అనువాదలహరి

అనువాదము పునర్జన్మ

    • క్లుప్తంగా
  • మే 1, 2020

    తన్మయత… సర్ నిజామత్ జంగ్, అరబ్-భారతీయ కవి

    ప్రియా! నేను నీ చెంతకు చేరినపుడు నాలోని నశ్వరమైనవాటినన్నిటినీ త్యజించి, దైవదర్శనానికి వెళుతున్నప్పుడు ఏయే ఆలోచనలను దూరంగా ఉంచుతామో వాటినుండి మనసు ప్రక్షాళనంచేసుకుని అంత నిర్మలంగానూ చేరుకుంటాను- దురహంకారాన్నీ, ప్రేమాడంబరాన్నీ ఒకే ఒక్క పదునైన చూపుతో అణచగల ఎగసిపడే అద్భుత చైతన్యవంతమైన నీ వ్యక్తిత్వానికి అనువుగా నన్ను దిద్దుకుంటూ. నిజం! నేను అచ్చం అలాగే నీ చెంతకు వస్తాను. వచ్చి నీ కళ్ళలోకి సూటిగా చూడ సాహసిస్తాను. నీ చేతిని నా కనులకూ,పెదాలకూ అద్దుకున్నపుడు ఆ సుతిమెత్తనిస్పర్శ…

  • ఏప్రిల్ 7, 2020

    A St(r)ing on the Wall… Sibi, Telugu Poet, Indian

    Closed room stories become public temptations Intimate pictures on the bed Spear young deers that have just learnt stepping out Bodies sold for paper currency Turn into posters to hang on ‘Wall-Cross’es Dung spills on all womanhood .The barbarous heritage of barber shops Becomes  such an angler That heads turn no other way. Along with…

  • ఏప్రిల్ 4, 2020

    Perhaps, This is a Testing Time… Kalekuri Prasad, Telugu Poet, Indian

    Perhaps, This is a Testing Time… Kalekuri Prasad, Telugu Poet, Indian

    Just that… I am not too ambitious to gallop away, But at the same time, don’t want to stay put where I am biding time, doing nothing worthwhile. Holding a cryptic clue in my hands I walk towards a distant dawn. Perhaps, this is a testing time. If I come across shackles and hurdles of…

  • మార్చి 31, 2020

    అన్న పెత్తనం… హాత్రే, ఇంగ్లీష్ కవయిత్రి

    ఈ కవితలో చమత్కారం అంతా అమ్మకి ఇద్దరం సాయం చెయ్యాలని ఒకప్రక్క చెబుతూనే, కష్టం అంతా సోదరికీ, సుఖం అంతా తనకీ ఉండేట్టు పని పంచుకోవడంలో అన్న చూపించిన నేర్పు. *** సూసన్! నువ్వు ఇంట్లో బుద్ధిగా ఉంటానని మాటివ్వు! అమ్మకి ఒంట్లో బాగులేదు, నీరసంగా విచారంగా ఉంది; అమ్మని ఆనందంగా ఉండేట్టు మనం చూడాలి; బంగాళాదుంపలు ఒలిచిపెట్టు, బియ్యం అత్తెసరు పెట్టు, రాత్రి భోజనం వేడిగా, రుచిగా ఉండేట్టు చేసిపెట్టు. కుర్ర చేష్టలు కట్టిపెట్టి మనం…

  • మార్చి 20, 2020

    Emendation… Gurajada Appa Rao, Telugu, Indian

    Emendation… Gurajada Appa Rao, Telugu, Indian

    “Tak!…Tak!!…Tak!!!”, Gopalarao tapped the door gently with his knuckles. There was no response. The door wasn’t opened . he waited for a while. The clock struck one. “My god! I am late again. Too late! I have been a fool!  I must be careful from tomorrow. Far from being an anti-nauch, I have slid down …

  • మార్చి 16, 2020

    నేను లేని లోటు నీకు తెలియదులే… హసన్ షహీద్ సుహ్రావర్దీ, భారత- పాకీస్తానీ కవి

    నేను లేని లోటు నీకు తెలియదులే… హసన్ షహీద్ సుహ్రావర్దీ, భారత- పాకీస్తానీ కవి

    నీ జడనుండి ప్రమత్తంగా రాలిన పువ్వులా నేను మరణించిన తర్వాత నేను లేని లోటు నీకు తెలియదులే. కానీ ఏదో ఒక తుఫాను రాత్రి చలినెగడు ప్రక్క కూర్చున్నపుడు అప్పుడే విచ్చుకుంటున్న పువ్వులా నీ మదిలో ఎక్కడో మెదలకపోను. నువ్వొక చిరునవ్వు నవ్వి, ఆలోచిస్తుంటావు చేతిలోని పుస్తకాన్ని పక్కకి పెట్టి సుదూర తీరాల్లోకి చూపులు నిలిపి నువ్వు నెగడుకి దగ్గరగా జరుగుతావు. . హసన్ షహీద్ సుహ్రావర్దీ (24 October 1890 – 5 March 1965)…

