అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మార్చి 9, 2020

    ఇంటితోవ పట్టినపుడు… చాంగ్ ఫాంగ్ షెంగ్, చీనీ కవి

    అంతరాయంలేకుండా వేల అడుగులు ఎత్తునున్న కొండశిఖరాల్లారా! ఒక్క అలకూడా లేకుండా వందలమైళ్ళు పరుచుకున్న సరస్సులారా! ఏడాది పొడుగునా ఒక్క నీడకూడా లేకుండా తెల్లగా ఉండే ఎడారులారా! వేసవిలోనూ, హేమంతంలోనూ పచ్చగా ఉండే పైన్ వనసీమలారా! విరామమెరుగకనిరంతరం పరుగులుతీసే సెలయేళ్ళలారా! వేల యేళ్లబట్టి మీ మాట నిలబెట్టుకుంటున్న మహావృక్షాల్లారా! మీరు ఒక్కసారిగా ఈ దేశదిమ్మరి బాధలకు ఉపశమనము కలిగించారు అతని కలం కొత్తగీతాలను వ్రాయడానికి ప్రేరణనిచ్చారు>. . చాంగ్ ఫాంగ్ షెంగ్, 4వ శతాబ్దము చీనీ కవి .…

  • మార్చి 7, 2020

    స్త్రీ…. ఫ్యూ హ్యువాన్, చీనీ కవి

    స్త్రీగా పుట్టడ మెంత దుఃఖభాజనమో కదా! ప్రపంచంలో అంతకంటే విలువతక్కువది మరొకటి ఉండదు. కుర్రాళ్ళు తలుపుకి చేరబడి నిలుచుంటారు దివినుండి దిగివచ్చిన దేవతల్లా. వాళ్ళ హృదయాలు నాలుగు సముద్రాలకీ, వేలమైళ్ళ దుమ్మూ ధూళీ, పెనుగాలులకీ వెరువరు. ఆడపిల్ల పుట్టినపుడు ఎవరూ ఆనందంగా ఉండరు. ఆమె వల్ల ఆ వంశవృద్ధి జరగదు. ఆమె పెరిగి పెద్దయ్యేక తనగదిలోనే దాగుంటుంది. మగవాళ్ళని ముఖాముఖీగా చూసే ధైర్యంలేక. ఆమె అత్తవారింటికి పోయినపుడు ఎవరూ ఏడవరు వర్షం వెలిసిన తర్వాత నెలకొన్న మేఘాల…

  • మార్చి 6, 2020

    మందసమీరము… ఫ్యూ హ్యువాన్, చీనీ కవి

    ప్రశాంతమైన రాత్రివేళ సమీరము మంద్రంగా వీచుతోంది. గోపురం మీద చంద్రబింబం తెల్లగా మెరుస్తోంది. ఏదో గొంతు గుసగుసలాడుతోంది కానీ పిలిస్తే ఎవరూ బదులివ్వరు నీడ ఏదో కదుల్తోంది, కానీ రా రమ్మని పిలిస్తే ఇటు రాదు. వంటవాడు కప్పుడు ఉడకబెట్టిన లెంటిల్స్ తెస్తున్నాడు. మదిరకూడా ఉంది, కానీ నా కప్పులో నింపుకోను. సంతృప్తితో నిండిన పేదరికం విధి ఇవ్వగలిగిన గొప్ప బహుమానం సంపదలూ, కీర్తిప్రతిష్టలూ అనర్థానికి చెలికత్తెలు ప్రపంచమంతా బంగారానికీ, రత్నాలకీ ఆశపడి దాచుకున్నా, నా దృష్టిలో…

  • మార్చి 5, 2020

    సందులో విద్వాంసుడు… సో సూ, చీనీ కవి

    పంజరంలో బంధించబడ్డ పక్షి టపటపామని తన రెక్కల్ని నాలుగుపక్కలా కొట్టుకుంటోంది. ఆ ఇరుకు వీధిలోని విద్వాంసుడు నిరాశా నిస్పృహలతో ఉన్నాడు నీడని అప్పళించుకుని ఆ ఖాళీ ఇంట్లో ఉంటున్నాడు. అతను బయటకి వెళ్ళాలంటే వెళ్ళడానికి గమ్యం ఏదీ లేదు, అతని త్రోవనిండా ముళ్లకంపలూ, విరిగిన కొమ్మలూ. అతనొక స్మృతికావ్యం రాస్తాడు, ఎవరూ చదవరు, ఆదరించరు. ఎండిన చెఱువులో చేపలా ఉన్నచోటే చిక్కుపడిపోయాడు. బయట… దమ్మిడీ సంపాదన లేదు లోపల… వంటగదిలో గింజ ధాన్యం లేదు. అతని అసమర్థతకి…

