-
దుఃఖంతో చెలిమి .. ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, అమెరికను
నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకుని “కష్టం గట్టెక్కిపోతుందిలే. భవిష్యత్తులో మంచిరోజులకోసం చూడు. ఈ రోజు సంగతి మరిచిపో!” అని ఆమెకు చెప్పకు. నీకింకా చెప్పాలని ఉంటే, కష్టాలు వృధాగా రావనీ, అవి కలిగించే బాధకన్నా మిన్నగా నేర్చుకోగల గుణపాఠాలుంటాయని చెప్పు. . “నువ్వు త్వరలోనే ఇనన్నీ మరిచిపోతావులే”… అంటూ, అరిగిపోయినఓదార్పువచనాలతో ఆమెని మోసగించకు; అది చేదు నిజం అన్న మాట నిజమే, కానీ, విచారించవలసిన విషయం; “ఇతర వ్యాపకాలపై మనసు తిప్పుకో” మనీ “ఉల్లాసం కలిగించే విషయాలు…
-
నేను విన్న సంగీతం … కాన్రాడ్ ఐకెన్, అమెరికను కవి
నేను నీతో కలిసి విన్న సంగీతం, కేవలం సంగీతం కాదు నేను నీతో కలిసి పంచుకున్న రొట్టె … కేవలం రొట్టె కాదు, నా ప్రక్కన ఇప్పుడు నువు లేవు… కనుక అంతా శూన్యమే, ఒకప్పుడు సౌందర్యంతో దీపించినదంతా ఇపుడు జీవకళ కోల్పోయింది. . ఒకప్పుడు నీ చేతులు ఈ మేజానీ, ఈ పాత్రల్నీ స్పృశించేయి నీ వేళ్ళు ఆ గాజుపాత్రని పట్టుకోగా చూడడం నాకింకా గుర్తే, ప్రేయసీ! ఈ వస్తువులేవీ నిన్ను గుర్తుపెట్టుకోకపోవవచ్చు, కానీ,…
-
The Gold Seekers… Hamlin Garland, American
కలలుగనే ఈ “కలాకారులు” పక్కనుంచి వెళ్ళడం చూశాను వాళ్ళ అడుగులవెనక కొంత దూరం నడిచాను కూడా ప్రతి వ్యక్తి చూపులూ నింగి వంకే ప్రతి వ్యక్తి ముఖంలోనూ ఆశలవెలుగే నిరాశామయ జీవితాలూ, వేదననుండీ వాళ్ళంతా పరుగు వాళ్ళకళ్ళల్లో అందమైన భవిష్యత్తూ, బంగారపు వెలుగు దహించే ఆకలి బాధ కొందరిని ఉన్మత్తులని చేస్తే బానిస కొలుముల దగ్గర తెల్లారిన బ్రతుకులు కొందరివి. పనిముట్లకు బానిసలైన వీళ్ళందరూ వాళ్ళ “బానిసభత్యా”లని వెనక్కి గిరాటువేసారు వాళ్ళు భవిష్యత్తుని కలగనటం లెదు మీసం…
-
In The Footsteps… Nishigandha, Telugu, Indian
. Did you notice? No sooner had you come, Than the moonlight assumed a strange glow! The gravel road Through the Casuarina plantation Was eager to speak about Yesterday’s rain. Shall we go out for a while? Oh, no! Don’t put such desperate face You don’t have to talk, OK? Just give me company! I…
-
స్థితప్రజ్ఞుడు డేవిడ్ హ్యూం… ఏడం స్మిత్, ప్రఖ్యాత ఆర్థికశాస్త్రవేత్త, స్కాట్లండు
ఉపోద్ఘాతం: 18వ శతాబ్దంలో స్కాట్లండులో తాత్త్విక చింతన, శాస్త్రీయ ఆవిష్కారాలతో ఒక కొత్తశకానికి తెరలేచింది. గ్లాస్గో, ఎడింబరో, ఏబర్డీన్ వంటి ప్రాచీనమైన విశ్వవిద్యాలయాలలోనూ పదిమంది కలుసుకునే కూడళ్ళలోనూ, ఎక్కడపడితే అక్కడ మేధోపరమైన చర్చలు జరుగుతుండేవి. అదే కాలంలో యూరోపులో ప్రచారంలో ఉన్న మానవతావాదం, హేతువాదాలతో ఆలోచనలను పంచుకుంటూ, స్కాట్లండుకు చెందిన మేధావులు మానవ వివేచనాశక్తికి అధిక ప్రాధాన్యతనిస్తూనే, తర్కానికి నిలబడని ఏ ప్రాచీన సంప్రదాయాన్నైనా నిర్దాక్షిణ్యంగా త్రోసిపుచ్చేరు. ఇతర యూరోపియన్ దేశాలవారికి భిన్నంగా కేవలం వివేకము ద్వారానే…
-
సరైన జీవనమార్గం ఏది?… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి
ఏది సరైన జీవన విధానం? ఏదోలా చేసెయ్యడం సులువుగా కనిపించినప్పుడు కష్టమైనా నీశక్తిమేరకు సవ్యమైనదే చెయ్యడం; దైనందిన జీవితంలోని ఈతి బాధలని పదే పదే నెమరువేసుకుని కాలంవృధా చేసేకంటే, తాలిమితో, చిరునవ్వుతో స్వీకరించడం; ప్రశ్నార్థకాలు ముసురుకుంటున్నా మాటలలో ఆశావాదాన్ని వీడకపోవడం; తరచు నీ అదృష్టాన్ని తలుచుకుంటూ, కృతజ్ఞతకలిగి, నీ కష్టాల్ని మౌనంగా అంగీకరించడం; నాకీ కష్టాలెందుకని ప్రశ్నించకపోవడం; జీవితం అంతా ఒక అత్యుత్తమమైన ప్రణాళికగా మన్నించి ప్రతి సందర్భాన్నీ అందులో ఒక భాగంగా ఆహ్వానించడం; కష్టపడి పనిచెయ్యడం,…
-
పెనుగాలికి నువు బెదురుతావా?… హానిబాల్ హామ్లిన్ గార్లాండ్, అమెరికను కవి
పెనుగాలి తీవ్రతకి నువు భయపడతావా? మరి సూదులుగుచ్చే వర్షం మాటో? ఫో! వాటిని ఎదుర్కొని పోరాడు… మళ్ళీ ఆటవికుడిగా మారు. తోడేలులా చలికివడకట్టి ఆకలికి అలమటించు! వెళ్ళు, కొంగలా మొలబంటినీళ్లలోంచి ఈదుకురా! అప్పుడు నీ అరచేతులు రాటుదేరుతాయి; నీ బుగ్గలమీది చర్మం కందుతుంది; నువ్వు అలసి, కరుకుగా, నల్లగా మారుతావు. అయితేనేం? నువ్వు మనిషిలా తలెత్తుకు నడుస్తావు! . హానిబాల్ హామ్లిన్ గార్లాండ్ అమెరికను కవి కొన్ని కవితలు చదవగానే మనసుని కట్టి పడెస్తాయి. అటువంటి కవితల్లో…
-
Mother Earth … Dr. Linga Reddy, Telugu, Indian
(With best wishes to Dr. K. Linga Reddy on the eve of shifting his Multi-speciality Hospital from Janagaon to Hyderabad today) . Clearing woods, bush and bramble A field is made of fallow… This parched thirsty glebe Watches the skies above agape… Greenhorns stagger To drive the harnessed plough; Seed broadcast like chalky patterns in…
-
పాత వీధి … వర్జీనియా వుడ్వార్డ్ క్లౌడ్, అమెరికను కవయిత్రి
చప్పుడుచెయ్యకుండా, ఒంటరిగా, మన ప్రమేయం లేకుండా గతం ఇక్కడ సంచరిస్తుంటుంది; వచ్చేవాళ్ళూ మౌనం పాటిస్తారు; ప్రభాత,సాయం వేళలలో భారంగా అటూ ఇటూ నడిచే పాదాలక్రింద పచ్చిక నలగకుండా, ప్రతి సమాధిప్రక్కనా తలెత్తిచూస్తూనే ఉంటుంది. గతం … ఇకనుండీ అగోచరంగా ఇక్కడ సంచరిస్తూనే ఉంటుంది ఎక్కడో దూరాన తను విడిచిన గుండె చప్పుళ్ళను వినడానికి ఓరగా తెరిచి ఉన్నతలుపుసందులలోంచి ఆతృతతోచూసే ఆత్మకితప్ప; తన్మయత్వంతో పరవశింపజేసే అవ్యక్త స్వరాలవి. మరిచిపోయిన ఆలాపన పక్కనే ప్రతిధ్వనించినట్టు సగం ఉలికిపాటుతో వింటూ గుర్తుచేసుకుంటుంటుంది; ఒక్కోసారి…
-
చూపు … సారా టీజ్డేల్, అమెరికను
స్ట్రీఫాన్ నన్ను వసంత ఋతువులో ముద్దుపెట్టుకున్నాడు రాబిన్ శరత్కాలంలో కాలిన్ నన్నెప్పుడూ చూస్తూండే వాడు గాని ఎన్నడూ ముద్దుపెట్టుకో లేదు. . స్ట్రీఫాన్ ముద్దు పరిహాసాల్లో కొట్టుకుపోయింది రాబిన్ ముద్దు ఆటపాటల్లో కలిసిపోయింది కాలిన్ కళ్ళలో తొణికిసలాడిన ముద్దు రాత్రీ పగలూ నన్నువెంటాడుతూనే ఉంది. . సారా టీజ్డేల్. (August 8, 1884 – January 29, 1933) అమెరికను కవయిత్రి . సుకుమారమైనవీ, అపురూపమైన ప్రేమ భావనలని మనోహరంగా ప్రకటించడంలో సారా టీజ్డేల్ ది అందెవేసిన…