  • మార్చి 14, 2020

    ప్రేమ తత్త్వము… గోవింద కృష్ణ చెత్తూర్, భారతీయ కవి

    ఈ అవనిమీద జీవించి, ప్రేమించి, సౌందర్యాన్ని దర్శించి పదునైన కలలు ఆయుధాలుగా చీకటినుండి వేకువ మొలిచేదాకా శ్రమించి, అందరూ నడిచేత్రోవకీ, కోలాహలాలకీ అతీతంగా ఎగరడానికి (ఆలోచనల) రెక్కలుగలిగినవా డెవడు దైవాన్ని చులకనచేసి మాటలాడగలడు? ఈ క్షణికమైన అనంతతత్త్వాన్ని తెలిసినవారు అనిమిషులతో సరిసమానులే. వారు సురలోక వాటికలపై సురలతో పాటుగా విహరిస్తారు. అనుపమానమైన గంధర్వ గానాన్ని ఆస్వాదిస్తూ. అలాగే, దివ్యమైన ప్రేమకి వారసులమైన మనం కూడా, దేవతల వలె, అమరానంద పారవశ్యంతో ఎదిగి దైవత్వాన్ని సంతరించుకుని, రానున్న భవిష్యత్తులో,…

  • మార్చి 13, 2020

    వసంతాగమనం… నగేష్ విశ్వనాథ్ పాయ్, భారతీయ కవి

    యవ్వనపు తొలి కోరికలలా వసంతుడు అడుగుపెడుతున్నాడు… వాటి హేమంతపు నిద్రనుండి మేల్కొలపడానికి జంకుతున్నాడా అన్నట్టు చెట్లమీదనుండీ, పొదలమీదనుండీ,పాదులమీదనుండీ చప్పుడు చెయ్యకుండా బొటనవేలి అంచుపై అడుగు లేస్తూ… ఆ సరోవరపు స్వచ్ఛమైన నీటిపై సున్నితమైన ఎర్ర తామరలు సూర్యుని వే వెలుగుకిరణాల స్పర్శకు సంతోషంతో మెరిసిపోతున్నాయి, అంతే సుకుమారమైన తెల్ల కలువలు సిగ్గుతో, బిడియంతో వెండివెలుగుల రేరాజుకై ఎదురుచూస్తూ తమ ముఖాలని నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి; మబ్బుతునక జాడలేని నిర్మలమైన ఆకాశాన్ని చూసి ఆనందిస్తున్నాయి; సమ్మోహపరిచే సుగంధాలు వెదజల్లుతూ బంగారు…

  • మార్చి 12, 2020

    ఒక కన్నియ ప్రార్థన… జోసెఫ్ ఫ్యుర్టాడో, గోవా, భారతీయ కవి

    ఒక కన్నియ ప్రార్థన… జోసెఫ్ ఫ్యుర్టాడో, గోవా, భారతీయ కవి

    ప్రియతమా! అప్పుడే సంవత్సరం గడిచిపోయింది నువ్వు నా జీవితభాగస్వామిగా ఉంటానని ప్రమాణం చేసి, పైనున్న దేవతల సాక్షిగా ముద్దిడి ప్రమాణాలు చేసుకున్నాం ఆ ప్రమాణాలు నిలుపుకుంటామనీ బాస చేసుకున్నాం ఇపుడు రాత్రీ పగలూ పైనున్న దేవతలని ప్రార్థిస్తున్నాను మన బాసలు కలకాలం నిలిచేలా దయతో అనుగ్రహించమని. ఒళ్ళెరగని గాఢమైన నిద్రలో మునిగినపుడు ప్రతిరాత్రీ నీ ముఖం నా కలలో కనిపిస్తుంటుంది ఆతృతగా నిన్ను కాగలించుకుందికి పరిగెత్తుతానా, అంతలో తెలివి వచ్చి, కల మోసంచేసిందని తెలుస్తుంది అప్పుడు నా…

  • మార్చి 12, 2020

    ఏ చూపు?… పూండి శేషాద్రి, భారతీయ కవి

    నీ చూపుల్లో ఏది నా గుండెపై గాఢ ముద్రవేసిందనిచెప్పను? ఆ రోజు సాయంత్రం … అలవాటుగా నువ్వు సన్నగా చిరునవ్వు నవ్వుతూ సరదాగా పేరుపెట్టి గట్టిగా పిలుస్తూ చూసావే ఆ చూపని చెప్పనా? ఒక రోజు ఊరికి దూరంగా, సమీపంలోని అడవిలోకి కారులో వెళ్ళినపుడు, కాలమహిమచే శిధిలమై నలుదిక్కులా పడి ఉన్న అమహావృక్షాల మౌనముద్రలు చూసి ఆశ్చర్యపడినదా? నేను కొత్తగా రాసిన కవిత్వ పుస్తకంపై వాలి ఒక్కొక్క కవిత గురించి అడిగినప్పటిదా? లేక, ఆ రోజు రాత్రి…

←మునుపటి పుట
1 … 17 18 19 20 21 … 256
తరువాయి పుట→

Website Powered by WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: కుకీ విధానం
 

Loading Comments...
 

    • Subscribe Subscribed
      • అనువాదలహరి
      • Join 114 other subscribers
      • Already have a WordPress.com account? Log in now.
      • అనువాదలహరి
      • Subscribe Subscribed
      • నమోదవ్వండి
      • లోనికి ప్రవేశించండి
      • ఈ విషయాన్ని నివేదించండి
      • సైటుని రీడరులో చూడండి
      • చందాల నిర్వహణ
      • ఈ పట్టీని కుదించు