  • మార్చి 4, 2020

    కరెంటు తీగలు… ఫిలిప్ లార్కిన్., ఇంగ్లీషు కవి

    కరెంటు తీగలు… ఫిలిప్ లార్కిన్., ఇంగ్లీషు కవి

    ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఒకలా చూస్తే నిరాశావాదంలా కనిపిస్తున్నా, అది కవి లక్ష్యంకాదు. ఇక్కడ తీగెలు నిజం తీగెలు కానక్కరలేదు. అవి ప్రతీకలు మాత్రమే.  సమాజంలో పాతుకు పోయిన మూఢనమ్మకాలూ, ఆచారాలూ, సంప్రదాయం పేరిట చలామణీ అయే ఏ అలవాట్లైనా కావచ్చు. ఇవి మానసికంగా ఒక గోడను, ఒక బలహీనతను యువతలో సృష్టిస్తాయి. అంతేకాదు, ఈ రకమైన ఆచరణలకీ, జీవితంలో మనంచేసే కృషికి లభించే ఫలితాలకీ ఏ రకమైన సమసంబంధ సామ్యం లేకపోయినా, ఏదో రకంగా ఈ రెండింటికీ…

  • మార్చి 3, 2020

    నీలి రంగు కిటికీలోంచి ఒక దృశ్యం… ఎర్నెస్టో కార్దెనల్, నికరాగువా కవి

    నీలి రంగు కిటికీలోంచి ఒక దృశ్యం… ఎర్నెస్టో కార్దెనల్, నికరాగువా కవి

    ఆ గుండ్రటి చిన్ని కిటికీలోంచి అంతా నీలిమయం నేల నీలం, లేత నీలం, ఆకాశవర్ణం, అంతా నీలి నీలి రంగు. నీలవర్ణపు సరస్సులు, నీలి నీలి మడుగులు, నీలి రంగు అగ్నిపర్వతాలు ఇంకా దూరంగా ఉన్న నేలంతా నీలమే నీలి రంగు దీవులూ, కాసారాలూ. దాస్యశృంఖలాలు త్రెంచుకున్న నేల తీరే అంత! నా ఉద్దేశ్యంలో. ఎక్కడైతే ప్రేమకోసం అందరూ పోరాడుతారో, ఎక్కడ దోపిడీ, ద్వేషమూ లేక జీవిస్తారో, ఒకర్నొకరు ఆప్యాయతతో  చూసుకుంటుంటారో, ఆ నేల చాలా సౌందర్యంగా ఉంటుంది.…

  • మార్చి 2, 2020

    The Night Side … Sivala Jagannadha Rao, Telugu, Indian

    [Born in 1945, Sivala Jagannadha Rao entered literary field in 1965 with his short story ‘Sita’. Though he did not have any formal education, he has more than 250 short stories and a dozen novels to his credit. Some of his short stories and three of his novels won state-level awards. Though his narration looks…

  • ఫిబ్రవరి 29, 2020

    Dead of Night – Sowbhagya, Telugu, Indian Poet

    Look where you will Flowers are asleep – smiles are asleep and so are the doves— peacefully. cool breeze soars  high up to greet the milky-way Moonlight descends to soothe pent-up hearts.  beating rhythmically over the sea Tides lull earth to sleep. Branches rollick the twigs in their cradle laps And the heavens look like…

  • ఫిబ్రవరి 26, 2020

    అంతా అయిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

    ఇప్పుడు నువ్వంటే నాకు ప్రేమ లేదు, నీకూ నే నన్నా ప్రేమ లేదు, అద్భుతమైన పెను తుఫానులా ప్రేమ మనల్ని తాకి, వెళ్ళిపోయింది. అయినప్పటికీ, మనిద్దరి మధ్యా దూరాలూ, కాలమూ పెరుగుతున్నకొద్దీ ఏవో చిన్న చిన్న విషయాలు జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి: వానతోపాటు వచ్చిన వాసన చినుకులతోపాటు నేలమీదకి జారి అక్కడ రాలిన ఎండుటాకుల్లోకీ పుష్పించే లతాగుల్మాలలోకి చేరినట్టు… స్ఫటికాల్లాటి వానబిందువులు అక్కడి సాలెగూళ్ళ వలలపై తేలి మిణుకుమనే తారకలతో సామ్యాన్ని ఆపాదించుకున్నట్టు. . సారా టీజ్డేల్…

  • ఫిబ్రవరి 25, 2020

    దీవులు… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి

    సాగర దీవుల్లోని గేలిక్ ప్రజల్లా ముసలివాళ్ళు జీవితాల్ని వెలారుస్తారు, సముద్రపుటొడ్డున పొలమూ, ఒక భార్యా, కాసేపు కొడుకులనిపించుకునే పిల్లలూ; కొంత కాలానికి భార్యా, సముద్రపుటొడ్డు పొలమూ సముద్రపు హోరూ, దాని గురించిన ఆలోచనలూ, పిల్లలూ … అందరూ ఆ నీటిమీదనుండే ఎక్కడికో వెళ్ళిపోతారు. చివరకి పెద్దకొడుకూ ఆఖరి కూతురూ కూడా ఆ నీటిబాటనే జీవితాన్ని వెతుక్కుంటూ కనుమరుగైపోతారు. కడకి ఆ ఇద్దరూ… ముసలాడూ, ముసల్దీ మిగుల్తారు ఆ సాగర ద్వీపం మీద. ముసలివాళ్ళు మాటాడుకునేట్టుగానే మాటాడుకుంటూ తలూపుకుంటూ,…

←మునుపటి పుట
1 … 18 19 20 21 22 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు