్కొండ చక్రవర్తి అబూహసన్ కుతుబ్ సాహ సర్దారైన అబ్దుర్ రజాక్ ఖాన్ లారీ అతన్ని ప్రలోభపెట్టినపుడు, అతను సమాధానంగా ఔరంగజేబుకు రాసిన ఉత్తరం. ఇది శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ఒక చక్కని కథలో (క్రిందనిచ్చిన లింకులో) వ్రాసేరు.

.

ప్రాణములు నిల్పితివి నాదు ప్రణుతి గొనుము

గెల్చుకొంటివి రాజ్యలక్ష్మిని బడయుము

పెట్టిపుట్టినాడ వనుభవింపుము సిరి

కక్కురితిమాటలికజాలు కట్టిపెట్టు

పిలువకుము నన్ను నుద్యోగఫలము జూపి

నాల్కయొక్కటి నాకు డెందమ్ము నొకటి

విడిచి గోల్కొండ వేఱొకయెడకు జనుట

భండనమునకొ, కాకున్న స్వర్గమునకొ.

ప్రాణములనొడ్డి రక్తస్రవంతులీది

ప్రభువు తాన్ శాహకొలువున పడసినాడ:

మొగలుసామ్రాజ్య రక్షణమునకు గాదు

శిక్షణమునకు గాని నా చేతి కత్తి

సుతుని పోలిక జూచె తాన్ శాహ జూచె నన్ను

చనవొసగిగౌరవముచేసి ధనము గూర్చి:

క్షుద్రుడను నేను విజయమ్ము గూర్పనైతి

మీదుకట్టగవలదె యీ మేనినయిన.

కత్తి విడిచి ఢిల్లీశుడు కాసు విసరె

చాలు గోల్కొండకీ గొప్ప. శాశ్వతమ్మె

జీవనము? సొంతపురిజేరి చిత్రకథల

తేజరిలుమయ్య వేగ నీరోజు నేడు.  

.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

(ఏప్రిల్ 23, 1891 – ఫిబ్రవరి 25, 1961)


తెలుగు, భారతీయ కవి

వేదవేదాంగాలు తరతరాలుగా అధ్యయనం చేసే కర్మిష్టులూ, పండితులూ అయిన కుటుంబంలో పుట్టి, సంస్కృతానికి స్వస్తి చెప్పి, తెలుగులో చిన్న కథలని రాయటం ప్రవృత్తిగా ఎన్నుకుని ఆ చిన్న కథకి కావ్యప్రతిపత్తి కలిగించిన సాహిత్య శిల్పి, సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన ఆత్మకథ పేరు అనుభవాలూ-జ్ఞాపకాలూనూ. (wikipedia)

http://kathanilayam.com/story/pdf/43191

ఈ కవితలో సౌందర్యం “మీదుకట్టగ వలదె యీ మేని నయిన” అన్న మాటలో ఉంది. మీదుకట్టడం (ముడుపుకట్టడం) అన్నమాట. తమకోరికలు చెల్లించినందుకో, చెల్లిస్తాడన్న ఆశతోనో భగవంతుని నివేదనకి(చెల్లించడానికి) భక్తులు విడిగా ఉంచే వస్తువులు. కోరిక తీరిన తర్వాత ఆ దేవుని దర్శనం చేసుకుని మొక్కు చెల్లిస్తారు. అలా, అబ్దుర్ రజాక్ తన శరీరాన్ని రాజసేవకు మీదు కట్టెనని చెబుతున్నాడు. 

“A Loyalist’s Reply to Aurangzeb… Sripada Subrahmanya Sastry, Telugu, Indian Poet” కి 2 స్పందనలు

  1. ఆంధ్రాకి దూరంగా పుట్టిపెరిగినా ఇంతమంచి రచన జదవగలిగానని గర్వ పడుతున్నాను.

    మెచ్చుకోండి

    1. మీ లాంటి పెద్దల వ్యాఖ్య ఎంత ఉత్సాహాన్నిస్తుందో చెప్పలేను. హృదయపూర్వక కృతజ్ఞతలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.