-
అదంతా కలేనా? … గై ద మొపాసా, ఫ్రెంచి కథా రచయిత
హెచ్చరిక: గుండెదిటవు లేనివాళ్ళు ఈ కథని దయచేసి చదవ వద్దు. అలా చదివినపుడు వచ్చే సమస్యలకి అనువాదకుడు బాధ్యుడు కాడు. . ఈ కథ ఉత్తమపురుషలో పురుషుడు చెప్పిన కథ అయినప్పటికీ, దీనిని స్త్రీ చెప్పినట్టు ఊహించినా, ఇందులోని సౌందర్యం ఎంతమాత్రం తగ్గదు. చెడదు. (శ్మశానంలో రాత్రిగడపటం అన్నది కథకుడికి కూడ suspension of disbelief క్రింద ఇచ్చే రాయితీయే గనుక). అసలు విషయం, బలహీనతలనీ, గొప్పదనాలనీ తులనాత్మకంగా పరిశీలించి ఇవ్వవలసినవాటికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వలేని మనబలహీనత వల్ల,…
-
ఆవగింజల టపటపలు … మనుజ్ బ్రహ్మపాద, Malayalam, Indian Poet.
. విరబూచినచెట్టు ఒకటి కిటికీ పక్కకి వంగి, పిట్టలా మూతిముడిచి సన్నగా ఊళవేసింది: “ఏయ్, బాబూ! బయటికి దా! నేను నీ కోసం పువ్వులు కురియడానికి ఎదురుచూస్తున్నా.” . మనసు చికాకు తెప్పించే సోషలు పుస్తకాన్ని ఒక్కసారి అవతలకు విసిరేసి, ఒక ఆకును మీటింది పళ్లతోటలోకి పరుగెత్తడం గురించి ఆలోచిస్తూ… . సరిగ్గా అప్పుడే వంటింట్లోంచి ఒక కేక వినిపించింది: “ఓరే, బాబూ! రేపు పరీక్ష …” . ఎక్కడికో ఎగిరిపోడానికి పావురం రెక్కలు అల్లాడించింది; చెట్టు…
-
ప్రేమఫలించిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
. ఇక అందులో ఇంద్రజాలం ఉండదు, అందరువ్యక్తుల్లాగే మనమూ కలుసుకుంటుంటాం, నేను నీకూ, నువ్వు నాకూ ఇక అద్భుతాలుగా అనిపించం. . ఒకప్పుడు నువ్వు సుడిగాలివి, నేను సముద్రాన్ని— ఆ వైభవం ఇక ఏమాత్రం ఉండదు… నేను సముద్రపొడ్డునే అలసిపోయిన ఒక మడుగునై మిగిలిపోయాను. . ఆ మడుగుకి ఇప్పుడు తుఫానులబెడదనుండీ ఎగసిపడే అలలనుండీ విముక్తి దొరికింది అయితేనేం, దానికి దొరికిన అంత ప్రశాంతతకీ సముద్రం కంటే, ఏదో పోగొట్టుకున్న అసంతృప్తి మిగిలిపోతుంది. . సారా టీజ్డేల్ August…
-
ఒక బానిస కల … H W లాంగ్ ఫెలో, అమెరికను కవి
ఇంకా కోతకొయ్యని వరిచేను గట్టున చేతిలో కొడవలితో అతను మోకరిల్లి ఉన్నాడు; అతని ఒంటిమీద బట్టలేదు, అట్టగట్టిన తల ఇసుకలో కూరుకుని ఉంది. పదే పది సార్లు కలత నిదుర మగతలో అతను తన మాతృభూమిని చూశాడు. . అతని విశాలమైన కలలప్రపంచంలో నైగర్ నది విలాసంగా ప్రవహిస్తోంది. దాని ఒడ్దున మైదానాలలోని తాటిచెట్లక్రింద మరొకసారి అతను మహరాజులా నడుస్తున్నాడు; కొండమీదనుండి దిగుతున్న సార్థవాహుల బండ్ల ఎద్దులమెడగంటలు వినిపిస్తున్నాయి. . మరొకసారి తన నీలికన్నుల రాణిని తన పిల్లలమధ్యలో…
-
దంతవైద్యుడూ— మొసలీ…. రోవాల్ డాల్ , బ్రిటిషు కవి
. ఒక మొసలి, చిలిపిగా నవ్వుతూ , దంతవైద్యుడి ఎదురుగా కుర్చీలో కూచుని: “ఇదిగో ఈ పన్నూ, మిగతా అన్నిపళ్ళూ కూడా సలుపుతున్నాయి. బాగుచెయ్యాలి,” అంది. దంతవైద్యుడి ముఖంలో కత్తివాటుకి నెత్తురుచుక్కలేదు. భయంతో గడగడలాడుతూ, వణికిపోసాగేడు. “అలాఅయితే, ఒకసారి చూడాల్సి ఉంటుంది “అన్నాడు. “నాకు కావలసిందీ అదే,” అని “ముందు వెనక పళ్ళు పరీక్షించండి అన్నిటిలోకీ ఆ దంతాలే బాగా నొప్పెడుతున్నై,” అంది. అని దాని భారీ దవడలు తెరిచింది. అది మహా భయంకరమైన దృశ్యం… కనీసం…
-
కృతజ్ఞతలతో … థామస్ లక్స్, అమెరికను కవి
ఓ భగవంతుడా! నువ్వెవ్వరో గాని నీకు నా కృతజ్ఞతలు… ఊపిరి పీల్చి విడవడానికి ఇచ్చిన ఈ గాలికీ, చిట్టడవిలో తలదాచుకుందికి ఈ చిన్న గుడిశకీ, నిప్పురాజేసుకుందికి పుల్లలకీ, దీపపు వెలుతురుకీ, చిగురాకు మెరుగువంటి సహజకాంతికీ, పచ్చని ప్రకృతికీ, విహంగాలకీ, సంగీతానికీ, ప్రకృతి ఒడిలోకి తిరిగిచేర్చే సాధనాలకీ చిమ్మటలు కొట్టేసిన కంబళ్లకీ మంచుముక్కలాంటి నీటికీ, నిజం, చల్లని ఈ నీటికీ అనేక కృతజ్ఞతలు. . ప్రభూ, నీకు కృతజ్ఞతలు! నన్నిక్కడకితీసుకొచ్చి పడేసినందుకు… ఇక నా సంగతి నేను చూసుకుంటాను…
-
నా కిటికీ క్రిందనున్న శ్మశానంలోని మృతులకు … ఏడిలేడ్ క్రాప్సీ, అమెరికను కవయిత్రి.
. చలనంలేకుండా అలా ఎలా పడుక్కోగలుగుతున్నారు? మీరక్కడ అశాంతితో కదులుతున్నారని అనడానికీ, విసుగెత్తి ఆవులిస్తూ చెయ్యి జాచేరనో, చాలా రోజులై తిరగక కాళ్ళు పట్టేసి నొప్పిపెడుతున్నాయనో సూచించడానికి రోజల్లా నేను గమనించినా ఒక్క గడ్డిదుబ్బూ కదలదు. రాత్రంతా గమనిస్తూనే ఉంటాను; అయినా, ఒక్క ఆత్మా లేచిరాదు అర్థరాత్రి చల్లనిగాలిలో స్వేచ్ఛగా విహరించడానికి. . ఏం? మీ ఎముకల్లో పోరాట పటిమ నశించిందా? మీతోపాటు ఉండే క్రిములు మిమ్మల్ని అసహ్యించుకుంటాయి: పాలిపోయి, చివికిపోతూ, మట్టిలోకలిసిపోతున్న అన్నిటికీ తలలూపే పౌరుషంలేని…
-
నా మాట … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి.
అశాంతీ, ఆతురతలతో నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో, నువ్వూ, నేనూ, మనవంతు ఆనందం మనసారా అనుభవించేం; ఈ నావకెత్తిన తెల్లని తెరచాపలు మూసివేయబడ్డాయి మనం ఇందులోకెత్తిన సరకంతా ఖర్చుచేసేశాం. . రోదనవల్ల సంతోషం నానుండి నిష్క్రమించింది, అందుకు నా చెక్కిళ్ళు ప్రాయములోనే కళతప్పాయి, వయసుమీరని నా పెదాల అరుణిమని వేదన హరించింది, వినాశము నా శయ్యమీద ఆఖరితెరలు దించుతోంది. . కానీ, కిక్కిరిసిన ఈ జీవితం నీకు ఒక వీణ, ఒక జంత్రం, లేక వయోలాల సమ్మోహనాదంలాగో …
-
I want No Life… Ravinder Verelly, Telugu Poet
. Then: There was no form. There were no limits at all. My term of life was the same as that of Milky Ways. I had a full-fledged freedom to touch the bourns of skies and the depths of abysses same time. My existence was at the threshold of nine planets. . Now: I am a…
-
నిశాసమాగమము … రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి
. విభూతిరంగులో సముద్రం, నీలివర్ణంలో సుదీర్ఘమైన నేల; దిగంతాల అంచున పసుపురంగులో అర్థచంద్రబింబం; నిద్రలో జడుసుకుని లేచినట్టు ఉవ్వెత్తుగా ఎగసి వడివడిగా చిన్నచిన్న వృత్తాల్లో పరిగెడుతున్న అలలు. నావలో నేను ఒడ్దుసమీపించి, ఉప్పుటేరుని కలిసి, దాని అలసటతీర్చడానికి పర్రలో లంగరు వేశాను . సంద్రపువాసనవేస్తూ మైలుపొడవు వెచ్చని తీరం; కళ్ళం చేరడానికి ఇంకా దాటవలసిన మూడు పొలాలు; కిటికీఅద్దం మీద నెమ్మదిగా తట్టిన ఒక తట్టు, తత్తరగా గీచిన అగ్గిపుల్లచప్పుడు, ఒక్కసారిగా లేచిన నీలిమంట,…